సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ భారత మార్కెట్లో ఎట్టకేలకు తన సి5 ఎయిర్‌క్రాస్‌ను విడుదల చేయడం ద్వారా ప్రవేశించింది. కంపెనీ ఈ కొత్త సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని విడుదల హేసినా తరువాత బుకింగ్స్ కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

సిట్రోయెన్ ఇండియా నివేదికల ప్రకారం, ఇప్పుడు గుజరాత్ మరియు చండీగర్ రాష్ట్రాల్లో సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని హోమ్ డెలివరీ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. సి5 ఎయిర్‌క్రాస్ ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ హోమ్ డెలివరీ జరుగుతోంది.

సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి మరియు కస్టమర్లకు మరింత అనుకూలంగా ఉండటానికి, కాంటాక్ట్‌లెస్ మరియు డిజిటల్ కార్ కొనుగోలు అనుభవాన్ని ప్రోత్సహించడానికి ఈ విధానం అమలుచేసింది. ఈ విధానం ద్వారా కొనుగోలుదారులు ఇంటి వద్దనుంచే ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

ఈ విధంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వినియోగదారులకు, సి5 ఎయిర్‌క్రాస్ తమిళనాడులోని తిరువల్లూరులోని కంపెనీ ఫ్యాక్టరీ నుండి నేరుగా కస్టమర్ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. ఈ సర్వీస్ ప్రస్తుతం కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, రాజస్థాన్ మరియు మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది.

సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

సిట్రోయెన్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్‌లో 3 డి కాన్ఫిగరేటర్ మరియు డేడికేట్ ఈ-సేల్స్ అడ్వైసర్ అందుబాటులో ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ దీని కోసం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, యాన్యువల్ మెయింటెనెన్స్ ప్యాకేజీ, ఎక్స్టెండెడ్ వారంటీ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 29.90 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 31.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఫీల్ మరియు షైన్ వేరియంట్స్.

సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ మంచి అప్డేటెడ్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అదే విధంగా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండి, వాహనదారునికి చాలా అనుకూలమైన డ్రైవింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.

సి5 ఎయిర్‌క్రాస్‌ హోమ్ డెలివరీస్ ప్రారంభించిన సిట్రోయెన్; పూర్తి వివరాలు

సి5 ఎయిర్‌క్రాస్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందించబడింది. ఈ ఇంజన్ 176 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ భారత మార్కెట్లో, జీప్ కంపాస్, ఫోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్ స్పేస్ మరియు హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Citroen India Begins Home Delivery Of Online Booked C5 Aircross. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X