Just In
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- Movies
రిలీజ్‌కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- Sports
రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- News
COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్: ఒక్కరోజులోనే అమ్ముడైపోయిన బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్!
బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ 3-సిరీస్ లైనప్‌లో కొత్త ఎమ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ 'ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్'ను మార్చి 10, 2021వ తేదీన రూ.62.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

అయితే, ఈ కారును మార్కెట్లోకి విడుదల ఒక్క రోజులోనే మొదటి బ్యాచ్ అమ్మకాలు మొత్తం పూర్తయ్యాయని కంపెనీ ప్రకటించింది. కొత్తగా ఈ కారును బుక్ చేసుకునే కస్టమర్లను వెయిటింగ్ లిస్ట్‌లో పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌లో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్‌గా వచ్చిన ఈ కొత్త ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారును కంపెనీ భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తోంది. అయినప్పటికీ, ఈ కారు యొక్క మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తయినట్లు కంపెనీ ప్రకటించడం గమనార్హం.
MOST READ:కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

కాగా, ఈ మోడల్ కోసం ఇప్పటి వరకూ ఎన్ని యూనిట్ల బుకింగ్స్ వచ్చాయనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బిఎమ్‌డబ్ల్యూ ఈ కారును విదేశాల సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్ రూపంలో దిగుమతి చేసుకొని, మనదేశంలోనే అసెంబుల్ చేస్తోంది.

అంతేకాకుండా, భారతదేశంలో అసెంబల్ అవుతున్న మొట్టమొదటి ఎమ్ సిరీస్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ కూడా ఇదే (ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్) కావటం విశేషం. కంపెనీ విక్రయిస్తున్న ఇతర ఎమ్ పెర్ఫార్మెన్స్ కార్లను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారత్‌కు సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది.
MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారులో శక్తివంతమైన 3.0-లీటర్ ఇన్-లైన్, 6-సిలిండర్ ట్విన్-స్క్రోల్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5800 ఆర్‌పిఎమ్ వద్ద 387 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1800-5000 ఆర్‌పిఎమ్ మధ్యలో 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ కారు కేవలం 4.4 సెకన్లలోనే గంటకు సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.
MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

ఈ పెర్ఫార్మెన్స్ వెర్షన్ స్పోర్ట్స్ సెడాన్‌లో కారు పనితీరును పెంచే అంశాలతో పాటుగా ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్‌లు, బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, రెండు చివర్లలో అగ్రెసివ్‌గా కనిపించే బంపర్లు, రియర్ స్పాయిలర్ మరియు స్టైలిష్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

క్యాబిన్ లోపల కాంట్రాస్ట్ బ్లూ స్టిచింగ్‌తో బ్లాక్‌లో ఆల్కాంటారా / సెన్సాటెక్ కాంబినేషన్ అప్‌హోలెస్ట్రీ, 12.3 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, జెస్చర్ కంట్రోల్, హెడ్స్ అఫ్ డిస్‌ప్లే, త్రీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.
MOST READ:గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారులో ఎకో ప్రో, కంఫర్ట్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. డ్రైవర్ ఎంచుకునే డ్రైవింగ్ మోడ్‌లను బట్టి కారులోని సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సర్దుబాటు అవుతుంది. మా డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేసింది - పూర్తి సమీక్ష కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.