షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా గతేడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన కొత్త తరం మహీంద్రా థార్, దేశీయ విపణిలో అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసినదే. ఈ మోడల్‌కి ఏర్పడిన భారీ డిమాండ్ కారణంగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగానే ఉంటోంది.

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

మరోవైపు మహీంద్రా థార్ డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ కూడా భారీగానే కసరత్తులు చేస్తోంది. అయినప్పటికీ, విడిభాగాల కొరత మహీంద్రాను వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఫలితంగా మహీంద్రా థార్ ఉత్పత్తిలో మరింత జాప్యం ఏర్పడుతున్నట్లు సమాచారం.

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

తాజాగా, రష్‌లేన్ ప్రచురించిన కథనం ప్రకారం, విడిభాగాలు మరియు ఉపకరణాల (యాక్ససరీస్) కొరత కారణంగా మహీంద్రా తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇది మహీంద్రా థార్ ఎస్‌యూవీ ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తోంది.

MOST READ:ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

ఇటీవల ఓ డీలర్‌షిప్ కేంద్రంలో ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, మ్యూజిక్ సిస్టమ్ లేని అనేక మహీంద్రా థార్ వాహనాలు కనిపించాయి. దీన్నిబట్టి చూస్తుంటే, ఈ విడిభాగాల కొరత కారణంగా మహీంద్రా తమ థార్ వాహనాలను ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ లేకుండానే నేరుగా డీలర్‌షిప్‌లకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

ఈ ఉపకరణాల సరఫరా సాధారణ స్థితికి చేరుకోగానే, మహీంద్రా థార్ వాహనాల్లో ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, మ్యూజిక్ సిస్టమ్ డీలర్‌షిప్ స్థాయిలోనే రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఉపయోగించే సెమీకండక్టర్ల కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంది.

MOST READ:జాబ్ చేస్తూ.. జీవితాన్ని, అనుభవించు రాజా..

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

ఈ కారణం చేతనే ఫోర్డ్ కూడా తమ ఇండియా ప్లాంట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మహీంద్రా థార్ కూడా ఇదేరకమైన సమస్యను ఎదుర్కుంటున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీలో కారు మొత్తం పూర్తిగా తయారైనప్పటికీ, ఈ సెమీకండక్టర్స్ లేదా మైక్రోప్రాసెసర్ల కొరత వలన కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ అమర్చలేకపోతోంది.

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

అలాగని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ లేకుండా డీలర్లు కొత్త థార్‌ని కస్టమర్లకు విక్రయించలేరు. కాబట్టి, ఆ యూనిట్స్ వచ్చే వరకూ థార్ వాహనాలను తమ స్టాక్ యార్డులోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ చిత్రాల్లో చూసినట్లయితే, పక్కపక్కనే పార్క్ చేసిన అనేక కొత్త థార్ వాహనాలు దుమ్ముపట్టి ఉండటాన్ని గమనించవచ్చు.

MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

అంతేకాకుండా, వీటిలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకపోవడాన్ని కూడా మనం ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఈ కారణంగా, ఇప్పటికే తమ కొత్త థార్‌ను బుక్ చేసుకుని, సుదీర్ఘకాలంగా వేచి ఉన్న కస్టమర్లు మరికొంత కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీలోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్ రూపంలో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే యాప్స్‌ని సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీ యాప్ అయిన బ్లూసెన్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది మరియు ఇందులో బిల్ట్ ఇన్ జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

మహీంద్రా థార్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతం ఇది ఏక్స్ మరియు ఎల్‌ఎక్స్ అనే రెండు వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

షాకింగ్.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకుండా డీలర్ల వద్దకు వస్తున్న మహీంద్రా థార్!

అలాగే, ఇందులోని 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఏఎక్స్ వేరియంట్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. ఎల్ఎక్స్ వేరియంట్లలో ఆప్షనల్ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంటుంది.

Most Read Articles

English summary
Is Mahindra Shipping Thar SUVs To Dealerships Without Infotainment System? Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X