Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

అమెరికన్ కార్ బ్రాండ్ Ford (ఫోర్డ్), వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాల కారణంగా భారతదేశంలో తమ వ్యాపారాన్ని మరియు కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ ప్రకటన అనంతరం, ఫోర్డ్ ఇండియా నుండి ఇకపై దేశంలో ఎలాంటి కొత్త కార్లు ఉత్పత్తి చేయబడవు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ ఆర్డర్లను మరియు స్టాక్ ను క్లియర్ చేసుకున్న తర్వాత కంపెనీ దేశం నుండి నిష్క్రమిస్తుంది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

భారతదేశంలో Ford గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ అమ్మకాలు చూస్తోంది. సరైన మార్కెట్ స్ట్రాటజీ లేని కారణంగా కంపెనీ ఇక్కడి మార్కెట్లో భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియాకు సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. దీంతో వేరే గత్యంతరం లేక ఈ బ్రాండ్ దేశం వదిలి వెళ్లిపోతోంది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

భారతదేశంలో Ford బ్రాండ్ నుండి 2013 లో వచ్చిన కాంపాక్ట్ ఎస్‌యూవీ EcoSport (ఎకోస్పోర్ట్), దేశీయ మార్కెట్లో ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. అయితే, ఇటీవలి కాలంలో ఈ మోడల్ అమ్మకాలు కూడా నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి. తక్కువ అమ్మకాల కారణంగా Ford EcoSport (ఫోర్డ్ ఎకోస్పోర్ట్) ను పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కంపెనీ నిలిపివేసింది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

ఒకప్పుడు భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొంది మరియు అత్యధికంగా అమ్ముడైన ఎకోస్పోర్ట్, ఇకపై భారతదేశంలో కూడా డిస్‌కంటిన్యూ కానుంది. భారతదేశంలో విక్రయించబడుతున్న Ford EcoSport లో, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా కంపెనీ కొత్తదనాన్ని అందించడంలో విఫలమైంది. అందుకే, ఈ మోడల్ ని ఆదరించే కస్టమర్లు కూడా క్రమంగా కరువయ్యారు.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా విఫలమైంది. యునైటెడ్ స్టేట్స్‌లో కూడా EcoSport యొక్క అన్ని వేరియంట్ల అమ్మకాలను నిలిపివేయబోతున్నట్లు Ford ఇటీవల ప్రకటించింది. తక్కువ అమ్మకాలు మరియు నిరంతరం తగ్గుతున్న లాభాలు దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఓ నివేదిక ప్రకారం, Ford వచ్చే ఏడాది మే-జూన్ వరకు యుఎస్‌లో EcoSport విక్రయాలను కొనసాగిస్తుంది, ఆ తర్వాత దానిని పూర్తిగా నిలిపివేయబడుతుందని సమాచారం.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

అమెరికాలో Ford తమ EcoSport ఎస్‌యూవీని 2016 లో ప్రదర్శించింది మరియు మొదటిసారిగా 2018 లో మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో, Ford EcoSport అమ్మకాల పరంగా కంపెనీకి ఎలాంటి లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. దీంతో కంపెనీ గత సంవత్సరం నుండి EcoSport ఉత్పత్తిని తగ్గించడం ప్రారంభించింది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

ప్రస్తుతం అమెరికాలో ఫోర్డ్ యొక్క ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా 2021 EcoSport ను విక్రయిస్తున్నారు. అయితే, ఇకపై ఈ మోడల్ అమ్మకాలను నిలిపివేయనున్న నేపథ్యంలో, ఆ స్థానాన్ని Bronco (బ్రోంకో) ఎస్‌యూవీలు రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అమెరికాలో విక్రయించబడుతున్న Ford EcoSport ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫోర్డ్ ఈ చిన్న కారులో కూడా తమ సిగ్నేచర్ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ ను అందుబాటులో ఉంచింది. అమెరికన్ మార్కెట్లో ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది మరియు అక్కడి మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర 20,395 డాలర్లుగా ఉంది. అంటే, మనదేశ కరెన్సీలో ప్రస్తుత మారకపు విలువ ప్రకారం సుమారు రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

భారతదేశం విషయానికి వస్తే, Ford EcoSport దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీ. అయితే, గత కొన్నేళ్లుగా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పెరుగుతున్న పోటీ కారణంగా EcoSport అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. గడచిన ఆగస్టు నెలలో Maruti, Hyundai మరియు Tata వంటి కంపెనీల అమ్మకాలు వృద్ధిని కనబరచగా, Ford కార్ల అమ్మకాలు మాత్రం చాలా తక్కువగా నమోదయ్యాయి.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

ఇండియా నుండి వెళ్లిపోయినా, కార్లను మాత్రం ఎగుమతి చేస్తూనే ఉంటాం..

ఈ అమెరికన్ కార్ బ్రాండ్ Ford భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దేశంలో పరోక్షంగా తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు మాత్రం సుముఖత చూపుతోంది. కంపెనీ ఇప్పుడు తన హై-ఎండ్ కార్లను భారతదేశానికి ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ తమ 2021 2021 MUSTANG MACH-E (ముస్తాంగ్ మాక్-ఇ) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుని భారతదేశానికి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. భారతదేశంలో దీని అమ్మకాలు 2022 నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

కాగా, దేశంలో ప్రస్తుత ఉత్పత్తి జాబితా విషయానికొస్తే, డీలర్ జాబితాలో అందుబాటులో ఉన్న కార్లు విక్రయించబడిన తర్వాత, కంపెనీ తమ వాహనాల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. Ford India ప్రస్తుతం భారతదేశంలో Endeavour, EcoSport, Figo, Figo Aspire మరియు Freestyle మోడళ్లను విక్రయిస్తోంది.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

Mahindra తోనూ బెడిసికొట్టిన Ford డీల్..

భారతదేశంలో వ్యూహాత్మక వ్యాపారాన్ని ప్రారంభించేందుకు Ford గతంలో, దేశీయ ఆటోమొబైల్ కంపెనీ Mahindra తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. అయితే, ఈ డీల్‌కు కూడా ఆదిలోనే శుభం కార్డ్ పడింది. ఇరు కంపెనీలు అక్టోబర్ 1, 2019వ తేదీన తమ జాయింట్ వెంచర్ ప్లాన్‌ను ప్రకటించాయి.

Ford EcoSport డిస్‌కంటిన్యూ! అమెరికాలోనూ విఫలమే..

ఈ రెండు బ్రాండ్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, Ford భవిష్యత్తులో భారత మార్కెట్ కోసం తయారు చేయబోయే మోడళ్లలో ఉపయోగించే అండర్‌పిన్నింగ్స్‌ను (ప్లాట్‌ఫామ్)ను Mahindra నుండి తీసుకోవాలని భావించింది. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ, ఈ జేవీ నుండి తప్పుకుంటున్నట్లు Ford India డిసెంబర్ 31, 2020వ తేదీన ప్రకటించింది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford ecosport to be discontinued in united states details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X