గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారు. రోజురోజుకి లెక్కకు మించిన జనాభా ఈ మహమ్మారి బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న చాలా వాహన తయారీదారులు ఇప్పటికే తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇందులో భాగంగా హ్యుందాయ్ కంపెనీ ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా యొక్క దాతృత్వ సంస్థ హ్యుందాయ్ ఫౌండేషన్ సామజిక సేవలో భాగంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సదుపాయం అందించడానికి 'స్పార్ష్ సంజీవని' అనే 'మొబైల్ మెడికల్ వ్యాన్' ప్రారంభించింది.

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

హ్యుందాయ్ కంపెనీ ప్రారంభించిన ఈ మొబైల్ మెడికల్ వ్యాన్లు దేశంలోని మారుమూల గ్రామాలకు వెళ్లి గ్రామస్తులకు ఉచిత వైద్యం అందిస్తున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా మొబైల్ వ్యాన్లు నడుపుతున్న వీడియోను కంపెనీ ఇటీవల తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది.

MOST READ:ప్రవహించే నదిలో మహీంద్రా ఎక్స్‌యూవీ300; వైరల్ అవుతున్న వీడియో

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం పేద ప్రజలకు ఉచితంగా సర్వీస్ చేయడానికి ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శించి కనీసం 100 మందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ మొబైల్ వ్యాన్లో వైద్యం చేయడానికి సిబ్బంది కూడా ఉంటుంది. వైద్యులు ప్రజలకు అవసరమైన ప్రథమ చికిత్స చేసి మందులు వంటివి ఇస్తారు.

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

ఒక వేలా నయం చేయలేని రోగాలు లేదా తీవ్రమైన అనారోగ్యం పాలైన ప్రజలను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని సూచిస్తారు. ఈ మొబైల్ వ్యాన్లు రోగులకు సంబంధించిన డేటాను కూడా భద్రపరుస్తారు. అంతే కాకుండా వ్యాన్లో ట్రీట్మెంట్ తీసుకునే వారికి హెల్త్ కార్స్ కూడా అందిస్తారు.

MOST READ:పరుగులు పెడుతున్న కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్; పూర్తి వివరాలు

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

హాస్పిటల్స్ అందుబాటులో లేని లేదా హాస్పిటల్స్ కొరత ఉన్న గ్రామీణా ప్రాంతాలలో ఈ మొబైల్ వ్యాన్లు ఉచితంగా చికిత్స అందిస్తాయి. ఈ ఫ్రీ సర్వీస్ మొబైల్ మెడికల్ వ్యాన్లను హ్యుందాయ్ కంపెనీ 2021 జనవరిలో రాజస్థాన్‌లోని అల్వార్ లో ప్రారంభించింది.

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

హ్యుందాయ్ కంపెనీ యొక్క మొబైల్ మెడికల్ వ్యాన్లలో బ్లడ్ టెస్ట్, బిపి, షుగర్, మలేరియా, డెంగ్యూ మొదలైన వాటిని పరీక్షించే సౌకర్యం ఉంది. ఇదిమాత్రమే కాకుండా వివిధ వ్యాధులు మరియు వాటి నివారణ గురించి అవగాహన కార్యక్రమాలు కూడా ఈ వ్యాన్ ద్వారా నిర్వహిస్తున్నారు. హ్యుందాయ్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ సదుపాయం గ్రమయిన ప్రజలకు నిజంగా ఒక వరం అనే చెప్పాలి.

MOST READ:అమాంతం పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్ ధరలు.. పెరిగిన ధరల వివరాలు ఇక్కడ చూడండి

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న తమిళనాడు ప్రభుత్వానికి హ్యుందాయ్ ఇటీవల రూ. 10 కోట్లు విరాళంగా అందించింది. అంతే కాకుండా కరోనా మహమ్మారి నివారణలో భాగంగా ఆక్సిజన్ యంత్రాలతో పాటు రెండు ఆక్సిజన్ ప్లాంట్లతో సహా ఐదు కోట్ల రూపాయల విలువైన వైద్య పరికరాలను కంపెనీ ఆ రాష్ట్రానికి అందించింది.

హ్యుందాయ్ కంపెనీ కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తమ కస్టమర్లను అనుకూలంగా ఉండటానికి వారంటీ మరియు ఫ్రీ సర్వీస్ వ్యవధిని మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటన వల్ల హ్యుందాయ్ కస్టమర్లు తమ వాహనాలకు ఈ అవకాశాన్ని మరో రెండు నెలలలో వినియోగించుకోవచ్చు. కావున ఈ సమయంలో కస్టమర్లు బయటకు రావలసి ఉండదు.

MOST READ:ఈ కారణంగానే అక్కడ లాక్‌డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలు ఇచ్చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా?

గ్రామీణ ప్రజల కోసం 'మొబైల్ మెడికల్ వ్యాన్లు' ప్రారంభించిన హ్యుందాయ్: వివరాలు

హ్యుందాయ్ కంపెనీ లాక్ డౌన్ లో కూడా అమ్మకాలను జరపడానికి పూర్తిగా డిజిటలైజేషన్ చేసింది. కావున కస్టమర్లు ఇంట్లో కూర్చుని కూడా తమకు నచ్చిన హ్యుందాయ్ కారును ఇంటికే డెలివరీ చేసుకోవచ్చు. గత సంవత్సరం లాక్ డౌన్ లో కూడా కంపెనీ ఈ సదుపాయం కల్పించబడింది. హ్యుందాయ్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వినియోదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Most Read Articles

English summary
Hyundai Mobile Chikitsa Van Sparsh Sanjeevani Treating Villagers Details. Read in Telugu.
Story first published: Saturday, May 29, 2021, 15:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X