నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'నిస్సాన్ కిక్స్'పై కంపెనీ ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆగస్ట్ నెలలో నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని కొనుగోలు చేసే కస్టమర్లు రూ.90,000 వరకూ ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ అమ్మకాలను పెంచాలనే ఉద్దేశ్యంతో కంపెనీ, ఇంతటి భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

నిస్సాన్ కిస్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కంపెనీ అందిస్తున్న ఆఫర్లలో రూ.70,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 నగదు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే, బ్రాండ్ వెబ్‌సైట్ ద్వారా చేసిన బుకింగ్‌లకు కంపెనీ అదనంగా రూ.5,000 ఆన్‌లైన్ బుకింగ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఇలా మొత్తంగా రూ.90,000 వరకూ ప్రయోజనాలను పొందవచ్చు.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

ఈ కారు యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు కంపెనీ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన 7.99 శాతం వడ్డీతో రుణాలను కూడా అందిస్తోంది. ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలోని కస్టమర్ల కోసం నిస్సాన్ ప్రత్యేకంగా ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో 90,000 వరకు ప్రయోజనాలు, 7.99 శాతం వడ్డీతో రుణాలు మరియు 2 గ్రాముల బంగారు నాణెం వంటి ఆఫర్లు ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

నిస్సాన్ కిక్స్‌లోని అన్ని వేరియంట్‌లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అయితే, ఈ ఆఫర్లు వేరియంట్‌లు మరియు లొకేషన్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది. నిస్సాన్ యొక్క ఎన్ఐసి ఎనేబుల్డ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ అందిస్తారు. ఈ ప్రయోజనాలు ఆగస్టు 31, 2021 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ నాలుగు ట్రిమ్‌లలో మొత్తం ఎనిమిది వేరియంట్‌లలో లభిస్తుంది. వీటిలో ఎక్స్ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం మరియు ఎక్స్‌వి ప్రీమియం (ఆప్షనల్) ట్రిమ్స్ ఉన్నాయి. ఇది రెండు రకాల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

నిస్సాన్ కిక్స్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి శక్తిని మరియు 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పి శక్తిని మరియు 142 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

ఈ ఎస్‌యూవీలో ఎల్ఈడి హెడ్‌లైట్‌లు, క్రోమ్-సరౌండెడ్ గ్రిల్, మజిక్యులర్ హుడ్, పెద్ద ఎయిర్ వెంట్, రూఫ్ రెయిల్స్, బ్లాక్ బి-పిల్లర్స్ మరియు సైడ్ మిర్రర్స్, డిజైనర్ వీల్స్, ఎల్ఈడి టెయిల్ లైట్లు, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు రియర్ వైపర్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉంటాయి. కిక్స్ 2,673 మిమీ వీల్‌బేస్ మరియు 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో 8.0-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, కీ-లెస్ ఎంట్రీ మరియు క్రూయిజ్ కంట్రోల్, లెదర్-ర్యాప్డ్ పవర్ స్టీరింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ మొదలైనవి ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, క్రాష్ సెన్సార్లు, ఇంజన్ ఇమ్మొబిలైజర్ మరియు రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి. ధరల విషయానికి వస్తే, మార్కెట్లో నిస్సాన్ కిక్స్ ప్రారంభ ధర రూ.9.5 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ ధర రూ.14.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. ఇది ఈ విభాగంలో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టాటా హారియర్, స్కొడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై రూ.90,000 డిస్కౌంట్; ఈ కారుని కొనవచ్చా?

నిస్సాన్ బ్రాడ్ యొక్క ఈ నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కావున కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగిచుకోవచ్చు. నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవి అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉంటుంది. కావున వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎక్కువ అవుతున్న నిస్సాన్ వాహనాలు ఒకటి నిస్సాన్ మ్యాగ్నైట్ కాగా, తరువాత నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవి. ఏది ఏమైనా ఇది నిజంగా ఒక అద్భుతమైన ఎస్‌యూవి.

Most Read Articles

English summary
Get upto rs 90000 benefits on nissan kicks suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X