భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

దేశీయ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) భారతీయ మార్కెట్లో మహీంద్రా థార్ (Mahindra Thar) SUV విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ SUV దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 4×4 SUVలలో ఒకటి. ఇప్పటి వరకు కూడా కంపెనీ ఈ ఆధునిక SUV కోసం ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది. ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ SUV డెలివరీ పొందటానికి దాదాపు ఒక సంవత్సర కాలం వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇటీవల మహీంద్రా థార్ SUV కి సంబంధించిన ఒక సమాచారం వెలువడింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

మహీంద్రా థార్ SUV కి సంబంధించిన సమాహారం ప్రకారం, ఇప్పటికే మహీంద్రా థార్ కొనుగోలు చేసి ఉంటే, మీరు దాని ఇంధన సామర్థ్యం గురించి ఆందోళన చెందుతుంటే, మీరు నిజంగా CNG కిట్‌ను థార్‌లో ఎలా అమర్చవచ్చో ఇక్కడ పూర్తగా చూడవచ్చు. డీఐకి సంబంధించి వీడియో కూడా అందుబాటులో ఉంది.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

ఈ వీడియోలో మీరు గమనించినట్లైతే ఒక మహీంద్రా థార్ కొనుగోలుదారు తన థార్ SUV లో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు చూడవచ్చు. ఈ వీడియోను గ్రీన్ ఫ్యూయల్స్ అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో థార్ కొనుగోలుదారు తన కారులో ఇన్‌స్టాల్ చేసిన ఆఫ్టర్‌మార్కెట్ CNG కిట్‌ను చూపారు.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

ఈ కిట్ మహీంద్రా థార్ యొక్క టర్బో పెట్రోల్ వెర్షన్‌కు అమర్చబడింది. మహీంద్రా థార్ యొక్క ఇంజన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్. కావున ఈ స్థితిలో ఈ ఇంజిన్ కి CNG ఫిట్టింగ్‌లో స్పెషల్ కిట్ చాలా అవసరం. అయితే ఇందులో సాధారణ CNG కిట్‌ అంతగా పనిచేయవు.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

ఈ కారు యొక్క ఇంటీరియర్ లోని సెంటర్ కన్సోల్‌లో CNG లెవెల్ సూచించే స్విచ్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది కాకూండా లోపల ఇతర మార్పులు చేయలేదు. పెట్రోల్ నుండి CNG కి మారడం సౌకర్యంగా ఉంటుందని మరియు పనితీరు సమస్య ఉండదని అతడు తెలిపాడు.

ఇందులోని ఇంజిన్ వేగంగా అనిపిస్తుంది మరియు రెస్పాన్స్ సమయం కూడా దాదాపు పెట్రోల్ వెర్షన్‌తో సమానంగా ఉంటుంది. కావునా ఇది వాహా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారులో CNG కిట్ ఎలా ఇన్‌స్టాల్ చేయబడిందో వీడియోలో స్పష్టంగా తెలుస్తుది.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

ఈ మహీంద్రా థార్ యొక్క హుడ్ లోపల, కారులో డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్ వాహనం కోసం ఇంజెక్టర్లు, రీడ్యూసర్లు మరియు ప్రత్యేక ECUలు వ్యవస్థాపించబడ్డాయి. వైర్లు, పైపులు మరియు గొట్టాలు అన్నీ హుడ్ కింద చక్కగా ఉంచబడ్డాయి. SUV వెనుక వైపు 14 కిలోల గ్యాస్ సిలిండర్‌ను కలిగి ఉన్నందున SUV యొక్క బూట్ స్పేస్ చాలా ఖచ్చితంగా పోయింది.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

ఇందులో CNG కోసం రీఫిల్లింగ్ నాజిల్ బానెట్ కింద ఉంచబడలేదు, అది పెట్రోల్ ఫిల్లర్ క్యాప్ పక్కన ఉంచబడింది. ఈ మహీంద్రా థార్‌లోని CNG కిట్ ఫిట్టింగ్‌లు చాలా చక్కగా కనిపిస్తాయి. ఇదే కొనుగోలుదారు ఇటీవల విడుదల చేసిన మహీంద్రా XUV700 లో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చని కూడా గతంలో తెలియజేశారు.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

మహీంద్రా థార్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో LED DRLలు, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ISOFIX మౌంట్‌లతో ఫార్వర్డ్-ఫేసింగ్ రియర్ సీట్లను పొందుతుంది. మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

మహీంద్రా థార్‌ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది.

భారతదేశపు మొట్టమొదటి CNG మహీంద్రా థార్.. ఇది ఎలా పని చేస్తుందంటే?

కంపెనీ ఇప్పటికే అందించిన నివేదికల ప్రకారం, Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ కూడా త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి కంపెనీ ఇప్పటికే కొంత సమాచారం వెల్లడించింది. Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ 2023-2026 మధ్య భారతదేశంలో ప్రారంభించబడుతుందని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
India first mahindra thar with aftermarket cng kit fitting details
Story first published: Friday, December 10, 2021, 13:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X