ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ 7-సీటర్ అల్కజార్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇన్నాళ్లుగా కార్ ప్రియులను ఊరిస్తూ వచ్చిన 7-సీటర్ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా (అలియాస్ హ్యుందాయ్ అల్కజార్) రూపాన్ని మరియు డిజైన్ ఫీచర్లను కంపెనీ ఎట్టకేలకు వెల్లడి చేసింది.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎమ్ఎల్) తమ కొత్త 7 / 6 సీటర్ వెర్షన్ అల్కజార్ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎస్‌యూవీని వచ్చే నెల నుండి భారత మార్కెట్లో అధికారికంగా అమ్ముడుకానుంది.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీని 6 సీట్లు లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌తో కంపెనీ అందించనుంది. ఇందులో 6-సీటర్ వెర్షన్‌లో మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లు ఉంటాయి. అలాగే, 7-సీటర్ వెర్షన్‌లో మధ్య వరుసలో బెంచ్ సీట్ ఉంటుంది.

MOST READ:భారత్‌లో విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి ఫేస్‌లిఫ్ట్; ధర & వివరాలు

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

హ్యుందాయ్ అల్కజార్‌ను రెండు ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఒకటి 2.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరొకటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయనుంది.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

హ్యుందాయ్ తమ ఎలాంట్రా సెడాన్ మరియు టక్సన్ ఎస్‌యూవీలలో ఉపయోగిస్తున్న 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే ఈ కొత్త హ్యుందాయ్ అల్కజార్‌లో ఉపయోగించనున్నారు. మార్కెట్ సమాచారం ప్రకారం, కంపెనీ ఈ ఇంజన్‌ను రీట్యూన్ చేసినట్లు తెలుస్తోంది.

MOST READ:స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్; అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

ఇంజన్ రీట్యూనింగ్ కారణంగా హ్యుందాయ్ అల్కాజార్‌లోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయనుంది. ఇకపోతే, ఇందులోని 1.5-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న హ్యుందాయ్ క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీని గ్రహించనున్నారు.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

ఈ రెండు ఇంజన్లతో కంపెనీ స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను ఆఫర్ చేస్తోంది.

MOST READ:యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కంపెనీ విక్రయిస్తున్న క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు త్వరలో విడుదల కానున్న హ్యుందాయ్ అల్కాజార్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీలు రెండూ కూడా బయటి వైపు నుండి చూడటానికి ఒకేరకమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా అనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ పొడవు 4,330 మి.మీ, వెడల్పు 1,790 మి.మీ మరియు వీల్‌బేస్ 2,760 మి.మీగా ఉంటుంది. ఇందులో పెద్ద 50 లీటర్ ఇంధన ట్యాంక్‌ను అమర్చారు. హ్యుందాయ్ క్రెటాతో పోల్చుకుంటే, అల్కజార్ 150 మి.మీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. పొడగించిన కొలతల కారణంగా క్రెటా మరియు అల్కజార్‌ల వెనుక డిజైన్ వేర్వేరుగా ఉంటుంది.

MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

హ్యుందాయ్ అల్కజార్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, లాంగ్ రియర్ ఓవర్‌హాంగ్, వెనుక భాగంలో క్వార్టర్ గ్లాస్ మరియు 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

ఇవే కాకుండా, సి-ఆకారపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ రియర్ ఎండ్, మరింత నిటారుగా ఉన్న రూఫ్‌లైన్ టెయిల్‌గేట్, రివైజ్డ్ బంపర్‌లు ఉంటాయి. ఇవన్నీ సున్నితమైన స్పోర్టినెస్ డిజైన్ ఫిలాసఫీని కలిగి ఉంటాయి. లోపలి భాగంలో మూడవ వరుసలో 50:50 స్ప్లిట్ సీట్లు మరియు స్పీడ్ కంట్రోల్‌తో కూడిన ఏసి వెంట్స్ ఉన్నాయి.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

ఈ కారులో డ్యూయల్-టోన్ థీమ్ ఇంటీరియర్ ఉంటుంది. ఇంకా ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూలింక్ కార్ కనెక్టివిటీ, పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇదిగిదుగో.. హ్యుందాయ్ అల్కజార్..: 7-సీటర్ క్రెటా ఆవిష్కరణ

ఇక ఇందులోని ఇతర ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పనోరమిక్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, పెద్ద ఎమ్ఐడి డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌లు మొదలైనవి ఉండనున్నాయి. మార్కెట్లో దీని ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Hyundai Alcazar 7-Seater SUV Unveiled: Exterior, Interior, Features And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X