భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

భారత మార్కెట్లో తన ఉనికి చాటుకునేందుకు ఎఫ్‌సిఏ (ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్) తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు దేశీయ మార్కెట్లో తమ స్థానిక ఉత్పత్తి శ్రేణిని విస్తరించనున్నట్లు ఎఫ్‌సిఏ ప్రకటించింది. నాలుగు కొత్త జీప్ ఎస్‌యూవీల ఉత్పత్తి కోసం 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

తమ సరికొత్త లోకల్ వెహికల్ లైనప్‌లో 2021 మేడ్ ఇన్ ఇండియా జీప్ కంపాస్ కూడా ఉంటుందని, స్థానికంగా ఉత్పత్తి చేయబడే ఈ జీప్ కంపాస్ ప్రపంచంలోనే మొట్టమొదటి మూడు-వరుసల సీటింగ్ కలిగిన జీప్ ఎస్‌యూవీ అవుతుందని ఎఫ్‌సిఏ ఇండియా పేర్కొంది.

భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

మేడ్ ఇన్ ఇండియా కంపాస్‌తో పాటుగా తమ ఐకానిక్ జీప్ వ్రాంగ్లర్ మరియు నెక్స్ట్ జనరేషన్ గ్రాండ్ చెరోకీ మోడళ్లను కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. జీప్ బ్రాండ్‌కు గ్రాండ్ చెరోకీ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది, ఇది ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉంది.

భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

ఈ రెండు వాహనాలను కూడా రంజాంగావ్‌లోని ఎఫ్‌సిఏ జాయింట్ వెంచర్ తయారీ కేంద్రంలోనే స్థానికంగా అసెంబుల్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ నాలుగు కొత్త ఉత్పత్తులు భారత రోడ్లను తాకే అవకాశం ఉంది.

భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

ఈ విషయం గురించి ఎఫ్‌సిఏ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పార్థ దత్తా మాట్లాడుతూ, తాము వెచ్చించే 250 మిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడి ద్వారా రంజాంగావ్ నుండి వచ్చే కొత్త జీప్ ఎస్‌యూవీలు భారత కార్ మార్కెట్లోని పలు విభాగాల్లో గట్టి పోటీని ఇస్తాయని అన్నారు.

భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

ఎఫ్‌సిఏ జాయింట్ వెంచర్ ఉత్పాదక కేంద్రంలో ఉత్పత్తి చేయబడిన వాహనాల్లో స్థానికంగా తయారైన విడిభాగాల సంఖ్యను పెంచాలని నిశ్చయించుకున్నమని, భారతదేశంలో తమ ప్రణాళికలు మరియు ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని దత్తా అన్నారు.

భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

ఇదిలా ఉంటే, జీప్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో ఓ కొత్త 2021 మోడల్‌ను జనవరి 7వ తేదీన ఆవిష్కరించనుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 జీప్ కంపాస్‌‌ను సరికొత్త డిజైన్ మరియు విలాసవంతమైన ఫీచర్లతో రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. అంతేకాకుండా ఇందులో కొత్త కలర్ ఆప్షన్స్ కూడా ప్రవేశపెట్టనున్నారు.

భారత్‌లో 4 కొత్త జీప్ ఎస్‌యూవీలను విడుదల చేస్తాం: ఫియట్

భారత మార్కెట్ కోసం జీప్ కంపాస్‌లో కంపెనీ ఓ 7-సీటర్ వెర్షన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ లగ్జరీ సెవన్ సీటర్ జీప్ కంపాస్‌ను హెచ్6 అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. ఇది 2022లో ప్రారంభించబడుతుందని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, January 5, 2021, 15:46 [IST]
English summary
FCA To Launch 4 New Jeep SUVs In India In Coming Years. Read in Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+