Just In
- 9 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 10 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 13 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 13 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Lifestyle
మీకు సంతానం కలగకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇక బ్యాటరీ చార్జింగ్ సమస్యే ఉండదు; కొత్తగా 500, రెండేళ్లలో 10,000 చార్జింగ్ స్టేషన్లు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇఇఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే, దేశంలో కొత్తగా 500 ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పిఎస్‌యుల జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) భారతదేశంలో ఇ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను పెంచే ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కనీసం 500 ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఈ విషయం గురించి ఇఇఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రజత్ సుద్ మాట్లాడుతూ.. గత సంవత్సరం దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంవత్సరం చాలా కష్టంగా ప్రారభమైందని, అయినప్పటికీ తాము భారతదేశంలో ఇప్పటికే 207 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని అన్నారు.
MOST READ:న్యూ ఇయర్లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

గత ఏడాది మే నెల చివరి వరకు కొనసాగిన లాక్‌డౌన్ కారణంగా ఇఇఎస్ఎల్ సరఫరా గొలుసు (సప్లయ్ చైన్) దెబ్బ తినడంతో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అంతరాయం కలిగిందని ఆయన చెప్పారు. కాగా, ఇప్పుడు తయారీదారుల నుండి సరఫరా తిరిగి ప్రారంభం కావడంతో, రవాణా సదుపాయాలు పునరుద్ధరించడంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీసం 500 ఛార్జింగ్ స్టేషన్లను వ్యవస్థాపించే దిశగా ఇఇఎస్ఎల్ ముందుకు సాగుతోందని రజత్ సుద్ చెప్పారు.

రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ఇఇఎస్ఎల్ యోచిస్తోంది. ఈ నెట్‌వర్క్ సాయంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగి, కాలుష్యం తగ్గుతుందని కంపెనీ భావిస్తోంది.
MOST READ:ఎలక్ట్రిక్ వెర్షన్లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

ఇందుకు సంబంధించి ఇఇఎస్ఎల్ ఇప్పటికే అదనంగా 1020 ఛార్జర్‌ల సేకరణను కూడా పూర్తి చేసింది. అంతేకాకుండా, సోలార్ రూఫ్, బ్యాటరీ ఆధారిత ఛార్జింగ్ స్టేషన్లు మరియు బ్యాటరీ మార్పిడి స్టేషన్లను కలుపుతూ 'కార్బన్ న్యూట్రల్ ఛార్జింగ్ స్టేషన్లు' కూడా ఏర్పాటు చేయాలని ఇఇఎస్ఎల్ ప్లాన్ చేస్తోంది.

పెట్రోల్, డీజిల్ వాహనాల ఇంధన అవసరాలను తీర్చడానికి భారత్ విదేశాల నుండి ముడి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. దీనిని తగ్గించడానికి మరియు పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్య సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయి.
MOST READ:పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, ఇదే కొత్త ధరల జాబితా!

అయితే, దేశంలో పెట్రోల్ పంపుల మాదిరిగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు లేకపోవటంతో చాలా మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆసక్తికనబరచం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనే కోరిక ఉన్నప్పటికీ, ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో చాలా మంది తిరిగి పెట్రోల్, డీజిల్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇఇఎస్ఎల్, దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అపోలో హాస్పిటల్స్, బిఎస్ఎన్ఎల్, మహా-మెట్రో, భెల్ మరియు హెచ్‌పిసిఎల్ వంటి వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో ఇఇఎస్ఎల్ ఒప్పందాలను కుదుర్చుకుంది.
MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

హైదరాబాద్, నోయిడా, అహ్మదాబాద్, జైపూర్ మరియు చెన్నై వంటి నగరాల్లోని స్థానిక సంస్థలతో ఇఇఎస్ఎల్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఆయా నగరాల్లో బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇతర సంస్థలతో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది.