ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఈ ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్ లేదా డీజిల్ అవసరం లేదు. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ అందిస్తున్న అత్యంత పాపులర్ పికప్ ట్రక్కు 'ఎఫ్150'లో కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ పేరుతో దీనిని ప్రవేశపెట్టారు.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

చూడటానికి అచ్చం పెట్రోల్ వెర్షన్‌లా కనిపించే ఈ ఫోర్డ్ ఎఫ్150 పికప్ ట్రక్కులో పెట్రోల్ వెర్షన్ కన్నా ఎన్నో రెట్లు మెరుగైన ఫీచర్లు, టెక్నాలజీ ఉంది. అమెరికాలో ఈ సరికొత్త ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు ఫోర్డ్ యూఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించి కేవలం 100 డాలర్ల బుకింగ్ అమౌంట్‌తో ఈ ట్రక్కును బుక్ చేసుకోవచ్చు.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది పూర్తి చార్జ్‌పై 483 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అన్ని ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కులు స్టాండర్డ్ 4x4 డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఇందుకోసం కంపెనీ రెండు యాక్సిల్స్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లను ఉపయోగించి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 563 బిహెచ్‌పిల శక్తిని మరియు 1050 ఎన్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.

MOST READ:అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ పెర్ఫార్మెన్స్ ఫిగర్స్ స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ కారు కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటాయి. ఎఫ్15 లైట్నింగ్ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇందులోని స్టాండర్డ్ బ్యాటరీ ప్యాక్ 426 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని, ఈ వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 370 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఫోర్డ్ ఈ పికప్ ట్రక్కులో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్ యొక్క ఖచ్చితమైన వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, ఇందులో బ్లూ ఓవల్ యొక్క విస్తరించిన బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది అందుకున్న మొట్టమొదటి ఎఫ్-సిరీస్ ట్రక్ కూడా ఫోర్డ్ 150 లైట్నింగ్ అవుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ వాటర్, లీక్ ప్రూఫ్ మరియు ఫైర్ ప్రూఫ్ టెక్నాలజీలను కలిగి ఉంటుంది.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ యొక్క టోయింగ్ సామర్థ్యం 4,536 కిలోలు మరియు పేలోడ్ సామర్థ్యం 910 కిలోలు. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎఫ్150 పికప్ ట్రక్కులో కంపెనీ రెండు ఆన్‌బోర్డ్ చార్జర్లను అందిస్తుంది. ఈ రెండింటినీ ఒకేసారి కనెక్ట్ చేయటం ద్వారా వీలైనంత త్వరగా కారులోని బ్యాటరీలను చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌లను బట్టి ఇది వేర్వేరు ఏసి ఛార్జర్‌లతో వస్తుంది. ఇందులోని స్టాండర్డ్ 11.2 కిలోవాట్ల బ్యాటరీ యూనిట్ ఆప్షనల్ 48ఏ హౌస్ ఛార్జర్‌ను పొందుతుంది. అలాగే, లాంగ్ రేంజ్ 19.2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ కోసం డ్యూయల్ ఛార్జర్‌ను అందించనున్నారు.

MOST READ:ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ పికప్ ట్రక్కులోని స్టాండర్డ్ బ్యాటరీ ప్యాక్‌ను 48ఏ హోమ్ ఛార్జర్‌తో పూర్తిగా చార్జ్ చేయటానికి 10 గంటల సమయం పడుతుంది. అలాగే, ఇందులోని లాంగ్ రేంజ్ వెర్షన్ బ్యాటరీ ప్యాక్‌ను 80ఏ హోమ్ ఛార్జర్‌తో పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఇది ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను సూపర్ ఫాస్ట్ డిసి ఛార్జర్‌తో కేవలం 10 నిమిషాల్లో 87 కిలోమీటర్ల రేంజ్‌కు సరిపడా ఛార్జ్‌ను పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో బ్యాటరీలను కేవలం 41 నిమిషాలు చార్జ్ చేస్తే, బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం 80 శాతం వరకూ పెరుగుతుందని ఫోర్డ్ తెలిపింది.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ ఓ చిన్నిసైజ్ ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌లా పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో ఇళ్లలో ఎలక్ట్రిసిటీ స్థంభించినట్లయితే, ఈ ట్రక్కు సాయంతో సుమారు మూడు రోజుల పాటు ఒక ఇంటికి సరిపడా ఎలక్ట్రిసిటీని పొందవచ్చని ఫోర్డ్ తెలిపింది. అంతేకాకుండా, వాణిజ్య ప్రయోజనం ఉపయోగించే వారి కోసం ఈ ట్రక్కులో అనేక చార్జింగ్ పోర్టులను, ఏసి అవుట్‌లెట్లు కూడా ఉన్నాయి. వీటి సాయంతో వారు తమ పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు లేదా నేరుగా ప్లగ్ చేసి ఉపయోగించవచ్చు.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఈ ట్రక్కులో ఇంజన్ లేని కారణంగా ఫ్రంట్ హుడ్ క్రింద్ భారీ లగేజ్ స్పేస్ కూడా లభిస్తుంది. ఈ స్పేస్‌ను కంపెనీ 'ఫ్రంక్' (బూట్ స్పేస్) అని పిలుస్తుంది. ఈ పికప్ ట్రక్కు చుట్టూ మరియు పికప్ బెడ్ లోపల అనేక ఎల్ఈడి లైట్లు కూడా ఉంటాయి, రాత్రివేళల్లో పనిచేసే వారికి మరియు క్యాంపింగ్ చేసే వారికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతాయి.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ పికప్ ట్రక్ డబుల్ క్యాబ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని ఇంటీరియర్‌లో సరికొత్త సింక్4ఏ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నేచురల్ సౌండ్ కంట్రోల్, క్లౌడ్-బేస్డ్ నావిగేషన్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఓటిఏ అప్‌డేట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

టెస్లా కార్ల మాదిరిగానే ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ పికప్ ట్రక్కు కూడా హ్యాండ్స్ ఫ్రీ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ సాయంతో హైవేలపై డ్రైవర్ ప్రమేయం లేకుండా కారును ఆటోమేటిక్ మోడ్‌లో నడపొచ్చు. ఇందులో ఇంటెలిజెంట్ రేంజ్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని మరియు ఆ సామర్థ్యంతో ప్రయాణించగలిగే దూరాన్ని ఎప్పటికప్పు రైడర్‌కు తెలియజేస్తుంది.

ఈ కొత్త ఫోర్డ్ పికప్ ట్రక్కుకి పెట్రోల్, డీజిల్ అవసరం లేదు; ధర కూడా తక్కువే

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కూడా ఈ ఫోర్డ్ ఎఫ్150 లైట్నింగ్ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కు ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఎలక్ట్రిక్ పికప్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అమెరికా మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.40,000 డాలర్ల కన్నా తక్కువగా ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ధర 39,974 డాలర్లు (రూ.29 లక్షలు) కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర 90,000 డాలర్లు (రూ.65 లక్షలు)గా ఉంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford F150 Lightning The All-new Electric Pickup Truck Unveiled, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X