Just In
- 9 hrs ago
వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]
- 11 hrs ago
లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న మరో బాలీవుడ్ సెలబ్రెటీ.. ఎవరంటే?
- 11 hrs ago
యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు
- 13 hrs ago
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4
Don't Miss
- Lifestyle
గురువారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది...!
- Sports
KKR vs CSK: 4వికెట్లతో చహర్ దెబ్బకొట్టినా.. చెన్నైని వణికించిన రసెల్, కమిన్స్! ధోనీసేనకు తృటిలో తప్పిన ఓటమి!
- News
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు: ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం
- Finance
LIC సరికొత్త రికార్డ్, కరోనా సమయంలోను అత్యధిక కొత్త ప్రీమియం వసూళ్లు
- Movies
అల్లు అర్జున్ సినిమాలో యాంకర్ అనసూయ.. మరోసారి అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్‌షిప్ చేరుకున్న ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 6; వివరాలు
భారతదేశంలో వాహనతయారీదారులు కొత్త వాహనాలను ప్రవేశపెట్టడానికి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ వాహనాలను పలుమార్లు టెస్ట్ చేస్తుంటారు. గత కొన్ని నెలలుగా ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 6 నిరంతర టెస్టింగ్ లో ఉంది. ఈ కొత్త 6బిఎస్ ఇసుజు డి మాక్స్ వి-క్రాస్ ఇప్పుడు ఏప్రిల్‌లో భారతదేశంలో విడుదల కానుంది. అయితే అంతకు ముందు ఇది డీలర్‌షిప్‌లకు పంపిణీ చేయడం ప్రారంభించింది.

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 6 యొక్క రెండు మోడళ్లను డీలర్‌షిప్‌లో చూడవచ్చు. ఒకటి బ్లూ కలర్ లో ఇంకొకటి సిల్వర్ కలర్ లో ఉంది. సైడ్ స్టెప్స్, రూఫ్ రైల్స్ మరియు సింగిల్ టోన్ అల్లాయ్ వీల్స్ లేనందున సిల్వర్ కలర్ మోడల్ లో స్పెక్ వేరియంట్ అని తెలుస్తుంది. కానీ డిజైన్ లో పెద్ద మార్పులు చేయలేదు.

ఈ ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 6 మోడల్‌లో 1.9 లీటర్ డీజిల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. ఇది దాని బిఎస్ 4 అవతార్‌లో 150 బిహెచ్‌పి మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ అందించింది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చారు, ఇక్కడ ఈ గేర్‌బాక్స్ ఈ ఫోటోల ద్వారా ధృవీకరించబడింది.
MOST READ:ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

దీనిని 6-స్పీడ్ మాన్యువల్‌తో తీసుకువచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఉన్న 2.5-లీటర్ డీజిల్ ఇంజిన్ బహుశా బిఎస్ 6 అవతార్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది బిఎస్ 4 మోడల్ మాదిరిగానే కనిపించే క్యాబిన్ చిత్రాలను కూడా వెల్లడించింది.

ప్రస్తుత దీని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఎల్‌ఇడి లైటింగ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, ఆటోమేటిక్ ఎసి, పవర్ విండోస్ మరియు పవర్డ్ డ్రైవర్ సీట్ లభిస్తుంది.
MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 6లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి.

ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 4 మోడల్ దేశీయ మార్కెట్లో రూ.16.55 లక్షల నుంచి రూ. 20 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) మధ్య విక్రయించబడుతోంది. కానీ ప్రస్తుతం ఇది బిఎస్ 6 వెర్షన్ కావున దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఇసుజు యొక్క ఈ మోడల్ మార్కెట్లో ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.
MOST READ:సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!

ప్రస్తుతం ఇసుజు తన పికప్ ట్రక్ ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ ను తాత్కాలికంగా నిలిపివేసింది మరియు ఇప్పుడు చాలా మంది కస్టమర్లు దీనిని కొనడానికి వేచి ఉన్నారు. కావున త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త బిఎస్ 6 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ కి వినియోగదారుల నుంచి ఎటువంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.
Source: CarDekho