మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా ధరలను కంపెనీ మరోసారి పెంచింది. తాజాగా, హ్యుందాయ్ క్రెటా డీజిల్ వెర్షన్ ధరలు రూ.19,600 మేర పెరగగా, పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.13,600 మేర పెరిగాయి.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ ఈ ఏడాది జనవరి నెలలో మరియు గతేడాది అక్టోబర్ నెలలో కూడా క్రెటా ఎస్‌యూవీ ధరలను పెంచిన సంగతి తెలిసినదే. ఈ ఎస్‌యూవీ ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నప్పటికీ, దీనికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

గత అక్టోబర్ 2020లో హ్యుందాయ్ క్రెటా ధరలతో పోలిస్తే, ప్రస్తుత ధరలు సుమారు రూ.60,000 వరకు పెరిగాయి. హ్యుందాయ్ క్రెటా యొక్క బేస్ పెట్రోల్ ఈ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇది మునుపటి మాదిరిగానే రూ.9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అమ్ముడవుతోంది. అయితే, ఈ వేరియంట్ కోసం సుమారు 12 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

కాగా, హ్యుందాయ్ క్రెటా యొక్క అన్ని పెట్రోల్ వేరియంట్ల ధరలను రూ.13,600 మేర పెంచారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 1.26 శాతం పెరుగుదల. అలాగే, క్రెటా యొక్క డీజిల్ వేరియంట్లలో బేస్ వేరియంట్ ధర అత్యధికంగా రూ.19,600 మేర పెరిగింది.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

ధరల పెంపు అనంతరం హ్యుందాయ్ క్రెటా ఈ డీజిల్ బేస్ వేరియంట్ ధర రూ.10.51 లక్షలకు చేరుకుంది. మిగిలిన అన్ని ఇతర డీజిల్ వేరియంట్ల ధరలు రూ.13,600 మేర పెరిగాయి.

MOST READ:భారత్‌లో విడుదలైన 2021 సుజుకి హయాబుసా; ధర & వివరాలు

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

కొత్త సంవత్సరం 2021 ప్రారంభంలో, హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ వేరియంట్ ధరలను రూ.35,500 మేర మరియు డీజిల్ వేరియంట్ ధరలను రూ.51,100 మేర పెంచిన విషయం తెలిసినదే. క్రెటా ధరలు పెరిగినప్పటికీ, ఈ ఎస్‌యూవీకి డిమాండ్ మాత్రంతగ్గలేదు.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

గడచిన మార్చి 2020లో కొత్త తరం హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి, ఈ మోడల్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా కొనసాగుతోంది. గత మార్చి 2021 నాటికి 1.21 లక్షలకు పైగా కొత్త తరం క్రెటా ఎస్‌యూవీలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెండవ తరం హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పిల శక్తిని మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను అందిస్తాయి.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

ఇకపోతే, టాప్-ఎండ్ హ్యుందాయ్ క్రెటా వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పై మూడు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

MOST READ:భారత మార్కెట్లో టాప్ 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. వివరాలు

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

అయితే, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మరోసారి పెరిగిన హ్యుందాయ్ క్రెటా ధరలు; ఈసారి ఎంతంటే..?

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ ఇటీవలే ఆవిష్కరించిన తమ సరికొత్త 7-సీటర్ హ్యుందాయ్ అల్కజార్ ఇండియా లాంచ్ మరింత ఆలస్యం కానుంది. భారతదేశంలో శరవేగంగా విస్తరింస్తున్న కోవిడ్-19 కారణంగా, ఈ ఎస్‌యూవీ లాంచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. క్రెటా ఆధారంగా ఈ 7-సీటర్ అల్కజార్‌ను తయారు చేశారు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Hyundai Creta Price Increased Again, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X