భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) భారతదేశంలో ఇటీవల తమ మొట్టమొదటి కారు సి5 (C5) ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఈ కంపెనీ ఇప్పుడు దేశీయ విపణిలో తమ రెండవ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

భారత మార్కెట్లో C5 మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసిన తర్వాత కంపెనీ ఇప్పుడు కొత్తగా C3 అని పిలవబడే సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయనుంది. Citroen గత కొంత కాలంగా తమ C3 మోడల్ ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇప్పుడు ఈ పరీక్షలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

తాజా నివేదికల ప్రకారం, Citroen వచ్చే నెలలో (సెప్టెంబర్ 16వ తేదీన) తమ C3 ఎస్‌యూవీ ని భారతదేశంలో అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. Citroen C3 కారును ఒకేసారి చెన్నై సమీపంలోని తిరువళ్లూరులోని కార్ల తయారీ ప్లాంట్ లో మరియు బ్రెజిల్ లోని పోర్టో రియల్ ప్లాంట్ లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ కలిగిన మొట్టమొదటి కారు Citroen C3!

కేంద్ర ప్రభుత్వం చొరవతో మనదేశంలో కూడా ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ల వినియోగం తెరపైకి వచ్చింది. దేశంలోని కార్ల తయారీ సంస్థలన్నీ కూడా త్వరలోనే ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్లను తయారు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తరచూ ప్రస్తావిస్తున్న సంగతి తెలిసినదే.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

ఈ నేపథ్యంలో, Citroen తమ C3 కారును ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ తో రూపొందించనున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలిగిన మొట్టమొదటి కారుగా C3 ఎస్‌యూవీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ అంటే ఇటు పూర్తిగా పెట్రోల్ తో కానీ లేదా అటు పూర్తిగా ఇథనాల్ ఇంధనంతో కానీ పనిచేసే ఇంజన్.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

Citroen C3 ఎస్‌యూవీ ఇంజన్ ఆప్షన్స్

ఓ నివేదిక ప్రకారం, Citroen C3 ఎస్‌యూవీ ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌ తో రానుంది. ఇందులోని ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ కు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఇవ్వబడుతుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

అలా కాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇథనాల్ బ్లెండెడ్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ (ఇథనాల్ ఎక్కువగా కలిపిన పెట్రోల్ ఇంధనం) తో నడిచేలా 1.6 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మనదేశంలో ప్రస్తుతం పెట్రోల్ లో 8.5 శాతం ఇథనాల్ ను కలపుతున్నారు, 2025 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

కాబట్టి, Citroen C3 ఇంజన్ ఆప్షన్స్ విషయంలో వచ్చిన నివేదికలు నిజమైనట్లయితే, ఇది భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ తో నడిచే మొట్టమొదటి కారు అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో కార్ల తయారీదారులు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌ లతో నడిచే వాహనాలను ఉత్పత్తి చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాలని యోచిస్తోంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

ఇలాంటి ఇంజన్లు కలిగిన వాహనాలు ప్రకృతికి చాలా సాన్నిహిత్యమైనవిగా ఉంటాయి మరియు వీటి నిర్వహణ కోసం ఖరీదైన పెట్రోల్ / డీజిల్ వంటి ఇంధనాల దిగుమతుల కోసం విదేశాలపై ఆదారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. దేశీయంగా లభించే పంటల వ్యర్ధాల నుండి ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చు మరియు పెట్రోల్ డీజిల్ కన్నా చాల తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

C3 అభివృద్ధిలో Tata Motors సాయం తీసుకున్న Citroen

Citroen తమ C3 ఎస్‌యూవీని కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (CMP) పై నిర్మించబడింది. C3 ఎస్‌యూవీ ధరను తగ్గించడానికి కంపెనీ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ ఎస్‌యూవీ అభివృద్ధిలో Tata ఇంజనీర్ల సహాయం తీసుకొని ఈ కారుని CMP ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తోంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

Tata Motors ఇటీవల ఆవిష్కరించిన టాటా పంచ్ (Tata Punch) మినీ ఎస్‌యూవీని కూడా ఇదే తరహా CMP ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మిస్తున్నారు. ఈ డిజైన్ ప్లాట్‌ఫామ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, దీనిపైఎస్‌యూవీలు, ఎమ్‌పివిలు, సెడాన్‌లు మరియు హ్యాచ్‌బ్యాక్‌ల వంటి బాడీ టైప్ కార్లను తయారు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లతో పాటు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

Citroen C3 ఎస్‌యూవీ ఎలా ఉండబోతోంది?

Citroen ఇటీవల విడుదల చేసిన C5 ఎస్‌యూవీ మాదిరిగానే C3 ఎస్‌యూవీ కూడా ఫ్రెంచ్ ఇంజనీర్ల పనితీరును ప్రదర్శిస్తుంది. ఇందులో స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్స్, అండర్ బాడీ క్లాడింగ్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలతో రగ్గడ్ లుక్ ని కలిగి ఉంటుంది.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

ఇందులో కారు హెడ్‌లైట్లను బంపర్‌పై అమర్చబడి ఉంటాయి మరియు వాటి పైభాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను అమర్చబడి ఉంటాయి. ఇంకా ఈ కారులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ తో కూడిన పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లను కూడా ఈ కారులో ఆశించవచ్చు.

భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ కార్ Citroen C3

Citroen C3 కి పోటీ ఎవరు?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ నుండి Citroen C3 భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో Hyundai Venue, Kia Sonet, Tata Nexon, Renault Kiger మరియు Nissan Magnite వంటి పాపులర్ మోడళ్లతో పోటీపడనుంది.

Most Read Articles

English summary
Citroen c3 could be india s first flex fuel engine equipped car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X