'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ (Citroen) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సిట్రోయెన్ సి3 (Citroen C3) గురించి కంపెనీ కొత్త వివరాలను వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం, ఇది వచ్చే ఏడాది భారతదేశంలో విడుదల కానుంది. సిట్రోయెన్ సి3 సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ గడచిన సెప్టెంబర్ నెలలో 'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా' ప్రకటనతో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది సిట్రోయెన్ నుండి వస్తున్న రెండవ మోడల్.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

సిట్రోయెన్ ప్రస్తుతం భారత మార్కెట్లో సి5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross) అనే ప్రీమియం ఎస్‌యూవీని మాత్రమే విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు దేశంలో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో కంపెనీ వెల్లడించిన చిత్రాల ప్రకారం, సిట్రోయెన్ సి3 యొక్క ఎక్ట్సీరియర్‌లోని ముఖ్యాంశాలు మరియు ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. అయితే, ఆ సమయంలో సి3 ఎస్‌యూవీ ఇంటీరియర్ గురించిన సమాచారం చాలా తక్కువగా ఉంది.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

కాగా, ఇప్పుడు సిట్రోయెన్ సి3 ఇంటీరియర్లకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. ఈ కారు యొక్క అంతర్గత లక్షణాలను చూపించే చిత్రాలను కూడా కంపెనీ షేర్ చేసింది. మొదటి చూపులో, సిట్రోయెన్ సి3 యొక్క క్యాబిన్ అద్భుతమైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ యొక్క వీల్‌బేస్ 2,540 మిమీగా ఉంటుంది, కాబట్టి క్యాబిన్ లోపల విశాలమైన లభిస్తుందని తెలుస్తోంది. పొడవాటి వీల్‌బేస్ కారణంగా వెనుక సీటులో ప్రయాణీకులకు సెగ్మెంట్‌లో కెల్లా అత్యుత్తమ లెగ్‌రూమ్ లభిస్తుంది.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

ఇంకా ఈ కారులో అధిక డ్రైవింగ్ పొజిషన్, ప్రీమియం డ్యాష్‌బోర్డ్, నిలువుగా ఉంటే ఎయిర్ వెంట్స్, మధ్యలో క్షితిజ సమాంతరంగా ఉంటే ఎయిర్ వెంట్స్, క్యాబిన్ ముందు భాగంలో తగినంత స్టోరేజ్ స్పేస్, స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్లతో కూడిన టచ్‌స్క్రీన్‌, డాష్‌బోర్డ్ మధ్యలో 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పీచ్ రికగ్నిషన్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారులో మూడు ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్‌బి చార్జింగ్ పోర్ట్‌లు, 12V సాకెట్‌, ఒక లీటర్ గ్లోవ్‌బాక్స్ మరియు 315 లీటర్ల బూట్ స్పేస్ మొదలైన ప్రత్యేకతలను కలిగి ఉంటుంది.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

సిట్రోయెన్ ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ (దక్షిణ అమెరికా) క్రిస్టియానో ​​గాలో మాట్లాడుతూ.. మార్కెట్లో పోటీ ఆఫర్‌లతో ఆధునిక మరియు బహుముఖ వాహనాన్ని అందించడమే ఈ మోడల్‌ల లక్ష్యం అని అన్నారు. ఫ్రెంట్ కార్ బ్రాండ్ ఈ కారుని ఎస్‌యూవీ లుక్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్ గా అభివర్ణిస్తోంది. ఈ కారును కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMP)పై ఆధారపడి నిర్మించనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ వివిధ రకాల వాహనాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

దీన్నిబట్టి చూస్తుంటే, భవిష్యత్తులో సిట్రోయెన్ సి3 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ఉండవచ్చని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్ట్సీరియర్ విషయానికొస్తే, సి3 స్మార్ట్ డిజైన్‌ను కలిగి ఉండి, ఇరువైపులా స్టైలిష్ ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు సన్నని ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటుంది. ఫ్రంట్ బానెట్‌పై ఉన్న రెండు క్రోమ్ బార్‌లు, ఇరువైపులా రెండు DRL యూనిట్‌లుగా విడిపోయినట్లు అనిపిస్తాయి. ఇది కారుకి మరింత స్పోర్టీనెస్ ను జోడిస్తుంది. ఇంకా ఇందులో చక్కగా డిజైన్ చేయబడిన అ్లలాయ్ వీల్స్ మరియు ఎల్ఈడి టైల్‌లైట్‌లు కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

సిట్రోయెన్ సి3 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉండి, భారతీయ రోడ్లకు అనుగుణంగా ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ కారు టర్నింగ్ రేడియస్ 10 మీటర్లు ఉంటుందని సమాచారం. కాబట్టి, ఇది ఇరుకైన రోడ్లపై కూడా సులువుగా టర్న్ చేయడానికి వీలుగా ఉంటుంది. కంపెనీ ఈ కారును నాలుగు రంగులలో అందించనుంది. ఇది ఆరెంజ్-వైట్ డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ కలర్‌తో పాటు, ఆరెంజ్-బ్లాక్, బ్లూ-వైట్ మరియు గ్రే-బ్లాక్ కాంబినేషన్‌లో లభ్యం కానుంది.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, సిట్రోయెన్ సి3 కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. అయితే, ప్రస్తుతానికి ఈ కారులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందో లేదో ఖచ్చితంగా తెలియదు. సిట్రోయెన్ సి3 కారులో మరొక విశిష్టత ఏంటంటే, ఇది భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌ని పొందిన మొదటి కారుగా చరిత్ర సృష్టించనుంది.

'మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా'.. సి3 ఎస్‌యూవీ వివరాలను వెల్లడించిన సిట్రోయెన్

అంటే ఈ కారులో గ్యాసోలిన్ మరియు ఇథనాల్ ఇంధనాలను కూడా ఉపయోగించవచ్చన్నమాట. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో, కార్ల తయారీదారులు ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో కూడిన ఎస్‌యూలీని వినియోగదారులు ఇష్టపడతారని ఆశిస్తున్నారు. సి3 కారుని తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న తిరువళ్లూరులో ప్లాంట్ లో స్థానికంగా తయారు చేయనున్నారు. ఈ కారు తయారీలో దాదాపు 90 శాతం స్థానికంగానే జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సొనెట్, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు టాటా నెక్సాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Fresh details revealed about citroen c3 suv will launch in india by next year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X