బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ తన ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 56.50 లక్షలు. ఈ కొత్త వేరియంట్‌కు ముందు, ఈ మోడల్ 30ఐ లగ్జరీ లైన్ మరియు 20డి లగ్జరీ లైన్‌తో సహా మరో రెండు వేరియంట్లలో లభించింది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ డిజైన్, ఆల్ సైడ్స్ బ్లాక్ హై గ్లోస్ ఎలిమెంట్ బాడీ, కార్నరింగ్ ఫంక్షన్‌తో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి ఫాగ్ లైట్, క్రోమ్ ఫినిష్ ఎగ్జాస్ట్ పైప్, ఎల్‌ఇడి టెయిల్ లైట్, అల్యూమినియం రూఫ్ రైల్ మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

ఈ కారు యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో స్పోర్ట్స్ సీట్లు, స్పోర్ట్స్ లెదర్ స్టీరింగ్, బిఎమ్‌డబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ ప్లస్, నావిగేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్, పార్క్ అసిస్ట్ విత్ రియర్ వ్యూ కెమెరా, 205 డబ్ల్యు మ్యూజిక్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పెడల్స్ షిఫ్టర్ ఉన్నాయి.

MOST READ:జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్‌కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

ఇది 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 5.1 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అనలాగ్ స్పీడో మరియు టాకోమీటర్, ఆటో స్టార్ట్ స్టాప్‌ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో అప్హోల్స్ట్రే కోసం, సెన్సాటెక్ కాన్బెర్రా బేజా మరియు సెన్సాటెక్ బ్లాక్ చేర్చబడ్డాయి.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్ మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్, అటెండెన్స్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్ విత్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ మొబిలైజర్, క్రాష్ సెన్సార్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటు ఉన్నాయి.

MOST READ:ఫాస్ట్‌ట్యాగ్‌ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్ లో, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉటుంది. ఇది 252 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది, దీనికి 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. ఈ మోడల్ ఇప్పుడు డీజిల్ ఇంజన్ లో కూడా లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ త్వరలో 3 సిరీస్‌లో కొత్త ఎం పెర్ఫార్మెన్స్ మోడల్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ కారు మార్చి 2021 న భారతదేశంలో విడుదల కానుంది. ఈ కారు భారతదేశంలో అడుగుపెట్టనున్న బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ యొక్క మొదటి పెర్ఫార్మెన్స్ కారు కానుంది.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

బిఎమ్‌డబ్ల్యూ నుంచి విడుదలైన కొత్త ఎక్స్‌3 ఎక్స్‌డ్రైవ్ 30ఐ స్పోర్ట్‌ఎక్స్.. వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3 40ఐ ట్రాక్షన్ మరియు పవర్ కోసం 4-వీల్ డ్రైవ్ మరియు ఎక్స్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇందులో ఉన్న 3.0-లీటర్ ఇన్-లైన్, 6-సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్, 374 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బిఎండబ్ల్యు తన బ్రాండ్ నుంచి కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం వల్ల మరింత కొత్త వినియోగదారులను ఆకర్షించగలదు. కావున ఈ కారణంగా కంపెనీ మంచి అమ్మకాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
BMW X3 xDrive30i SportX Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X