భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) భారతదేశంలో తమ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిజానికి బిఎమ్‌డబ్ల్యూ ఇండియా (BMW India) ఈ 2021 క్యాలెండర్ ఇయర్ లో భారత లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌పై పెద్దగా శ్రద్ధ చూపలేదని తెలుస్తోంది. అందుకే, వచ్చే ఏడాది ఈ విభాగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

భారతదేశంలో దాదాపు అన్ని ప్రముఖ లగ్జరీ కార్ బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాయి. ఆడి నుండి ఇట్రోన్, మెర్సిడెస్-బెంజ్ నుండి ఈక్యూసి, జాగ్వార్ నుండి ఐ-పేస్ వంటి లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే భారత మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా, అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ టెస్లా కూడా, తమ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో విడుదల చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు కూడా ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో, ఎలక్ట్రిక్ కారు గురించి బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం ఔత్సాహికులకు నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

అయితే, తాజా సమాచారం ప్రకారం, బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త ఐ4 (BMW i4) ఎలక్ట్రిక్ ఫోర్ డోర్ కూప్ మోడల్ కారును వచ్చే ఏడాది భారతదేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ జర్మన్ బ్రాండ్ వచ్చే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిఫైడ్ వాహనాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ కంపెనీ వచ్చే ఏడాది ముందుగా మినీ కూపర్ ఎస్‌ఈని లాంచ్ చేసే అవకాశం ఉంది మరియు ఇది యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని విడుదల కాబోతోంది. ఆ తర్వాత భారతదేశంలో మరో రెండు పెద్ద మోడళ్లను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

వాటిలో మొదటిది iX SUV, ఇది వచ్చే ఏడాది BMW లోగోను తాకిన మొదటి EV అవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత బిఎమ్‌డబ్ల్యూ తమ ఆల్-ఎలక్ట్రిక్ BMW i4 ఫోర్-డోర్ కూప్ సెడాన్ ను భారతదేశంలో విడుదల చేయవచ్చని సమాచారం. ఈ ఏడాది మార్చి నెలలోనే బిఎమ్‌డబ్ల్యూ తమ ఐ4 ఎలక్ట్రిక్ కూప్ మోడల్ ను అంతర్జాతీయంగా విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ ఎలక్ట్రిక్ కారు విడుదల గురించి ఖచ్చితమైన ప్రారంభ తేదీని విడుదల చేయనప్పటికీ, ఇది 2022 మధ్య నాటికి అమ్మకానికి రావచ్చని భావిస్తున్నారు.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్ 4,783 మిమీ పొడవు, 1,852 మిమీ వెడల్పు మరియు 1,448 మిమీ ఎత్తును కలిగి ఉండి, పరిమాణంలో దాని IC (ఇంటర్నల్ కంబషన్) ఇంజన్ 3-సిరీస్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును CLAR ప్లాట్‌ఫారమ్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదనంగా, ఈ కూపే సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ 4-సిరీస్ కు సమానమైన ఎక్స్టీరియర్ ఆకృతులను కలిగి ఉంటుంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త BMW i4 ఫోర్-డోర్ కూపే ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క ప్రధాన డిజైన్ వివరాలను గమనిస్తే, ఇందులో షట్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, రేపర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు ఎక్స్టీరియర్స్ లో ప్రత్యేకమైన బ్లూ హైలైట్‌లు ఉంటాయి. ఈ బ్లూ కలర్ డీటేలింగ్స్ ఇతర వాహనాలతో దీనిని ప్రత్యేకంగా ఉంచేందుకు మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ అని గుర్తు చేసేందుకు సహకరిస్తాయి.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఈ ఎలక్ట్రిక్ కూప్ మోడల్ కారులో పెద్ద 14.9 ఇంచ్ కర్వ్ డిజిటల్ డిస్‌ప్లే, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఆప్షనల్ వెంటిలేటెడ్ సీట్లు మరియు 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. కొత్త BMW i4 ఎలక్ట్రిక్ సెడాన్ ఈ విభాగంలో పోర్ష్ టేకాన్ మరియు ఆడి ఈ-ట్రోన్ జిటి వంటి మోడళ్లతో పోటీ పడగలదు. కానీ, ప్రస్తుతానికి ఈ మోడల్ కి భారతదేశంలో ఎలాంటి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు. నిజానికి, బిఎమ్‌డబ్ల్యూకి కి పెద్ద ప్లస్ పాయింట్ గా మారుతుంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

బిఎమ్‌డబ్ల్యూ ఐ4 ఎలక్ట్రిక్ కూప్ మోడల్ దాని ఐసి వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ 4 సిరీస్ గ్రాన్ కూప్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా, ఈ వాహనం టెస్లా మోడల్ 3 వంటి ఎలక్ట్రిక్ కార్లకు సమానంగా ఉంటుంది. ఐ4 ఎలక్ట్రిక్ కారును eDrive 40 (RWD) మరియు M50 (AWD) అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేసే అవకాశం ఉంది. వీటిలో మొదటిది మరియు బేస్ వేరియంట్ అయిన ఈడ్రైవ్ 40 (రియల్ వీల్ డ్రైవ్) భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

గ్లోబల్ మార్కెట్‌ లలో విక్రయించబడుతున్న ఈ ఎలక్ట్రిక్ కారులో రియల్ వీల్ డ్రైవ్ వేరియంట్ లో ఒక ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. BMW i4 eDrive40 వేరియంట్ గరిష్టంగా 340 బిహెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేయగలదు. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకోగలదు. ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు పంపిణీ చేయబడుతుంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

ఇక ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ అయిన BMW i4 M50 XDrive లో అమర్చిన ఫ్రంట్ మోటార్ గరిష్టంగా 258 బిహెచ్‍‌పి శక్తిని మరియు వెనుక మోటార్ 313 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు మోటార్లు కలిసి గరిష్టంగా 544 బిహెచ్‌పిల శక్తిని మరియు 795 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. స్పోర్ట్ బూస్ట్ మోడ్‌తో కూడిన BMW i4 ఫోర్-డోర్ కూపే సెడాన్ యొక్క ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్ కేవలం 3.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

భారతదేశానికి రానున్న సరికొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్; లాంచ్ ఎప్పుడంటే..?

ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు కూడా శక్తివంతమైన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో రానున్నాయి. ప్రస్తుతానికి, కంపెనీ ఈ బ్యాటరీ ప్యాక్ వివరాలను వెల్లడించలేదు. అయితే, ఇందులోని రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ సింగిల్ చార్జ్ పై 590 కిమీ WLTP రేంజ్ ను మరియు టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ ఫుల్ ఛార్జ్ పై గరిష్టంగా 510 కిమీల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సర్టిఫై చేయబడింది.

Most Read Articles

English summary
Bmw plans to launch the all new i4 electric coupe in india by next year details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X