భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

ఫోక్స్‌వ్యాగన్ తమ 'ఇండియా 2.0 ప్రాజెక్ట్'లో భాగంగా భారత మార్కెట్ కోసం సరికొత్త ఉత్పత్తులను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసనదే. తాజా సమాచారం ప్రకారం, ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ 'ఆర్టియాన్'ను కూడా దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

ఫోక్స్‌వ్యాగన్ ప్రస్తుతం కియా సెల్టోస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీనిచ్చేందుకు టైగన్ అనే ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఫోక్స్‌వ్యాగన్ టైగన్ భారత మార్కెట్లో కస్టమర్లకు అందుబాటులోకి రావచ్చని అంచనా.

భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

కాగా, భారత్‌లో ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ లగ్జరీ సెడాన్ రాకను కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా డైరెక్టర్ ఆశిష్ గుప్తా పిటిఐతో మాట్లాడుతూ.. ఆర్టియాన్ కారును భారతదేశానికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ లగ్జరీ కారును పూర్తిగా విదేశాల్లో తయారు చేసిన యూనిట్ (కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్) రూట్‌లో భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. ప్రస్తుతం దేశంలో అధికంగా ఉన్న దిగుమతి సుంఖాల కారణంగా, మన మార్కెట్లో ఈ లగ్జరీ కారు ధర సుమారు రూ.45 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

ఈ ఎగ్జిక్యూటివ్ క్లాస్ సెడాన్‌లో పూర్తి ఎల్ఈడి లైట్స్, వాలుగా ఉన్న పైకప్పు (రూఫ్) మరియు మజిక్యులర్ లైన్స్‌తో కూడిన బోనెట్‌, విస్తృతమైన ఫ్రంట్ గ్రిల్‌, డిజైనర్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్-అవుట్ బి-పిల్లర్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో బంపర్లపై క్రోమ్ గార్నిష్, రియర్ డిఫ్యూజర్ మరియు స్పోర్టీ క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే

భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ ఇంటీరియర్ క్యాబిన్ చాలా సింపుల్ అండ్ క్లీన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, డ్యాష్‌బ్యార్డ్‌పై పెద్ద 8 ఇంచ్ ఎమ్ఐబి3 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, 700 వాట్ హర్మన్ కార్డాన్ 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 30-కలర్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి మరెన్నో లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

ఇంజన్ విషయానికి వస్తే, ఈ లగ్జరీ కారులో శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 268 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:చెన్నైలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు

భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ వస్తోంది.. ధర తలచుకుంటేనే షాక్..!

భారతదేశంలో కొత్త ఫోక్స్‌వ్యాగన్ ఆర్టియాన్ లగ్జరీ సెడాన్ ఖచ్చితంగా ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే, మార్కెట్ అంచనా ప్రకారం, ఇది ఈ ఏడాది చివిరికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen Plans To Launch Arteon Luxury Car In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X