భారత్‌లో విడుదలైన కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్‌ ఎడిషన్‌'; ధర & వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో కొత్త ఎక్స్‌1 20 ఐ టెక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్‌ ఎడిషన్‌ ధర రూ. 43 లక్షలు. ఈ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయడానికి వేచి చూస్తున్న వినియోగదారులు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్‌ ఎడిషన్‌'; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20 ఐ టెక్‌ ఎడిషన్‌ మోడల్ ఇప్పుడు ఆల్పైన్ వైట్ మరియు ఫైటోనిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. ఇది 2.0-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 192 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్‌ ఎడిషన్‌'; ధర & వివరాలు

ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20 ఐ టెక్‌ ఎడిషన్‌లో స్టీరింగ్ వీల్‌తో తెడ్డు షిఫ్టర్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌తో బ్రేకింగ్ ఫంక్షన్ స్టాండర్డ్ గా అందించబడతాయి. ఈ ఎస్‌యూవీలో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కంట్రోల్ స్విచ్ ఉపయోగించి డ్రైవర్ ఇప్పుడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్ మరియు స్పోర్ట్.మోడ్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్‌ ఎడిషన్‌'; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20 ఐ టెక్‌ ఎడిషన్ చాలా మంచి డిజైన్‌ను కలిగి ఉంది. ఎస్‌యూవీ ముందు భాగంలో పెద్ద బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ గ్రిల్ మరియు ఎయిర్ ఇన్టేక్ కోసం పెద్ద రేడియేటర్ గ్రిల్‌ను పొందుతుంది. అంతే కాకుండా ఇది ఎల్‌ఈడీ టెయిల్ లైట్, ఫాగ్‌ల్యాంప్‌లతో ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ను పొందుతుంది, కావున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20 ఐ టెక్ ఎడిషన్‌లో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది. దీనితో పాటు ఇందులో 6 కలర్ యాంబియంట్ లైట్స్, మెమరీ ఫంక్షన్‌తో ఆటోమేటిక్ సర్దుబాటు చేయగల సీటు, సెంటర్ ఆర్మ్‌రెస్ట్ మరియు కప్ హోల్డర్ లభిస్తాయి. ఈ కారుకు 500 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, అయితే ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు బూట్ స్పేస్ 1,550 లీటర్ల వరకు పెంచవచ్చు.

భారత్‌లో విడుదలైన కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్‌ ఎడిషన్‌'; ధర & వివరాలు

ఈ కొత్త ఎస్‌యూవీ ఐడ్రైవ్ కంట్రోల్ మరియు నావిగేషన్‌తో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 20 ఐ టెక్ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సిస్టమ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, బిఎమ్‌డబ్ల్యూ హెడ్-అప్ డిస్ప్లే మరియు కొత్త 205W హై-ఫై లౌడ్‌స్పీకర్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్‌ ఎడిషన్‌'; ధర & వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20 ఐ టెక్ ఎడిషన్‌లోని విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డిటిసి), కార్నింగ్ బ్రేకింగ్ కంట్రోల్ (సిబిసి), ఆటో హోల్డ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ సెన్సార్‌ వంటి కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
BMW X1 20i Tech Edition Launched In India. Read in Telugu.
Story first published: Friday, July 16, 2021, 10:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X