సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ల తయారీ సంస్థ Ford (ఫోర్డ్) ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా భారీ నష్టాల్లో పయనిస్తోంది. ఈ కారణంగానే కంపెనీ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే కంపెనీ తన ఉత్పత్తి కర్మాగారాలను మూసివేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

Ford (ఫోర్డ్) కంపెనీ ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సనంద్ ప్లాంట్‌లో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తోంది. ఇటీవల కంపెనీ తన ఫోర్డ్ సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తిని పూర్తి చేసింది. కావున త్వరలో ఈ ప్లాంట్‌ను మూసివేయడానికి తగిన సన్నాహాలు కూడా ప్రారంభించింది.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

నిన్న (శుక్రవారం) Ford (ఫోర్డ్) కంపెనీ యొక్క Ford Aspire (ఫోర్డ్ ఆస్పైర్) యొక్క చివరి యూనిట్ ఈ ప్లాంట్ ఉత్పత్తి లైన్‌లో ఉత్పత్తి చేసింది. ఈ చివరి యూనిట్ యొక్క ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. Ford India (ఫోర్డ్ ఇండియా) ఇప్పటికే తన ఉత్పత్తిని నిలిపివేసే నిర్ణయం తీసుకుంటూ, 2021 నాల్గవ త్రైమాసికం నాటికి సనంద్ ప్లాంట్‌ నిలిపివేయబడుతుందని తెలిపింది.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

అంతే కాకుండా తమిళనాడు రాజధాని చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి కూడా 2022 రెండవ త్రైమాసికం నాటికి నిలిపివేయబడుతుంది. ఈ కంపెనీ టాటా చేతుల్లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. చెన్నై ప్లాంట్‌లో కంపెనీ Ford EcoSport (ఫోర్డ్ ఎకోస్పోర్ట్) ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా గుజరాత్ లోని సనంద్ తయారీ కర్మాగారంలో Figo, Aspire మరియు Freestyle వంటి మోడల్ ఉత్పత్తి చేయబడతాయి.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

Ford కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం, కంపెనీలో పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులపై ప్రభావం చూపుతుంది. ఇందులో భాగంగానే కంపెనీలోని దాదాపు 5,300 మంది ఉద్యోగులు మరియు కార్మికుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఫోర్డ్ ఇండియా తన చెన్నై ప్లాంట్‌లో దాదాపు 2,700 మంది శాశ్వత ఉద్యోగులు మరియు 600 మంది ఇతర ఉద్యోగులు ఉన్నారు.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

అదే సమయంలో, సనంద్‌ ప్లాంట్ లో కార్మికుల సంఖ్య సుమారు 2,000 వరకు ఉన్నారు. కంపెనీ ఇప్పుడు తమ కార్య కలాపాలను భారతేదేశంలో పూర్తిగా నిలిపిఈయడం వల్ల ఈరి పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోతుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఫోర్డ్ కంపెనీలోని ఉద్యోగులకు తన కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

ఫోర్డ్ ఇండియా 500 మంది ఉద్యోగులతో సనంద్ ఇంజిన్ ఎక్స్‌పోర్ట్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. దీనితోపాటు మరో 100 మంది ఉద్యోగులు కస్టమర్ కేర్ మరియు పార్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిలో పనిచేస్తున్నారు. అయితే కంపెనీ ఇప్పుడు తన ప్లాంట్లను మూసివేస్తే దాదాపు 4,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని భావిస్తున్నారు.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీలోని తన ఉద్యోగులను నష్టాల నుండి కాపాడటానికి కంపెనీ పరిహార ప్యాకేజీని అందించడానికి ఆలోచిస్తోంది. దీని వల్ల కంపెనీ యొక్క ఉద్యోగులు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం Ford India యొక్క చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తిని కొనసాగిస్తుంది. ఇందులో 30,000 యూనిట్ల ఎకోస్పోర్ట్ కార్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ప్లాంట్ కూడా మూసివేసే నిర్ణయంపై తమ అగ్రశ్రేణి ఫోర్డ్ మోటార్ ఎగ్జిక్యూటివ్‌లు మరియు కార్మిక సంఘాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కావున ఇది కూడా త్వరలో మూసివేసే అవకాశం ఉంటుంది.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

Ford India కంపెనీ గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో చాలా వరకు నష్టాలను చవిచూస్తోందని. ఈ నష్టాల కారణంగా కంపెనీ ఏకంగా 2 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది, అని ఫోర్డ్ కంపెనీ తెలిపింది. దీనికి తోడు భారతదేశంలో కంపెనీ యొక్క అమ్మకాలు నిరంతరం క్షీణిస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా కార్ల మార్కెట్ కూడా క్రమంగా మందగిస్తోంది, కావున తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోటానికి అవకాశాలు లేకుండా పోయాయి.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

భారతదేశంలో చాలా రోజులుగా కరోనా మహమ్మారి కారణంగా ఆటో పరిశ్రమ చాలా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అయితే అప్పటికే నష్టాల బాటలో ఉన్న ఫోర్డ్ కంపెనీ యొక్క పరిస్థితి మరింత విషమంగా మారింది. అయినప్పటికీ కూడా తమ కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తూనే ఉంది. కంపెనీ ఈ కారణాల వల్ల ఉత్పత్తిని నిలిపివేయడానికి నిర్ణయం తీసుకోబడింది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ యొక్క సర్వీస్ సెంటర్స్ మరియు కస్టమర్ పాయింట్లు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

వీటితో పాటు భారతదేశంలో వాహనాలు తప్పకుండా బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలమా అప్డేట్ కావాలి, కావున ఫోర్డ్ కంపెనీ యొక్క వాహనాలు బిఎస్ 6 ప్రమాణాలకు అనుకూలంగా మారటానికి ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. ఇలాంటి కారణాల వల్ల కంపెనీ తన ఉత్పత్తి నిలిపివేయడానికి పూనుకుంది.

సనంద్ ప్లాంట్‌లో చివరి యూనిట్ ఉత్పత్తి చేసిన Ford: తరువాత జరిగేది ఇదే

దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఫోర్డ్ వాహనాలు మొత్తం అమ్ముడైన తరువాత, అమ్మకాలు కూడా పూర్తిగా నిలిపివేయబడతాయి. ఇప్పుడు ఈ జాబితాలో కంపెనీ యొక్క ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ వంటి కార్లు ఉన్నాయి. అయితే ఫోర్డ్ కంపెనీ యొక్క మస్టాంగ్ వంటి కార్లను భవిష్యత్ లో కొనుగోలు చేయాలనుకుంటే సిబీయు మార్గం ద్వారా దిగుమతి చేసుకోవచ్చు.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford car last unit manufactured in sanand gujarat plant details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X