ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

భారత మార్కెట్లో ఫోర్డ్ ఇండియా ఇటీవల తన కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్ టీజర్‌ను విడుదల చేసింది. అంతే కాకుండా ఈ ఎస్‌యూవీని త్వరలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు కంపెనీ తన ఎకోస్పోర్ట్ యొక్క కొత్త ఎస్ఇ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త కార్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క ఎస్ఇ వేరియంట్లను పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజన్లలో కంపెనీ విడుదల చేసింది. దాని పెట్రోల్ ఇంజన్ వెర్షన్ ధర ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ. 10.49 లక్షలు కాగా, డీజిల్ ఇంజన్ వెర్షన్‌ ధర రూ. 10.99 లక్షల వరకు ఉంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ ప్రస్తుత మోడల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మాదిరిగానే ఉంటుంది. ఈ వేరియంట్‌ను అమెరికన్ మరియు యూరోపియన్ మార్కెట్లలో కంపెనీ విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ కారు యొక్క వెనుక భాగంలో విడి చక్రాలు అమర్చబడవు. ఇది కాకుండా, కొత్త ఎస్ఇ వేరియంట్ యాంత్రికంగా ప్రస్తుత ఎకోస్పోర్ట్ మాదిరిగానే ఉంటుంది.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

దీని గురించి ఫోర్డ్ ఇండియా సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా మాట్లాడుతూ, "కస్టమర్లు గ్లోబల్ బెంచ్ మార్కును ఎక్కువగా అనుసరిస్తున్నారు మరియు కొత్త ఎకోస్పోర్ట్ ఎస్ఇ లాగా నిర్దిష్ట మరియు ప్రత్యేకమైన విషయాల కోసం చూస్తున్నారు" అని ఆయన అన్నారు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

ఎకోస్పోర్ట్ ఎస్‌ఇ చూడటానికి చాలా ఆక్షర్హణీయంగా ఉంది, దీని డిజైన్ విషయాన్ని వస్తే, ఇది ప్రొజెక్టర్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, సిల్వర్ రూఫ్ రైల్స్, గ్రిల్‌లో క్రోమ్ ఎలిమెంట్స్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు 16 ఇంచెస్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

ఈ ఎకోస్పోర్ట్ ఎస్‌ఇ లోపలి భాగం డ్యూయల్-టోన్ థీమ్ బ్లాక్ అండ్ లేత గోధుమరంగులో ఉంచబడుతుంది. ఇందులో అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పుష్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

ఎకోస్పోర్ట్ ఎస్‌ఇ 1.5-లీటర్, 3-సిలిండర్ టివిసిటి పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిడిసి డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. దాని పెట్రోల్ ఇంజన్ 122 బిహెచ్‌పి శక్తిని, 149 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని, 215 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

MOST READ:సినిమా సూపర్ హిట్ కొట్టి, సూపర్ గిఫ్ట్ పట్టేసిన నిరంజని దంపతులు

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్ఇ వేరియంట్; ధర & ఫీచర్లు

ప్రస్తుతం ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 7.99 లక్షలు కాగా, దాని టాప్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). భారతదేశంలో విడుదలైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌ఇ, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford EcoSport SE Variant Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X