నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ (Force Motors) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 2021 ఫోర్స్ గూర్ఖా (Force Gurkha) ఎస్‌యూవీకి సంబంధించి కంపెనీ తాజాగా మరో కొత్త టీజర్ ను విడుదల చేసింది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

ఆఫ్-రోడ్ వాహన ప్రియులను అలరించేందుకు వస్తున్న ఈ నెక్స్ట్ జనరేషన్ Force Gurkha ఈ విభాగంలో నేరుగా Mahindra Thar తో పోటీపడనుంది. మునుపటి తరం Gurkha తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2021 Gurkha ను కంపెనీ అనేక రెట్లు మెరుగ్గా ఉండేలా రూపొందించింది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

కోవిడ్-19 సంక్షోభం కారణంగా చాలా కాలం వాయిదా పడుతూ వచ్చిన ఈ కొత్త 2021 Force Gurkha ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. మహీంద్రా విడుదల చేసిన తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీ మాదిరిగానే ఈ కొత్త తరం ఫోర్స్ గుర్ఖా కుడా ఇటు ఆన్-రోడ్ మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం రూపొందించినట్లుగా తెలుస్తోంది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

Force Motors గత ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తమ కొత్త తరం Gurkha ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్‌ కు మరియు కంపెనీ త్వరలో విడుదల చేయనున్న మోడల్ కి అనేక సారూప్యతలు ఉన్నట్లు ఈ టీజర్ ఫొటోలు మరియు వీడియోలను చూస్తుంటే అర్థమవుతోంది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

మునుపటి తరం Gurkha తో పోలిస్తే, ఈ కొత్త తరం 2021 Force Gurkha డిజైన్, ఫీచర్స్ మరియు టెక్నాలజీ పరంగా మెరుగ్గా ఉంటుంది. తాజాగా విడుదల చేసిన కొత్త టీజర్ ఇమేజ్ ప్రకారం, కొత్త 2021 Gurkha ఎస్‌యూవీ ఒక స్నార్కెల్ మరియు ఫంక్షనల్ రూఫ్ క్యారియర్‌తో వస్తుందని తెలుస్తోంది. దీని ఓవరాల్ డిజైన్ పాత వెర్షన్ల కంటే మెరుగైనదని చెప్పబడింది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

ఇటీవల విడుదలైన టీజర్‌లలో చూసినట్లుగా, ఈ వాహనంపై రీడిజైన్ చేసిన బోనెట్, ఫెండర్‌పై కొత్తగా రీడిజైన్ చేయబడిన గ్రిల్ మరియు ఎయిర్ ఇంటేక్ స్నోర్కెల్ వంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే, మునుపటి స్పై షాట్లు మరియు విడుదలైన బ్రోచర్ చిత్రాల ఆధారంగా, ఈ ఎస్‌యూవీ అదే ఓవరాల్ బాక్సీ సిల్హౌట్‌ను నిలుపుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

కొత్త తరం 2021 Force Gurkha లో గుండ్రంగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు, అందులోనే ఇంటిగ్రేట్ చేయబడిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త బంపర్లు, ఫాగ్ ల్యాంప్‌లు, క్లామ్‌షెల్ బోనెట్, కొత్త బ్లాక్ క్లాడింగ్, వెనుక తలుపుకు అమర్చబడిన స్పేర్ వీల్, నిలువుగా అమర్చిన టెయిల్‌లైట్లు మరియు హై-మౌంటెడ్ ఎల్ఈడి స్టాప్ ల్యాంప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో గమనించవచ్చు.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త 2021 Force Gurkha ఆల్ బ్లాక్ క్యాబిన్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. గతంలో లీకైన స్పై చిత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇంకా ఇందులో లేటెస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, పవర్ విండోస్, ఏబిఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, మెరిసే బ్లాక్ బెజెల్స్‌తో కూడిన పెద్ద ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు మాన్యువల్ హెచ్‌విఏసి సిస్టమ్ మొదలైనవి ఉంటాయని సమాచారం.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

ఇంజన్ పరంగా చూసుకుంటే, కొత్త 2021 Force Gurkha మెర్సిడెస్ బెంజ్ నుండి గ్రహించిన 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ ను ఈ ఆఫ్-రోడర్ లో ఉపయోగించనున్నారు. ఈ బిఎస్6 వెర్షన్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 260 ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, ఇది మాన్యువల్ 4x4 సిస్టమ్ మరియు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

ఆఫ్-రోడింగ్ ఔత్సాహికుల కోసం కంపెనీ ఈ ఎస్‌యూవీకి అదనంగా మరిన్ని ఆఫ్-రోడ్ కిట్‌ లను అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీని కస్టమైజ్ చేసుకోవాలనుకునే వారి కోసం అనేక అధికారిక ఉపకరణాలను (యాక్ససరీలను) కూడా కంపెనీ ప్రవేశపెట్టనుంది.

Force Gurkha కోసం కంపెనీ అనేక ఫ్యాక్టరీ మేడ్ యాక్ససరీస్ ను అందించనుంది. వీటిలో విండ్‌షీల్డ్ ప్రొటెక్టర్ ఫ్రేమ్, రూఫ్ ర్యాక్ మరియు సైడ్ స్టెప్ వంటి చాలా స్టైలింగ్ మరియు కంఫర్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని మార్కెట్లో లాంచ్ చేసిన సమయంలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో Force Gurkha ఈ విభాగంలో ప్రధానంగా Mahindra Thar తో పోటీపడుతుంది. బిఎస్6 అవతార్ లో వచ్చిన కొత్త తరం Thar కూడా ఈ విభాగంలో అమ్మకాల పరంగా జోరును కొనసాగిస్తోంది. అయితే, ఈ మోడల్ కోసం పెరిగిన విపరీతమైన డిమాండ్ కారణంగా, కంపెనీ దీనిని సరైన సమయంలో కస్టమర్ల వద్దకు చేర్చలేకపోతోంది.

నెక్స్ట్ జనరేషన్ Force Gurkha టీజర్ లాంచ్.. Thar తో గట్టి పోటీకి రెడీ..

తాజా గణాంకాల ప్రకారం, Mahindra Thar కోసం ఇప్పటి వరకు 55,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు సమాచారం. అయితే, Gurkha మార్కెట్లోకి వచ్చిన వెంటనే, థార్ కోసం వేచి చుస్తున్న కస్టమర్లు గుర్ఖా వైపుకు మరలే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం, Thar కోసం కొనసాగుతున్న అధిక వెయిటింగ్ పీరియడ్ అని చెబుతున్నారు.

Most Read Articles

English summary
Force motors releases another teaser for all new bs6 gurkha suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X