కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ (Force Motors) ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం 2021 ఫోర్స్ గుర్ఖా (2021 Force Gurkha) ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. మహీంద్రా థార్ కి పోటీగా వచ్చిన ఈ ఆఫ్-రోడర్ పై కంపెనీ ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ (Free Roadside Assistance) ను అందిస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీని కొనుగోలు చేసిన యజమానులందరికీ 24 గంటల పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ అందుబాటులో ఉంటుందని ఫోర్స్ మోటార్స్ తెలిపింది. గూర్ఖా యజమానులకు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందించేందుకు కంపెనీ సుమారు 6,200 మంది భాగస్వాములతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ఈ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా, స్పాట్‌లనే వాహన మరమ్మతులు, వాహనాన్ని టో చేయడం, ఆన్‌-స్పాట్ రిపేరింగ్‌లో చిన్న మరమ్మతులు, బ్యాటరీ జంప్-స్టార్ట్, టైర్ సమస్యలు, లాక్ చేయబడిన వాహనం లేదా పోయిన కీ విషయంలో సాయం చేయడం మరియు ఇంధన డెలివరీ వంటివి కవర్ చేయబడతాయని కంపెనీ తెలిపింది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

రిజిస్టర్డ్ ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ యజమానులందరికీ టోయింగ్ కవరేజ్ అందించబడుతుందని ఫోర్స్ మోటార్స్ తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కింద అందించబడే ఇతర సేవలలో ఫోన్ అసిస్టెన్స్, టాక్సీ అసిస్టెన్స్, లీగల్ అసిస్టెన్స్, వైద్య సహాయం (మెడికల్ అసిస్టెన్స్), ఎస్ఎమ్ఎస్ అలెర్ట్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని సేవలు రిజిస్టర్డ్ ఫోర్స్ గూర్ఖా యజమానులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్స్ మోటార్స్ తమ గుర్ఖా ఎస్‌యూవీ యజమానులకు ఆన్-రోడ్ అసిస్టెన్స్ అందించడం కోసం కంపెనీ 6,200 టచ్ పాయింట్లతో కూడిన ఆటో యూరప్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫోర్స్ మోటార్స్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తమ కొత్త తరం గూర్ఖా ఎస్‌యూవీ మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ హార్డ్ కోర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ ప్రధానంగా ఈ విభాగంలో మహీంద్రా థార్‌తో పోటీపడుతుంది. ఈ కొత్త తరం 2021 ఫోర్స్ గుర్ఖా కేవలం ఒకే ఒక వేరియంట్ మరియు ఒకే ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంటుంది. ఫోర్స్ మోటార్స్ ఈ కొత్త తరం ఎస్‌యూవీని దాని మునుపటి తరం మోడళ్ల కంటే చాలా మోడ్రన్‌ గా మరియు ఫీచర్ లోడెడ్ గా తీర్చిదిద్దింది. అయితే, దీని ఓవరాల్ బాక్సీ టైప్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ఎప్పటిలానే ఉంటుంది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

డిజైన్ మరియు ఫీచర్ల పరంగా భారీ అప్‌గ్రేడ్‌లతో వచ్చిన కొత్త 2021 ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీకి మార్కెట్ నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఫోర్స్ మోటార్స్ పేర్కొంది. రాబోయే రోజుల్లో భారతదేశం అంతటా తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను క్రమంగా విస్తరింపజేస్తామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కోసం వచ్చే మూడు నెలలకు డెలివరీని పూర్తి చేయడానికి తగినంత బుకింగ్‌లు ఉన్నాయని పేర్కొంది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ప్రస్తుతం, ఫోర్స్ గుర్ఖా ఒకే వేరియంట్‌లో 4-సీటర్ కాన్ఫిగరేషన్ అందుబాటులో ఉంది. అయితే, ఇందులో కొత్త 5-సీటర్ వేరియంట్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా చూడటానికి మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ లాంటి డిజైన్ ను కలిగి ఉంటుంది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో కొత్తగా రూపొందించబడిన వృత్తాకారపు ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు ఎల్ఈడి స్టాప్ లైట్ మొదలైనవి ఉన్నాయి. దీని ఫ్రంట్ బంపర్ పై పెద్ద అక్షరాలతో వ్రాసిన గూర్ఖా అనే బ్యాడ్దింగ్ ఉంటుది. అంతే కాకుండా, రెండు బంపర్లపై బ్లాక్ క్లాడింగ్, హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్, కొత్త 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫంక్షనల్ స్నార్కెల్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

గుర్ఖా వెనుక భాగంలో కొత్త టెయిల్‌లైట్‌లు మరియు పైకప్పుకు జోడించిన లగేజ్ క్యారియర్‌ను యాక్సెస్ చేయడం కోసం నిచ్చెన మరియు బూట్ డోరుపై మౌంట్ చేసిన స్పేర్ వీల్ ఉంటుంది. కంపెనీ ఈ కొత్త గూర్ఖా ఎస్‌యూవీని రెడ్, ఆరెంజ్, వైట్, గ్రీన్ మరియు గ్రే అనే ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ఫోర్స్ గుర్ఖా ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, Apple CarPlay మరియు Android Auto ను సపోర్ట్ చేసే కొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పీడ్ మరియు ఆర్‌పిఎమ్ గురించి సమాచారాన్ని అందించే సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, సర్దుబాటు చేయగల త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, తక్కువ NVH (నాయిస్, వైబ్రేషన్ మరియు హార్ష్‌నెస్) స్థాయిలు, పవర్ విండోస్ మరియు కప్ హోల్డర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త తరం 2021 Force Gurkha ఓనర్లకి ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ - ఫుల్ డీటేల్స్

ఇక చివరిగా, ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుండి గ్రహించిన 2.6 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఫోర్స్ గూర్ఖాలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. కంపెనీ ఇందులో డ్యూయల్ విష్‌బోన్ మరియు కాయిల్ స్ప్రింగ్‌లతో కూడిన సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించింది.

Most Read Articles

English summary
Force motors introduces free roadside assistance for all gurkha suv owners details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X