Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) ప్రస్తుతం భారతదేశంలో సి5 (C5) అనే ప్రీమియం ఎస్‌యూవీని విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు కంపెనీ తమ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ సి3 (C3) ని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సిట్రోయెన్ సి5 తర్వాత భారత మార్కెట్లో కంపెనీ అందించే రెండవ కారు సి3 అవుతుంది.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

సిట్రోయెన్ సి3 (Citroen C3) ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ నుండి రానున్న సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది మొత్తం పొడవులో నాలుగు మీటర్ల తక్కువగా ఉంటుంది. అంటే, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో అత్యంత పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి సిట్రోయెన్ సి3 ప్రవేశించబోతోందన్నమాట. మరి. ఈ చిన్న ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్‌లోని ఇతర ఎస్‌యూవీల కంటే ఏవిధంగా భిన్నంగా ఉంటుందో తెలుసుకుందాం రండి..!

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

1. భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు

సిట్రోయెన్ సి3 భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారుగా రానుంది. అంటే, ఇది ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ ను కలిగి ఉంటుందన్నమాట. పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా పూర్తిగా 100 శాతం బయో-ఇథనాల్ (జీవ ఇంధన)తో నడిచే ఇంజన్‌ను ఫ్లెక్-ఫ్యూయెల్ ఇంజన్ అంటారు. అంటే, ఇది పూర్తిగా పెట్రోల్‌తో అయినా పనిచేస్తుంది లేదా పూర్తిగా జీవ ఇంధనంతోనైనా పనిచేస్తుంది.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

అలాకాకుండా, పెట్రోల్ మరియు ఇథనాల్ కలిపిన మిశ్రమ ఇంధనంతో కూడా పనిచేస్తుంది. ఈ ఒక్క అంశమే సిట్రోయెనో సి3 కారు, ఈ విభాగంలోని ఇతర కార్ల కన్నా బెస్ట్ అని ముద్ర వేయడానికి సహకరిస్తుంది. భారతదేశంలో ఉత్పత్తి చేసే కార్లలో, తయారీదారులు ఫ్లెక్స్ ఇంజన్‌తో నడిచే కార్లను తయారు చేయాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసినదే. కార్లలో ఫ్లెక్స్ ఇంజన్ మరియు ఫ్లెక్స్ ఫ్యూయెల్ ని ఉపయోగించడం వలన వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

2. ఆసియాలో ప్రారంభించబడనున్న మొదటి మోడల్

సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ కంపెనీ ముందుగా ఆసియా మార్కెట్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా, యూరోపియన్ కార్ కంపెనీలు, తమ కొత్త వాహనాలను ముందుగా యూరప్ లేదా అమెరికా మార్కెట్లలో విడుదల చేస్తాయి, ఆ తర్వాతనే ఆసియా మార్కెట్లకు తీసుకురాబడుతాయి. అయితే, సిట్రోయెన్ సి3 విషయంలో కంపెనీ ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఈ ఫ్రెంచ్ కంపెనీ ముందుగా ఆసియాలో సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఇది భారతదేశంతో సహా ఆగ్నేయాసియాలోని పలు ఇతర దేశాలలో అందుబాటులోకి రానుంది.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

3. దేశంలోని ఇతర సబ్-4 మీటర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, సిట్రోయెన్ సి3 భారత ప్యాసింజర్ కార్ విభాగంలోని అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ (సబ్-4 మీటర్) ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. అంటే, దీని పరిమాణం 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఈ విభాగంలోని కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసినదే. ఇక్కడి మార్కెట్లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విబాగం గత కొన్ని సంవత్సరాలలో అత్యంత ప్రియమైన ఎస్‌యూవీ విభాగంగా మారింది.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

హ్యాచ్‌బ్యాక్ కంటే పెద్దదిగా మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ కంటే చిన్నదిగా ఉండే కార్ విభాగమే ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం. ప్రస్తుతం కార్ల తయారీదారులు ఈ విభాగంలో అనేక ఉత్పత్తులను విక్రయిస్తున్నారు మరియు వాటిలో అత్యుత్తమ ఫీచర్లను కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ కార్ల ధరలు కూడా ఇంచు మించు హ్యాచ్‌బ్యాక్‌లతో సమానంగా ఉంటున్నాయి. కాబట్టి, వినియోగదారులు ఎక్కువగా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఇష్టపడుతున్నారు. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కూడా ఇటీవలే తమ కొత్త కారు టాటా పంచ్‌ను ఈ విభాగంలో విడుదల చేసింది.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

4. సిట్రోయెన్ సి3 డిజైన్ మరియు ఫీచర్లు

సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీలోని అనేక డిజైన్ ఎలిమెంట్స్ దాని పెద్ద ఎస్‌యూవీ అయిన సి5 తో పంచుకునే అవకాశం ఉంది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్స్, అండర్ బాడీ క్లాడింగ్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

అలాగే, ఇందులోని కారు హెడ్‌లైట్ ఫ్రంట్ బంపర్‌ పై అమర్చబడి ఉంటుంది మరియు దాని పైభాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు అమర్చబడి ఉంటాయి. ఇంకా, ఈ ఎస్‌యూవీలో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ తో కూడిన పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

5. శక్తివంతమైన ఇంజన్

సిట్రోయెన్ సి3 సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌తో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ పూర్తిగా పెట్రోల్, పూర్తిగా ఇథనాల్ లేదా పెట్రోల్-ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 130 బిహెచ్‌పి వరకూ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని సమాచారం.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

6. CMP ప్లాట్‌ఫామ్‌పై నిర్మాణం

సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీని కంపెనీ సరికొత్త కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (CMP) పై నిర్మించనుంది. ఈ ప్లాట్‌ఫామ్ పై రూపొందించబడే కార్లు తక్కువ ధరను కలిగి ఉంటాయి. దీని కోసం, సిట్రోయెన్ సంస్థ టాటా ఇంజనీర్ల సహాయంతో CMP ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును అభివృద్ధి చేస్తోంది.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీని కూడా ఇదే CMP ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి నిర్మించారు. ఈ డిజైన్ ప్లాట్‌ఫామ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, కార్ కంపెనీలు ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఎస్‌యూవీలు, ఎమ్‌పివిలు, సెడాన్‌లు మరియు హ్యాచ్‌బ్యాక్‌ల వంటి బాడీ టైప్ కార్లను తయారు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రైన్ లతో పాటుగా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు!

7. ధర ఎంత ఉంటుంది?

మార్కెట్ అంచనా ప్రకారం, సిట్రోయెన్ ఈ ఎస్‌యూవీని భారతదేశంలో రూ. 5.50 లక్షల నుంచి 8.50 లక్షల మధ్య విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ ధర పరిధిలో, ఇది టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సొనెట్, రెనో కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడుతుంది.

Most Read Articles

English summary
Important things to know about citroen c3 compact suv price features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X