ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల విభాగంలో లంబోర్ఘిని కూడా ఒకటి. చాలామంది వాహన ప్రియులు జీవితంలో ఒక్కసారైనా లంబోర్ఘిని కారుని డ్రైవ్ చేయాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఈ కలను కొంతమంది సాకారం చేసుకుంటారు, మరి కొందరికి ఆ కల కలగానే మిగిలిపోతుంది.

అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో మాడిఫైడ్ వాహనాలు ఎక్కువవుతున్నాయి. కావున చాలామంది వాహన ప్రియులు వాహనాలను తమకు నచ్చినట్లు మాడిఫైడ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే మనం చాలా మాడిఫైడ్ వాహనాల గురించిన సమాచారం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే తరహాలో మరో మాడిఫైడ్ కారు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

నివేదికల ప్రకారం, హోండా కంపెనీకి చెందిన సివిక్ కారు లంబోర్ఘిని అవతారంలోకి మారింది. సాధారణంగా లంబోర్ఘిని కార్లలో V10 మరియు V12 వంటి శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి. లంబోర్ఘిని కార్లకు భారతదేశంలో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. లంబోర్ఘిని కార్లు విలక్షణమైన ఫీచర్స్ మరియు ఆధునిక డిజైన్స్ కలిగి ఉంటుంది. కావున ఎక్కువమందిని ఈ కార్లు ఆకర్షిస్తాయి.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

భారతదేశంలో లంబోర్ఘిని కార్ల సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే లంబోర్ఘిని కార్లు ఎక్కువ ఖరీదైనవి కావడం వల్ల సామాన్య ప్రజలు ఈటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం కొంత భిన్నంగా ఆలోచిస్తారు. తమ కార్లను లాంబోర్గినీ కార్ల మాదిరిగానే మోడిఫై చేయడానికి సంకల్పించుకుంటారు.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

మధ్యప్రదేశ్‌ చెందిన ఇండోర్‌కు చెందిన ఒక వ్యక్తి తన హోండా సివిక్‌ను లంబోర్ఘిని అవెంటడోర్‌గా మార్చుకున్నాడు. ఇది చూడటానికి దాదాపు లంబోర్ఘిని కారు మాదిరిగానే ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మాగ్నెటో 11 అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

ఈ వీడియో మీరు గమనించినట్లయితే హోండా సివిక్ కారును చూపడంతో ప్రారంభమవుతుంది. ఈ కారుకు సిల్వర్ షార్క్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ కారు షార్క్ సిల్వర్ కలర్‌లో డిజైన్ చేయబడింది. ఈ కారుకు చేసిన మోడిఫికేషన్స్ లో ఈ కలర్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిని ఇండోర్‌లో మెకానిక్ అయిన ఫిరోజ్ ఖాన్ మాడిఫైడ్ చేసినట్లు తెలిసింది.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

ఈ హోండా సివిక్ కారు చుట్టూ కస్టమ్ బాడీ ప్యానెల్స్ దాదాపు అవెంటడోర్ లుక్‌తో తెలుపు రంగులో అమర్చబడి ఉన్నాయి. కారులోని ప్రతి ప్యానెల్ అవెంటడోర్ మాదిరిగానే డిజైన్ చేయబడింది. మాడిఫైడ్ చేసిన ఈ కారులో బోనెట్, అప్‌హోల్‌స్టర్డ్ డోర్ ప్యానెల్‌లు, ఫ్రంట్ డోర్స్ పైన అమర్చిన రియర్ వ్యూ మిర్రర్, సైడ్ విండో ప్యానెల్, క్వార్టర్ విండో మిర్రర్, రియర్ ప్యానెల్, హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్‌ల్యాంప్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. వీలైనంత వెడల్పుగా టైర్లు కూడా అందించబడ్డాయి

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

ఈ మాడిఫైడ్ సివిక్ కారులో వింగ్ స్పాయిలర్ కారు వెనుక భాగంలో అమర్చబడి, ముందు మరియు వెనుక చక్రాల మధ్య ఎరుపు గీత ఉంటుంది. LED ఫాగ్ ల్యాంప్ మరియు LED టర్న్ ఇండికేటర్ ఫ్రంట్ బంపర్ ప్యానెల్‌పై అమర్చబడి ఉంటాయి. ఇది ఒరిజినల్ అవెంటడార్ రోడ్‌స్టర్ లాగా, ఈ హోండా సివిక్ కారు రూఫ్‌పై ట్విస్ట్ ఇవ్వబడింది. ఇంజిన్ పొగను విడుదల చేసే ఎగ్జాస్ట్ పైప్ ఖచ్చితంగా కారు మధ్యలో అందించబడుతుంది. దాని నుండి వెలువడే ధ్వని దాదాపు లంబోర్ఘిని అవెంటడోర్‌ను పోలి ఉంటుంది.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

అయితే ఇంజిన్ మాత్రం లంబోర్ఘిని కారులోనిది కాదు, సివిక్ కారులోని ఇంజిన్ ఇందులో యధావిధిగా ఉపయోగించారు. ఇందులో 400-లీటర్ సామర్థ్యం కలిగిన బూట్ స్పేస్ ఉంటుంది. ఈ బూట్ స్పేస్ డోర్ పైకి లిఫ్ట్‌గా అందించబడింది. డోర్స్ కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడిందని చెప్పారు.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

ఈ మాడిఫైడ్ కారు యొక్క లోపలి క్యాబిన్ మొత్తం నలుపు రంగులోకి మార్చబడింది. కానీ హోండా సివిక్ కారు డ్యాష్‌బోర్డ్ అలాగే ఉంది. ఈ హోండా సివిక్ కొత్త స్పోర్ట్ సీట్, డ్యాష్‌బోర్డ్‌పై లైట్ స్ట్రిప్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు చిన్న వెనుక సీట్లతో అనుసంధానించగల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక మార్పులను పొందింది. ఈ కారు వెనుక సీట్లో ఇద్దరూ హాయిగా కూర్చోవచ్చు.

డోర్ ట్రిమ్ మరియు రూఫ్ ప్యానెల్లు ట్రాన్స్ మిషన్ సిస్టమ్ కోసం సెల్ఫ్ డెవలప్డ్ వ్యవస్థాపించబడ్డాయి. కారులో రూఫ్ మిషన్, రూఫ్ ప్యానెల్, పవర్ విండో మిర్రర్ మరియు రియర్ సైడ్ వ్యూ మిర్రర్ కోసం స్విచ్‌లు కూడా ఉన్నాయి. ఇది మొత్తానికి నిజమైన లంబోర్ఘిని కాకపోయినప్పటికీ లంబోర్ఘిని మాదిరిగానే ఉంటుంది.

ఇది హోండా సివిక్ అంటే నమ్ముతారా.. అయితే వీడియో చూడండి

భారతదేశంలో వాహన సవరణకు సంబంధించి, సుప్రీంకోర్టు ఆదేశాలు మరియు మోటారు వాహన చట్టం ప్రకారం చట్ట విరుద్ధంగా మాడిఫైడ్ చేసిన వాహనాలు ప్రజారహాదారులపైన తిరగడానికి అనుమతించబడవు. వీటిని రేసింగ్ ట్రాక్ లేదా ఫామ్‌హౌస్ వంటి ప్రైవేట్ ప్రదేశాలలో ఉపయోగించవచ్చు. ఇలాంటి వాహనాలు పబ్లిక్ రోడ్లపై కనిపిస్తే, వాహనాలను రవాణా శాఖ లేదా ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయవచ్చు.

Most Read Articles

English summary
Honda civic car modified like lamborghini aventador roadster video details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X