మళ్ళీ పొడిగించబడిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

కరోనా మహమ్మారి యొక్క సెకండ్ వేవ్ మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసింది. అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ ఈ వైరస్ ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రవాణా శాఖ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు పర్మిట్ వంటి వాటిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

ఈ నిబంధన ప్రకారం ఇప్పుడు అన్ని రకాల ఫిట్‌నెస్, పర్మిట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ గడువు 2021 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అయ్యేలా పరిగణించాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులను ఆదేశించింది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

వాహనదారుల యొక్క డాక్యుమెంట్స్ గడువు 2021 సెప్టెంబర్ 30 నాటికి ముగుస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందటానికి వాహనదారులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

ఈ క్లిష్ట సమయంలో పనిచేస్తున్న వాహనదారులకు, అనేక ఇతర సంస్థల వేధింపులకు గురికాకుండా ఉండటానికి మరియు వారు ఇబ్బందులను ఎదుర్కోకూడదని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సలహాను అమలు చేయాలని అభ్యర్థించినట్లు మంత్రిత్వ శాఖ సమాచారంలో పేర్కొంది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మోటారు వాహనాల చట్టం, 1988 మరియు సెంట్రల్ మోటార్ మోటారు వాహనాల చట్టం, 1988 కు సంబంధించిన పత్రాల చెల్లుబాటును పొడిగించడం గురించి 30 మార్చి 2020, 9 జూన్ 2020, 24 ఆగస్టు 2020, 27 డిసెంబర్ 2020 మరియు 26 మార్చి 2021 న ముందస్తు సలహాలు జారీ చేసినట్లు కూడా ఇంతకు ముందు తెలిసింది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

వాహనదారులు వాహనాలను డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి, కావున చాలామంది వాహనదారులు ఈ లైసెన్స్ కోసం చాలా రోజులపాటు ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం దీనిని మరింత సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

ఇందులో భాగంగానే పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు విజయవంతగా ఉత్తీర్ణత సాధించిన తర్వాత వారు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే సమయంలో వారికి అక్కడ ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ నిర్వించబోరు. కానీ ప్రస్తుతం ఇది మొత్తం ఆర్.టి.ఓ చూసుకుంటుంది. కానీ ఇకపై ఆర్.టి.ఓ కార్యాలయంలో ఇటువంటివి ఉండవని రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ఈ నియమం 2021 జులై 01 నుంచి అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్ లో చేరే అభ్యర్థులకు దీనిపై అవసరమైన ట్రైనింగ్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉంటుంది, కావున ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

దీనికి సంబంధించిన మొత్తం ప్రక్రియ మానవ ప్రమేయం లేకుండా మొత్తం టెక్నాలజీ ద్వారా సాగుతుంది. ఈ విధానం ద్వారా ఎలాంటి అవకతవకలకు తావు ఉండదు. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత అది సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది.

మళ్ళీ పొడిగించిన DL & RC గడువు.. ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడంటే

లెర్నర్స్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మహారాష్ట్ర మరియు ఢిల్లీలో ప్రారంభించబడింది. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఇప్పుడు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి లెర్నింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. ఈ విధానం చాలా సులభతరంగా సాగుతుంది.

Most Read Articles

English summary
Validity Of Driving License, RC, Permit Extended Till September 30. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X