Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Sports
RCB vs RR: ప్రతీకారం తీర్చుకున్న దూబే.. మెరిసిన తేవాతియా! బెంగళూరు లక్ష్యం 178!
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ బుకింగ్స్ ఓపెన్
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, దేశీయ విపణిలో మరో కొత్త ఎమ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌లో ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ కోసం కంపెనీ నేటి (మార్చి 5, 2021వ తేదీ) నుండి బుకింగ్‌లను ప్రారంభించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ వేరియంట్‌ను మార్చి 11, 2021వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ మోడల్‌ను పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నారు. ఆసక్తిగల కస్టమర్లు ఈ కారుని లక్ష రూపాయల టోకెన్ అడ్వాన్స్‌ను చెల్లించడం ద్వారా బిఎమ్‌డబ్ల్యూ ఆన్‌లైన్ షాప్ నుండి బుక్ చేసుకోవచ్చు.

ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారును కొనుగోలు చేసే మొదటి 40 మంది వినియోగదారులకు భారతదేశంలోని ఐకానిక్ రేస్ ట్రాక్‌పై కంపెనీ ప్రత్యేక డ్రైవర్ శిక్షణను అందించబోతోంది. కొత్త కస్టమర్లు బిఎమ్‌డబ్ల్యూ యొక్క సర్టిఫైడ్ ట్రైనర్ నుండి రేస్ లైన్ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు.
MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

ఈ శిక్షణ సహాయంతో, కస్టమర్లు తమ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారుని పూర్తిస్థాయిలో ఆస్వాదించగలుగుతారని కంపెనీ పేర్కొంది. అధిక ఇంజిన్ పనితీరు, ఎమ్-స్పెసిఫిక్ ఛాస్సిస్ ట్యూనింగ్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ మరియు ఎమ్ స్పోర్ట్ రియర్ డిఫరెన్షియల్ వంటి లక్షణాలతో రూపుదిద్దుకున్న ఈ కారు గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారును మరింత స్పోర్టీగా మార్చుకోవాలనుకునే ఔత్సాహికుల కోసం ఎంథూసియస్ట్ ప్యాక్, రేసర్ ప్యాక్ మరియు మోటార్‌స్పోర్ట్ ప్యాక్ అనే మూడు కస్టమైజ్డ్ ప్యాకేజ్‌లను కంపెనీ అందిస్తోంది. వీటితో పాటుగా బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ పెర్ఫార్మెన్స్ యాక్సెసరీస్ ప్యాకేజీని కూడా కంపెనీ అందించనుంది.
MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

కస్టమర్లు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ఈ కస్టమైజ్డ్ ప్యాక్‌లతో తమ కారును తమకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజ్‌లతో కస్టమైజ్ చేసుకున్న కారు యొక్క బాహ్య మరియు లోపలి భాగాలను 360-డిగ్రీల వీక్షణతో కూడా చూడవచ్చు.
బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ కారును వెబ్‌సైట్‌లో కస్టమర్లు తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకున్న తర్వాత, నేరుగా బుకింగ్ పేజీకి వెళ్లి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా డెలివరీ లభిస్తుంది. ఈ ఎమ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ను బిఎమ్‌డబ్ల్యూ భారతదేశంలోనే అసెంబ్లింగ్ చేస్తుంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో అసెంబుల్ అయ్యే బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ యొక్క మొదటి పెర్మార్మెన్స్ కారు కూడా ఇదే. ఇదివరకు బిఎమ్‌డబ్ల్యూ తమ ఎమ్ పెర్ఫార్మెన్స్ కార్లను విదేశాల్లో తయారు చేసి, పూర్తిగా తయారైన యూనిట్ (సిబియూ) రూట్‌లో ఇండియాలో దిగుమతి చేసుకుని విక్రయించేంది.
MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారులో శక్తివంతమైన 3.0-లీటర్ ఇన్-లైన్, 6-సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 374 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

ఇక ఈ కారులో లభించబోయే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది, ఇది సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ-డ్రైవ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో జెస్చర్ కంట్రోల్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, త్రీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఫీచర్లు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా, స్టాండర్డ్ 3-సిరీస్ కారులో లభించే అనేక ఇతర ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ మోడల్‌ను స్థానికంగా భారతదేశంలోనే అసెంబుల్ చేస్తున్న కారణంగా ఈ మోడల్ సరసమైన ధరకే అందుబాటులోకి రావచ్చని అంచనా.