లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

లంబోర్ఘిని బ్రాండ్ కార్లు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాయి. ఈ కార్లు అత్యంత ఖరీదైనవి, అంతే కాదు ఇవి చాలా లగ్జరీగా కూడా ఉండడం వల్ల, ఎంతో మంది సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు మొదలైన వారు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. సినీ పరిశ్రమలో చాలామంది హీరోలు మరియు హీరోయిన్లు ఈ కార్లను కలిగి ఉన్నారు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

నివేదికల ప్రకారం బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కొత్త లగ్జరీ లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్‌ను కొనుగోలుసి చేసినట్లు తెలిసింది. ఈ లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్‌ ధర షోరూమ్ ప్రకారం అక్షరాలా రూ. 3.43 కోట్లు. రణవీర్ సింగ్ రెడ్ కలర్ లంబోర్ఘిని ఉరుస్ కారును 2019 చివరిలో కొనుగోలు చేశారు.

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

ఈ లంబోర్ఘిని ఉరుస్ అంతర్జాతీయ మార్కెట్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన లగ్జరీ కార్లలో ఒకటి. రణవీర్ సింగ్ కొనుగోలు చేసిన ఈ కారు యొక్క వెలుపలి భాగం అరాన్సియో బోరియాలిస్ షేడ్ ఫినిషింగ్‌తో ఉంది. ఈ కారుకు 22 ఇంచెస్ నాథ్ వీల్స్ కూడా ఉన్నాయి.

MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

రణ్‌వీర్ సూపర్ యొక్క ఈ కొత్త లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్‌ డ్యూయల్ టోన్ కలర్ ఉంది. కావున ఇది ఆరెంజ్ కలర్‌తో బ్లాక్ కలర్ రూఫ్‌ను కలిగి ఉంది. ఇందులో ఉన్న షైనీ బ్లాక్ థీమ్ ఈ కారు యొక్క బంపర్, రాకర్ కవర్లు, రియర్ డిఫ్యూజర్ మరియు స్పాయిలర్ లిప్ మరియు టెయిల్‌గేట్ రిమ్స్ వంటి వాటి వరకు విస్తరించి ఉంటుంది.

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్‌ను కంపెనీ రణ్‌వీర్ సింగ్ యొక్క నివాసమైన ముంబైలో అందజేశారు. రణ్‌వీర్, ఆయన భార్య మరియు నటి దీపికా పదుకొనే ఆదివారం రాత్రి బెంగళూరు నుంచి ముంబైకి తిరిగి వచ్చారు.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

ఈ కొత్త లంబోర్ఘిని ఉరుస్ పెర్ల్ క్యాప్సూల్ ఎడిషన్‌లో 4.0-లీటర్ 8-సిలిండర్ ట్విన్-టర్బో వి 8 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 650 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఉరుస్ లంబోర్ఘిని సంస్థ యొక్క అత్యంత శక్తివంతమైన కార్లలో ఒకటి.

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

ఈ లగ్జరీ కారు గంటకు 0 నుంచి 100 కిమీ వరకు కేవలం 3.6 సెకన్లలో వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 305 కి.మీ. లంబోర్ఘిని ఉరుస్ కారును కొనుగోలు చేసిన ప్రముఖులలో బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ, హీరో కార్తీక్ ఆర్యన్, జూనియర్ ఎన్టీఆర్ మరియు ఇప్పుడు నటుడు రణవీర్ సింగ్ మొదలైన వారు ఉన్నారు.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన థార్ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

లంబోర్ఘిని ఉరుస్ వోక్స్వ్యాగన్ గ్రూప్ యొక్క MLB ఎవో ప్లాట్‌ఫాంపై ఆధారపడింది. లంబోర్ఘిని ఉరస్ స్లిమ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్లు మరియు టైల్ లైట్‌లను కలిగి ఉంది. ఉరుస్ కారు డిజైన్ దాదాపుగా లంబోర్ఘిని హురాకాన్ సూపర్ కార్ నుండి ప్రేరణ పొందింది. ఎస్‌యూవీని 22- మరియు 23-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అమర్చబడి ఉంటుంది.

లంబోర్ఘిని ఉరుస్ కొనుగోలు చేసిన మరో బాలీవుడ్ స్టార్, ఎవరో తెలుసా?

లంబోర్ఘిని కంపెనీ యొక్క కార్లలో దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన వాటిలో ఉరుస్ ప్రధానమైంది. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమ కూడా జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ మొదలైన వారు కొనుగోలు చేసినట్లు మనం తెలుసుకున్నాం. ఈ లంబోర్గిని కార్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

MOST READ:తెలంగాణాలో తయారయ్యే 'కరోనా' బస్సుల గురించి మీకు తెలుసా?

Image Courtesy: Supercars India/Instagram

Most Read Articles

English summary
Bollywood Actor Ranveer Singh Buys Lamborghini Urus Pearl Capsule Edition. Read in Telugu.
Story first published: Tuesday, May 25, 2021, 10:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X