ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

జపనీస్ కార్ బ్రాండ్ ఇసుజు మోటార్స్ ఇటీవల తమ సరికొత్త 2021 మోడల్ ఎమ్‌యూ-ఎక్స్ (MU-X) ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన అనేక స్పెషల్ యాక్ససరీలను కూడా వెల్లడి చేసింది.

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

బిఎస్-6 కాలుష్య ప్రమాణాల నేపథ్యంలో, దాదాపు ఏడాదికి పైగా మార్కెట్‌కు దూరంగా ఉన్న ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీ, ఇప్పుడు మరింత క్లీన్ ఇంజన్‌తో పాటుగా లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. తాజాగా, ఇసుజు వెల్లడించిన ఈ అఫీషియల్ యాక్ససరీలతో ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ మరింత ప్రాక్టికల్ మరియు స్టైలిష్‌గా మార్చుకోవచ్చు.

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

ఈ కారుకి మరింత ప్రీమియం అప్పీల్‌ను ఇచ్చేందుకు కంపెనీ ప్రత్యేకంగా క్రోమ్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, రియర్ డోర్ మరియు డోర్ హ్యాండిల్స్ కోసం కంపెనీ ప్రత్యేకమైన క్రోమ్ గార్నిష్ యాక్ససరీలను విడుదల చేసింది.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

అంతేకాకుండా, డోర్ స్టెప్స్ దగ్గర గీతలు పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇల్యుమినేటెడ్ రాకర్ ప్లేట్, వెనుక వైపు బూట్ స్పేస్ కోసం ప్రత్యేకమైన పార్సిల్ ట్రే మరియు ఆర్గనైజర్ బాక్స్, ఇంజన్ హుడ్ ప్రొటెక్టర్, డోర్ వైజర్స్ మరియ మఫ్లర్ కట్టర్ (సైలెన్సర్ క్రోమ్ గార్నిష్)లను కూడా కంపెనీ అందిస్తోంది.

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

పైన పేర్కొన్న అన్ని పర్సనలైజేషన్ ఆప్షన్లు కూడా స్టైల్, వ్యాల్యు మరియు ప్రాక్టికాలిటీల మధ్య మంచి సమతుల్యతను అందిస్తాయి. కస్టమర్లు కావాలనుకుంటే వీటిని ఒక్కొక్కటిగా ఎంచుకోవచ్చు లేదా ఒక ప్యాకేజీగా కూడా ఎంచుకోవచ్చు. వీటి ధర మరియు లభ్యతకు సంబంధించిన అన్ని వివరాలను ఏదైనా అధీకృత ఇసుజు డీలర్ ద్వారా అందించబడతాయి.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

భారత మార్కెట్లో ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ బిఎస్6 ఎసే‌యూవీ ప్రారంభ ధర రూ.33.23 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 4X2 ఏటి మరియు 4X4 ఏటి అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటి టూవీల్ డ్రైవ్ వేరియంట్ కాగా, రెండవది ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.35.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

కొత్త 2021 ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ బిఎస్6 మోడల్‌లో అతిపెద్ద మార్పు, ఇందులో లేటెస్ట్ ఇంజన్. బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌నే బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

ఈ ఇంజన్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సైడ్-స్టెప్ ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, ఫ్రంట్ మరియు బ్యాక్ స్కఫ్ ప్లేట్‌లతో పాటు డ్యూయల్ టోన్ బంపర్‌లు మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

ఇసుజు ఎమ్‌యూ-ఎక్స్ ఎస్‌యూవీ కోసం ప్రత్యేకమైన యాక్ససరీస్

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎమ్ఐడి స్క్రీన్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇంకా ఇందులో ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu India Reveals List Of Accessories Specially Designed For The MU-X SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X