YouTube

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford), వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాల కారణంగా భారతదేశంలో తమ కార్యకలాపాలను మరియు కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఫోర్డ్ కంపెనీ భారతదేశం నుండి నిష్క్రమిస్తున్నప్పటికీ, తమ ప్రస్తుత కస్టమర్లకు కావల్సిన అన్ని రకాల సేవలను అందించడం కొనసాగిస్తూనే ఉంటామని హామీ ఇచ్చింది. ఫోర్డ్ హామీ ఇచ్చినట్లుగానే ఇప్పుడు, తమ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు ఓ సర్వీస్ రీకాల్ గురించి సమాచారాన్ని పంపిస్తోంది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయించిన్న ఎకోస్పోర్ట్ డీజిల్ మోడళ్లలో తలెత్తిన డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్యల కారణంగా కంపెనీ వీటిని సైలెంట్ గా రీకాల్ చేస్తోంది. కంపెనీ ఈ రీకాల్ గురించి బహిరంగంగా వెల్లడించకపోయినప్పటికీ, తమ కస్టమర్లకు ప్రత్యేకంగా సందేశాలు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఫోర్డ్ డీలర్‌షిప్ ఓ కస్టమర్ కు పంపిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

ఫోర్డ్ భారతదేశం నుండి వెళ్లిపోతున్నప్పటికీ, తమ కస్టమర్లను మాత్రం విస్మరించదని ఈ లేఖ చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, బిఎస్6 డీజిల్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కలిగి ఉన్న వాహన యజమానులు తమ కార్లతో Diesel Particulate Filter (DPF) వలన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. కానీ, ఫోర్డ్ ఇండియా మాత్రం ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మరియు ఈ నివేదికలను అంగీకరించనూ లేదు.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

అయితే, ఫోర్డ్ ఇప్పుడు ఎట్టకేలకు డిపిఎఫ్ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది, అందుకో స్వచ్ఛందంగా వాహనాలను రీకాల్ చేస్తోంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ బిఎస్6 డీజిల్ వేరియంట్లను తక్కువ వేగంతో నడుపుతున్నప్పుడు ఇంజన్ ఆర్‌పిఎమ్ కదులుతున్నట్లయితే, సదరు వాహన కస్టమర్ తమ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని వారి సమీపంలోని ఫోర్డ్ సర్వీస్ స్టేషన్‌ కు తీసుకువెళ్లి తనిఖీ చేయించుకోమని ఫోర్డ్ లేఖల ద్వారా కస్టమర్లకు తెలియజేస్తోంది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

ఈ లేఖలో ఫోర్డ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇంజన్ లోపల పేలవమైన దహనం (Poor Combustion) కారణంగా ఈ సమస్య ఏర్పడి ఉండొచ్చని, దీనిని విస్మరిస్తే ఇది డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్‌ ను దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొంది. కస్టమర్ల యొక్క డీజిల్ వెర్షన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలు ఈ రీకాల్ కు వర్తిస్తాయో లేదోనని వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (VIN) ద్వారా తెలుసుకోవచ్చని, ఒకవేళ సమస్య గుర్తించబడితే దానిని ఫోర్డ్ డీలర్లు ఉచితంగా సరిచేస్తారని కంపెనీ తెలిపింది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

ఈ సమస్య వలన డ్రైవింగ్ లో అసౌకర్యం కలగడమే కాకుండా, డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ కూడా దెబ్బతింటుంది. అయితే, ఇలా డ్యామేజ్ అయిన డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ వలన ఎటువంటి భద్రతా సమస్యలు కలగవని ఫోర్డ్ పేర్కొంది. రీకాల్ కు వర్తించే వాహనాలను ఫోర్డ్ సర్వీస్ సెంటర్లు సమస్యను పరిష్కరించడానికి ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్ (PCM) సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తాయి. అవసరమైతే ఎగ్జాస్ట్ సిస్టమ్ యొక్క ఉద్గార తగ్గింపు భాగాలు కూడా భర్తీ చేస్తాయి.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

అయితే, ఇది సర్వీస్ స్లాట్ లభ్యతపై ఆధారపడి, తనిఖీ చేసి భర్తీ చేయడానికి ఒక రోజు కంటే తక్కువ సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో, రీకాల్ వర్తించే వాహనాల కస్టమర్లను కంపెనీ ప్రత్యేకంగా లేఖల ద్వారా సంప్రదించి, సర్వీస్ అపాయింట్‌మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతోంది. భారత మార్కెట్లో ఫోర్డ్ అన్ని తయారీ కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ, తమ వినియోగదారుల కోసం రాబోయే 10 సంవత్సరాల పాటు సర్వీస్ మరియు విడిభాగాలను అందించడం కొనసాగిస్తుంది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

భారతదేశంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ విభాగంలోనే అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. ఫోర్డ్ బ్రాండ్ నుండి 2013 లో వచ్చిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ, దేశీయ మార్కెట్లో ఓ వెలుగు వెలిగింది. అయితే, ఈ విభాగంలో క్రమంగా పెరిగిన పోటీ నేపథ్యంలో ఎకోస్పోర్ట్ అమ్మకాలు కూడా నిరంతరం తగ్గుతూ వచ్చాయి. దీనికితోడు, కంపెనీ ఈ ఎస్‌యూవీని లేటెస్ట్ మార్కెట్ ట్రెండ్స్ కి అనుగుణంగా అప్‌డేట్ చేయడంలో కూడా విఫలమైంది. తక్కువ అమ్మకాల కారణంగా Ford EcoSport (ఫోర్డ్ ఎకోస్పోర్ట్) భారతదేశంలోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కంపెనీ నిలిపివేయనుంది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

భారతదేశం నుండి నిష్క్రమణ ప్రకటించినప్పుడు, ఎకోస్పోర్ట్ లైనప్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.19 లక్షల నుండి రూ. 11.69 లక్షల మధ్యలో ఉంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. డీజిల్ వెర్షన్ 1.5 లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ ను మరియు 215 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

అలాగే, ఇందులో 1.5 లీటర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇన్‌లైన్ 4 పెట్రోల్ ఇంజన్ కూడా ఇది గరిష్టంగా 123 బిహెచ్‌పి పవర్ ను మరియు 149 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులోని పెట్రోల్ వెర్షన్‌లో 6 స్పీడ్ సివిటి ఆప్షన్ కూడా అందించింది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

ఈ కారులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఫోర్డ్ భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దేశంలో పరోక్షంగా తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు మాత్రం సిద్ధంగానే ఉంది.

డీజిల్ పార్టికల్ ఫిల్టర్ (DPF) సమస్య కారణంగా Ecosport ను రీకాల్ చేసిన Ford; మరి మీ కారు సేఫేనా?

ఫోర్డ్ తమ హై-ఎండ్ కార్లను భారతదేశానికి దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫోర్డ్ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించిన కొత్త 2021 మస్తాంగ్ మాక్-ఇ (MUSTANG MACH-E) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుని భారతదేశానికి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఈ కారును సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారతదేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ కారు అమ్మకాలు 2022 నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford india recalls ecosport suv due to diesel particulate filter dpf issues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X