మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
భారత మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తన శాంట్రో, గ్రాండ్ ఐ నియోస్, ఆరా, ఎలంట్రా, కోన వంటి మోడళ్లపై మార్చి నెల ప్రారంభంలోనే భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ ఈ కార్లపై దాదాపు రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య నిపుణులు వంటి వారికి కూడా ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నారు.

హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ కారు అయిన శాంట్రోపై ఇప్పుడు దాదాపు రూ. 50 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. కంపెనీ ఈ కారును రూ. 4.67 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 5.99 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ శాంట్రో అమ్మకాలు గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పడుతున్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్‌కు ఇప్పుడు రూ. 60 వేల వరకు తగ్గింపును అందిస్తున్నారు. టాప్ వేరియంట్‌కు రూ. 7.33 లక్షల వరకు వుండే ఈ కారు ప్రస్తుతం రూ. 5.19 లక్షల ధరలకు లభిస్తోంది. ఈ కారణంగా దీని అమ్మకాలు మెల్లగా ముందుకు వెళ్తున్నాయి.

మార్చి నెలలో కంపెనీ సెడాన్ ఆరాపై రూ. 70,000 వరకు తగ్గింపును అందిస్తున్నారు. టాప్ వేరియంట్‌కు రూ. 7.43 లక్షల వరకు వుంది . అయితే ఇది ఇప్పుడు రూ. 5.92 లక్షల ధరకు అందుబాటులోకి తెస్తున్నారు. అదే విధంగా హ్యుందాయ్ ఎలంట్రాపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతోంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోనపై కంపెనీ మార్చిలో రూ. 1.50 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఇది కంపెనీలో అత్యల్పంగా అమ్ముడవుతున్న మోడల్. ఈ కారును రూ. 23.75 లక్షల ధరలకు అందుబాటులోకి తెస్తున్నారు. దీని టాప్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 23.94 లక్షల వరకు ఉంటుంది.

హ్యుందాయ్ కంపెనీ ఈ ఆఫర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సహా అనేక వర్గాల ఉద్యోగులకు రూ. 8000 వరకు రిబేటు ఇవ్వబడుతోంది. కంపెనీ క్రెటా ఎస్‌యూవీ, కొత్త ఐ 20, కొత్త వెర్నా, వెన్యూ, టక్సన్, యాసెంట్ వంటి మోడళ్లపై మార్చి 2021 లో డిస్కౌంట్ ఇవ్వడం లేదు.

హ్యుందాయ్ యొక్క క్రెటా ఎస్‌యూవీ గత నెలలో కంపెనీని అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. హ్యుందాయ్ అమ్మకాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు పెరిగాయి. అయినప్పటికీ జనవరి 2021 నాటికి అమ్మకాలలో తగ్గుదల నమోదైంది. క్రెటా అమ్మకాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఏది ఏమైనా ఈ డిస్కౌంట్స్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








