ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

భూమిలో శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ మరియు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. ఈ విభాగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అనేక కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఉత్తమ ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకు వస్తున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో చార్జింగ్ సమస్యను అధిగమించేందుకు కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయడంపై కూడా అనేక కంపెనీలు మరియు బృందాలు పనిచేస్తున్నాయి. తాజాగా, ఈ తరహా టెక్నాలజీనే అభివృద్ధి చేశారు కొందరు డచ్ విద్యార్థులు. వీరు కారు పైభాగంలో అమర్చిన సౌర ఫలకాల (సోలార్ ప్యానెళ్ల) సహాయంతో శక్తిని గ్రహించి, ముందుకు సాగిపోయే ఎలక్ట్రిక్ క్యాంపర్ వాహనాన్ని అభివృద్ధి చేశారు.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

ఈ ఎలక్ట్రిక్ వాహనం పేరు స్టెల్లా వీటా (Stella Vita). ఇదొక క్యాంపర్ స్టైల్ వాహనం. అంటే, ప్రత్యేకించి వారాంతాల్లో ప్రయాణాలకు లేదా క్యాంపింగ్ ల కోసం ఉపయోగించే అవుటింగ్ వాహనం లాంటిది అన్నమాట. ఈ సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాన్సెప్ట్ మోడల్ ను విద్యార్థులు ప్రదర్శించారు. స్టెల్లా వీటా శక్తి సామర్థ్యాల గురించి విన్నవారంతా ఔరా అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

ఈ ప్రోటోటైప్ వ్యాన్ సౌరశక్తి (సోలార్ పవర్) ద్వారా ఉత్పత్తి విద్యుత్ కేవలం వాహనం యొక్క డ్రైవింగ్ కోసం మాత్రమే కాకుండా వాహనం లోని వివిధ ఆన్‌బోర్డ్ సదుపాయాలకు శక్తినిస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సోలార్ టీమ్ ఐండ్‌హోవెన్ (Solar Team Eindhoven) విద్యార్థులు ఈ స్టెల్లా వీటా ఎలక్ట్రిక్ వాహనాన్ని (Stella Vita Electric Vehicle) తయారు చేశారు.

వాహనం నడపటం కోసం పెట్రోల్, డీజిల్ లేదా సాంప్రదాయ విద్యుత్ (ట్రెడిషనల్ ఎలక్ట్రిసిటీ) వంటి వాటిపై ఆధారపడకుండా, పూర్తిగా స్వయం సమృద్ధిగా శక్తిని ఉత్పత్తి చేసుకొని ముందుకు సాగిపోయే సోలార్ పవర్డ్ (Solar Energy) వాహనాన్ని రూపొందించడంలో ఈ విద్యార్థులు విజయం సాధించారు. మంచి వాతావరణంలో (సూర్యరశ్మి ఎక్కువగా ఉండే) ఈ ఎలక్ట్రిక్ వాహనంపై రోజుకు 730 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని వారు చెబుతున్నారు.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని (Electric Vehicle) నడపడానికి అసలు ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లవలసిన అవసరమే లేదు. ఇందులో వ్యాన్ యొక్క పూర్తి పైకప్పు (రూఫ్)పై సోలార్ ప్యానెళ్లు అమర్చబడి ఉంటాయి. ఈ ప్యానెళ్ల క్రింది భాగంలో రెండు ఎక్స్‌పాండబల్ సోలార్ ప్యానెళ్లు కూడా ఉంటాయి. ఈ శక్తివంతమైన సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వాహనాన్ని నడపటానికి మాత్రమే కాకుండా, ఇతర క్యాంపింగ్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

ఈ సోలార్ రూఫ్ (Solar Roof) నుండి వచ్చే విద్యుత్ సాయంతో టెలివిజన్ చూడొచ్చు, ల్యాప్ టాప్ చార్జ్ చేసుకోవచ్చు లేదా వంటగదిలో కాఫీ తయారు చేసుకోవచ్చు మరియు క్యాంప్ సైట్‌లో రాత్రివేళ్లలో కాంతి కోసం లైట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. స్టెల్లా వీటాలో మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, క్యాంపింగ్ కోసం ఈ వాహనాన్ని ఉపయోగించాలనుకున్నప్పుడు, క్యాబిన్ లోపల ఎక్కువ స్థలం కోసం దీని రూఫ్ ని అదనంగా పైకి లేపే సౌలభ్యం కూడా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

స్టెల్లా వీటా ఎలక్ట్రిక్ వెహికల్ (Stella Vita Electric Vehicle) లోపల విశ్రాంతి, పని, వంట లేదా నిద్రించడానికి సౌకర్యవంతమైన జీవన స్థలం ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే క్యాంపర్ వ్యాన్‌ గా రూపొందించబడిన ఈ కాన్సెప్ట్ గురించి ప్రజల్లో అగాహన కల్పించేందుకు దాని తయారీదారులు ఇప్పుడు యూరప్ లో ఓ ప్రత్యేక టూర్ ని కూడా నిర్వహిస్తున్నారు.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

ఈ పర్యటనలో భాగంగా స్టెల్లా వీటా క్యాంపర్ తన శక్తి సామర్థ్యాలను ప్రజలకు ప్రదర్శిస్తుంది. ఈ వాహనాన్ని రూపొందించిన సోలార్ టీమ్ ఐండ్‌హోవెన్ లో నెదర్లాండ్స్ లోని ఐండ్‌హోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 22 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులందరూ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిని ఆప్టిమైజ్ చేయాలనే అంతిమ లక్ష్యంతో ఏడాది పొడవునా సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల రూపకల్పనపై పని చేస్తారు.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

ఫుల్ చార్జ్ పై 50 కిలోమీటర్లు వెళ్లే సైకిల్..

ఇదిలా ఉంటే, తమిళనాడుకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి భాస్కరన్ సింగిల్ చార్జ్ పై 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేశారు. కేవలం రూ. 20,000 ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేసినట్లు ఆయన తెలిపాడు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించడానికి ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపాడు.

ఈ ఎలక్ట్రిక్ వాహనానికి అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు!

భాస్కరన్ ఈ ప్రయోగం కోసం ఓ సాధారణ సైకిల్‌ను తీసుకొని, మార్కెట్లో దొరికే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి సాధారణ సైకిల్ ను ఈ-సైకిల్ గా మార్చేశాడు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పొందిన భాస్కరన్ తన తెలివినంతా ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను రూపొందించాడు. కోవిడ్ సంక్షోభం కారణంగా తన ఉద్యోగం పోయినా భాస్కరన్ మాత్రం కుంగిపోకుండా వ్యవసాయంపై దృష్టి సారించాడు. తన ఖాళీ సమయంలో ఊరికే కూర్చోకుండా ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేశాడు.

Most Read Articles

English summary
Dutch students develops solar powered electric camper van details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X