సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఇప్పుడు ఎస్‌యూవీలకు హబ్‌గా మారిపోయింది. ఇప్పటికే మన మార్కెట్లో అనే కొత్త ఎస్‌యూవీలు అందుబాటులోకి రాగా, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఎస్‌యూవీలు మార్కెట్లో సందడి చేయనున్నాయి. వీటిలో ఒకటి ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ నుండి రాబోయే కాంపాక్ట్ ఎస్‌యూవీ.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

ఈ కొత్త ఎస్‌యూవీని సిట్రోయెన్ సి5 (కోడ్‌నేమ్ - సిసి21) పేరుతో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం, సిట్రోయెన్ ఈ చిన్న ఎస్‌యూవీని సెప్టెంబర్ 2021లో ప్రపంచవ్యాప్త ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

సిట్రోయెన్ ప్రస్తుతం భారత మార్కెట్లో సి5 ఎయిర్‌క్రాస్ అనే ఎస్‌యూవీని మాత్రమే విక్రయిస్తోంది. అయితే, కంపెనీ భారత రోడ్లపై సి3 (సిసి21) అనే మరో చిన్న ఎస్‌యూవీని విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ యొక్క కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించవచ్చని సమాచారం. ఇది ప్యూజో 208 డిజైన్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీని ఆధారంగా ఎస్‌యూవీలు, ఎమ్‌పివిలు, సెడాన్లు మరియు హ్యాచ్‌బ్యాక్‌లను తయారు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లనే కాకుండా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. స్పాట్ టెస్ట్‌లో కనిపించిన చిత్రాలను బట్టి చూస్తుంటే, ఈ సి3 మోడల్ డిజైన్ ఇంచుమించుగా దాని పెద్ద తోబుట్టువైన సి5 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే అనిపిస్తుంది.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

అధిక గ్రౌండ్ క్లియరెన్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు, వ్రాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్, అండర్ బాడీ క్లాడింగ్ వంటి డిజైన్ అంశాలను ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో గమనించవచ్చు. ఈ కారులో కారులో ఎల్ఈడి హెడ్‌లైట్లను బంపర్‌లపై అమర్చబడి ఉంటాయి మరియు వాటి పైభాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

ఈ కారులో ఆఫర్ చేయబోయే ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పలు అధునాతన టెక్ ఫీచర్లను ఈ కారులో ఆశించవచ్చు.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, సిట్రోయెన్ సి3 (సిసి 21) కారులో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను గమనిస్తే, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సిట్రోయెన్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఫ్లెక్స్ ఇంజన్‌తో అందించే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, ఇది దేశంలో మొట్టమొదటి ఫ్లెక్స్ ఇంజన్ మోడల్ అవుతుంది. ఫ్లెక్స్ ఇంజన్ అనేది ఇటు పూర్తిగా పెట్రోల్ మరియు అటు పూర్తిగా ఇథనాల్ ఇంధనాలతో పనిచేస్తుంది.

సిట్రోయెన్ నుండి త్వరలో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ; డీటేల్స్!

పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఉద్గార నిబంధనలలో మార్పు కారణంగా, రాబోయే కొన్నేళ్లలో ఫ్లెక్స్ ఇంజన్ల వాడం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో, సిట్రోయెన్ సి3 ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్, టాటా నెక్సాన్, రెనో కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Citroen c3 compact suv india launch expected soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X