ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌‌యూవీ 'ఎండీవర్'లో కంపెనీ బేస్ వేరియంట్ (టైటానియం 4x2)ను నిలిపివేసింది. ఇందుకు సంబంధించిన కారణాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

భారత మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ టైటానియం 4x2, టైటానియం ప్లస్ 4x2, టైటానియం ప్లస్ 4x4 మరియు స్పోర్ట్ 4x4 అనే నాలుగు వేరియంట్లలో లభ్యమయ్యేది. డిమాండ్ తక్కువగా ఉండటం కారణంగా కంపెనీ ఇందులో బేస్ వేరియంట్ అయిన టైటానియం 4x2 (టూవీల్ డ్రైవ్ మోడల్)ను నిలిపివేసింది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

ఫోర్డ్ ఎండీవర్ టైటానియం 4x2 వేరియంట్‌ను నిలిపివేయటంతో, ప్రస్తుతం ఈ మోడల్ కేవలం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. కాగా, టైటానియం ప్లస్ 4x2 ఇకపై కొత్త బేస్ వేరియంట్‌గా లభిస్తుంది. మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.23.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

భారత మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన ఫోర్డ్ ఎండీవర్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీలో కంపెనీ 2.0 లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి శక్తిని మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

ఫోర్డ్ ఎండీవర్ బ్రాండ్ యొక్క 'సెలెక్ట్-షిఫ్ట్' టెక్నాలజీతో లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. ఇది టూ-వీల్ డ్రైవ్ (4x2) మరియు ఆల్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని ట్రాన్సిమిషన్, వేరియంట్‌ను బట్టి ఇంజన్ నుండి వెలవడే శక్తిని వెనుక చక్రాలకు లేదా అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

ఈ ఎస్‌యూవీలో ప్రత్యేకంగా మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఇవి వివిధ రకాల భూభాగాలపై సమర్థవంతమైన పనితీరును అందించేలా ఉంటాయి. ఇందులో శాండ్, ఫాగ్/మడ్, రాక్ అనే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఇంకా ఇందులో హిల్ లాంచ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్ మరియు రోల్ఓవర్ మిటిగేషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

అంతేకాకుండా, ఇందులో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ గ్రిల్, స్కఫ్ ప్లేట్లు, రూఫ్ రైల్స్ మరియు సైడ్ స్టెప్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ టైలాంప్‌లు మరియు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో 8 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో పాటుగా ఫోర్డ్ పాస్ అనే కనెక్టివిటీ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

బ్రాండ్ యొక్క లెటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ అయిన ఈ ‘ఫోర్డ్‌పాస్' సాయంతో వాహన యజమానులు తమ ఎస్‌యూవీని రిమోట్‌గా కంట్రోల్ చేయవచ్చు మరియు వాహనానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఉందులో పానోరమిక్ సన్‌రూఫ్, లెదర్ సీట్లు, ఫోల్డబుల్ థర్డ్ రో సీట్లు, కీలెస్ ఎంట్రీ మరియు పుష్ బటన్ స్టార్ట్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ బేస్ వేరియంట్ డిస్‌కంటిన్యూ, ఎందుకంటే..?

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఫోర్డ్ ఎండీవర్‌లో ఏడు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, సర్దుబాటు చేయగల స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ అసిస్ట్, యాక్టివ్ పార్కింగ్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford Endeavour Base Variant Titanium 4x2 Discontinued In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X