ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాదు.. HiLoad ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ కూడా వస్తోంది..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మళ్లేలా చేస్తున్నాయి. మరోవైపు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ విభాగంలో డిమాండ్ ను భర్తీ చేసేందుకు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.

భారత ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మనం ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ త్రీవలర్లు మరియు ఎలక్ట్రిక్ కార్లను చూశాం. కానీ, ఇప్పుడు త్వరలోనే ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను కూడా చూడబోతున్నాం. తాజాగా, భారతీయ వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓయ్‌లర్ మోటార్స్ (Euler Motors) రూపొందిస్తున్న ఓ కొత్త ఎల్5 హైలోడ్ (L5 HiLoad) ఎలక్ట్రిక్ వాహనం యొక్క టీజర్ ను విడుదల చేసింది.

HiLoad ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ వస్తోంది..

ఓయ్‌లర్ మోటార్స్ ఎల్5 హైలోడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని కంపెనీ అక్టోబర్ 27, 2021వ తేదీన అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇందులో భాగంగానే, కంపెనీ దాని ఫ్రంట్ మరియు సైడ్ ప్రొఫైల్ వివరాలను వెల్లడించే స్కెచ్ లాంటి టీజర్ చిత్రాలను విడుదల చేసింది. ఈ టీజర్ ను బట్టి చూస్తుంటే, రాబోయే ఎల్5 హైలోడ్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ చూడటానికి పెట్రోల్/డీజిల్ వెర్షన్ కమర్షియల్ త్రీవీలర్ మాదిరిగా ఉంటుంది.

కొత్త ఓయ్‌లర్ మోటార్స్ ఎల్5 హైలోడ్ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం ఇంట్రా-సిటీ లాజిస్టిక్స్‌ లో తదుపరి మార్పులకు హామీ ఇస్తుందని తెలుస్తోంది. తాజాగా, Euler (OY-ler అని ఉచ్ఛరించాలి) మోటార్స్ విడుదల చేసిన కొత్త HiLoad L5 వాణిజ్య వాహనం టీజర్ పెద్ద ఫీచర్లు, పెద్ద శ్రేణి మరియు అతిపెద్ద లోడ్-బేరింగ్ సామర్థ్యాన్ని వాగ్దానం చేస్తుంది.

ప్రస్తుతం, పెట్రోల్ లేదా డీజిల్ తో నడిచే వాణిజ్య త్రీ-వీలర్లను ఉపయోగిస్తున్న ఆపరేటర్లను ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎల్5 హైలోడ్ ఆకర్షించనుంది. అంతేకాకుండా, అలాంటి వాహనాలతో పోల్చుకుంటే, ఈ ఎలక్ట్రిక్ త్రీవీలర్ ఆపరేటర్లకు ఇంధనంపై వెచ్చించే ఖర్చును ఆదా చేసి, నగదు పరంగా ఎక్కువ ఆదాయాలను తెచ్చిపెట్టనుంది.

గడచిన ఆగస్ట్ నెలలో Euler Motors ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన Flipkart, BigBasket మరియు Udaan వంటి రిటైలర్ల నుండి 2,500 ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేయడానికి ఆర్డర్లను అందుకుంది. ఈ కంపెనీలు ముందుగా ఈ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ఉపయోగించనున్నారు.

ఇ-కామర్స్ వ్యాపారస్తులు తమ మొదటి, మధ్య మరియు చివరి-మైలు లాజిస్టిక్స్ కార్యకలాపాలను బలోపేతం చేస్తూ, Euler వాణిజ్య EV లతో తమ గ్రీన్ క్రెడిట్‌ లను పెంచుకోవాలని ఆశిస్తున్నారు. ఓయ్‌లర్ మోటార్స్ ఇప్పటికే ఢిల్లీ ఎన్‌సిఆర్ లో కొన్ని వందల ఎలక్ట్రిక్ వాహనాలతో దేశ రాజధాని మరియు దాని శివారు ప్రాంతాలను చుట్టేస్తూ పైలట్ ప్రోగ్రామ్‌ను కూడా నిర్వహిస్తోంది.

సింగపూర్‌కు చెందిన జెట్టీ వెంచర్స్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ మరియు ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ భాగస్వామ్యంతో ఇన్వెంటస్ క్యాపిటల్ ఇండియా నేతృత్వంలోని సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా కంపెనీ రూ. 20 కోట్లకు పైగా నిధులను సేకరించింది మరియు బ్లూమ్ వెంచర్స్ నుండి కూడా పెట్టుబడిని పునరుద్ధరించింది.

ప్రస్తుతానికి Euler Motors యొక్క L5 HiLow టీజర్ ఇమేజ్ మినహా, ఇందుకు సంబంధించి వేరే ఏ ఇతర వివరాలు వెల్లడి కాలేదు. మరిన్ని వివరాలు తెలియాలంటే, రేపటి (అక్టోబర్ 27) వరకూ ఆగాల్సిందే. అయితే, కంపెనీ తీసుకుంటున్న టోన్ ప్రకారం చూస్తే, ఎలక్ట్రిక్ వాణిజ్య త్రీ-వీలర్ మార్కెట్ భవిష్యత్తును కంపెనీ పచ్చగా (పర్యావరణ సాన్నిహిత్యంగా) మార్చడానికి కొత్త విప్లవాన్ని ప్రారంభించనుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

పూర్తి చార్జ్ పై 1099 కి.మీ ప్రయాణించిన Futuricum కమర్షియల్ ట్రక్

సాధారణంగా, ఎలక్ట్రిక్ టూవీలర్లు పూర్తి చార్జ్ పై సగటున 60 నుండి 150 కిలోమీటర్లు, అదే ఎలక్ట్రిక్ కార్లు అయితే 300 నుండి 500 కిలోమీటర్ల మధ్యలో రేంజ్ ను ఆఫర్ చేస్తుంటాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కు మాత్రం పూర్తి చార్జ్ పై గరిష్టంగా 1099 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అంతేకాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం దక్కించుకుంది.

ఈ ఎలక్ట్రిక్ ట్రక్కును డిపిడి స్విట్జర్లాండ్ మరియు కాంటినెంటల్ టైర్‌లతో కలిసి యూరోప్‌లోని ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఫ్యూటరికం' (Futuricum) అభివృద్ధి చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ట్రక్ రేంజ్ పరంగా, ఇప్పటి వరకూ ఉన్న మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.

నిజానికి ఇదొక వోల్వో ట్రక్కు. స్విట్జర్లాండ్ కు చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ వోల్వో (Volvo) అందిస్తున్న ఓ ఎలక్ట్రిక్ ట్రక్కును Futuricum సంస్థ మోడిఫై చేసి, దాని బ్యాటరీ సామర్థ్యం మరియు ఎలక్ట్రానిక్ సర్క్యూట్రీని మార్చడం ద్వారా రేంజ్ ను పెంచడానికి అప్‌గ్రేడ్ చేయబడింది. ఇటీవల దీనిని కాంటినెంటల్ టైర్స్ (Continental Tyres) 2.8 కిమీ మేర వృత్తాకారంలో ఉన్న టెస్ట్ ట్రాక్ పై డ్రైవింగ్ చేయడం ద్వారా పరీక్షించి, ఈ రికార్డును స్థాపించారు.

Most Read Articles

English summary
Euler motors teases l5 hiload commercial electric vehicle details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X