కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్స్ మోటార్స్ (Force Motors) నుండి ఆఫ్-రోడ్ వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త తరం ఫోర్స్ గూర్ఖా ఆల్-వీల్ డ్రైవ్ (Force Gurkha 4x4) ఎస్‌యూవీ మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి కంపెనీ తాజాగా రెండవ టీజర్ ను విడుదల చేసింది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

కొద్ది రోజుల క్రితమే Force Motors ఈ మోడల్‌ను అతి త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఓ టీజర్ రూపంలో వెల్లడించింది. గత ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ కొత్త మోడల్‌ను ఆవిష్కరిస్తుంది. అప్పటి నుండి అనేక కారణాల వలన కొత్త 2021 Gurkha విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

అయితే, ఈసారి ఎట్టకేలకు కంపెనీ తమ 2021 Force Gurkha విడుదలను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే, కంపెనీ ఈ ఆఫ్-రోడ్ బీస్ట్ కి సంబంధించి కొత్త టీజర్లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ ఎస్‌యూవీ రానున్న పండుగ సీజన్‌కు దగ్గరగా సెప్టెంబర్ నెలలో మార్కెట్‌లోకి రావచ్చని అంచనా.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

మునుపటి తరం Gurkha తో పోలిస్తే, ఈ కొత్త తరం 2021 Force Gurkha డిజైన్, ఫీచర్స్ మరియు టెక్నాలజీ ఇలా అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది. తాజాగా విడుదల చేసిన కొత్త టీజర్ ఇమేజ్ ప్రకారం, కొత్త 2021 Gurkha ఎస్‌యూవీ ఒక స్నార్కెల్ మరియు ఫంక్షనల్ రూఫ్ క్యారియర్‌తో వస్తుందని స్పష్టమైంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన ప్రీ-ప్రొడక్షన్ వెర్షన్‌లో గుర్ఖాలో కూడా ఈ రెండు ఫీచర్లు కనిపించాయి. కొత్త 2021 Force Gurkha ఈ విభాగంలో గతేడాది మార్కెట్లో విడుదలైన నెక్స్ట్ జనరేషన్ 2020 Mahindra Thar (మహీంద్రా థార్) ఎస్‌యూవీతో నేరుగా పోటీపడుతుంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

కొత్త తరం Mahindra Thar గత సంవత్సరం భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇది 4X4 విభాగంలో మంచి ఆదరణ పొందుతోంది. ఇటు సిటీ డ్రైవ్ మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయోజనం కోసం రూపొందించిన ఈ ఎస్‌యూవీకి ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం, కొన్ని ప్రాంతాల్లో ఈ మోడల్ కోసం కస్టమర్లు సుమారు ఏడాది వరకూ కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

సరిగ్గా ఇదే అంశం కొత్త 2021 Gurkha కి హెల్ప్ కానుంది. Mahindra Thar కి ఉన్న అధిక వెయిటింగ్ పీరియడ్ కారణంగా, కస్టమర్లు కొత్త Force Gurkha వైపుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ రాకతో ఆఫ్-రోడ్ మరియు 4x4 విభాగంలో పోటీ పోటీ తీవ్రతరం కానుంది. నిజానికి, ఈ విభాగంలో Thar కి ఏకైక పోటీదారు Gurkha అని చెప్పొచ్చు.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

కొత్త 2021 Force Gurkha ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, మార్కెట్ అంచనా ప్రకారం, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుండి రూ. 12 లక్షల మధ్యలో ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మార్కెట్లో Mahindra Thar ధరలు రూ. 12.11 లక్షల నుంచి రూ. 14.16 లక్షల మధ్యలో ఉన్నాయి.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

అప్‌గ్రేడ్ చేయబడిన కొత్త 2021 Force Gurkha 3-డోర్ వెర్షన్ మరియు 5-డోర్ వెర్షన్లతో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇందులో 4-సీటర్ మరియు 6-సీటర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని లభ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీని మోడ్రన్ లైఫ్‌స్టైల్ వాహనంగా మార్చేందుకు కంపెనీ ఇందులో గణనీయమైన మార్పులు మరియు డిజైన్ అంశాలను జోడించనుంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

ఫలితంగా, ఈ కొత్త తరం 2021 Force Gurkha దాని మునుపటి తరం మోడళ్ల కన్నా చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. డిజైన్ అప్‌గ్రేడ్‌లలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, సరికొత్త ఫ్రంట్ బంపర్ డిజైన్, కొత్త హెడ్‌లైట్ యూనిట్స్ మరియు ఫ్రంట్ ఫెండర్‌లపై ఇన్‌స్టాల్ చేసిన టర్న్ ఇండికేటర్‌లతో ఇది పూర్తిగా కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

వెనుక వైపు రీడిజైన్ చేసిన టెయిల్‌లైట్లు, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు టైల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్, హార్డ్ టాప్ ఆప్షన్, ఆఫ్-రోడింగ్ కు అనువుగా ఉండేలా చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు పెద్ద బటన్లతో కూడిన ఆఫ్-రోడ్ టైర్లు మొదలైన మార్పులను ఈ కొత్త 2021 Force Gurkha లో గమనించవచ్చు.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

కేవలం ఎక్స్టీరియర్స్ పరంగా మాత్రమే కాకుండా, కొత్త తరం Gurkha లోని ఇంటీరియర్స్ లో కూడా భారీ మార్పులను ఆశించవచ్చు. ఇందులో మెరుగైన హార్డ్ ప్లాస్టిక్ అంశాలతో రూపొందించిన ఆల్ బ్లాక్ థీమ్ క్యాబిన్, రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో జంపింగ్ సీట్లు ఉండవచ్చని సమాచారం.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

అంతేకాకుండా, ఈ కొత్త తరం ఎస్‌యూవీలో ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే వంటి కనెక్టింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చయవచ్చని భావిస్తున్నారు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సెమీ డిజిటల్ రూపంలో ఉండే అవకాశం ఉంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కొత్త 2021 Force Gurkha లో మరింత రీఫైన్ చేయబడిన ఇంజన్ ను ఉపయోగించనున్నారు. ఇందులోని 2.6 లీటర్ డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీనికి సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

Force Gurkha ఇంజన్ గణాంకాలను కొత్త Mahindra Thar తో పోల్చి చూసినప్పుడు, Gurkha కన్నా Thar మరింత శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. Thar లోని 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త 2021 Force Gurkha రెండవ టీజర్ లాంచ్; సెప్టెంబర్‌లో అమ్మకాలు షురూ!

ఇదిలా ఉంటే, Force Motors ఇటీవల తమ Gurkha ఎస్‌యూవీ యొక్క 5 డోర్ వెర్షన్ ఉత్పత్తిని కూడా ప్రారంభించినట్లు ధృవీకరించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 3 డోర్ వెర్షన్ Gurkha విడుదలైన తర్వాత ఇందులో 5 డోర్ వెర్షన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కి సంబంధించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Force motors revealed 2021 gurkha suv second teaser image details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X