ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

ఇసుజు ఇండియా తమ కొత్త బిఎస్6 వెర్షన్ డి-మాక్స్ వి-క్రాస్ లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్కును ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ కోసం అధికారిక ఉపకరణాల (అఫీషియల్ యాక్ససరీస్)ను కూడా వెల్లడి చేసింది.

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

కొత్త 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్6 మోడల్ కోసం అందిస్తున్న అఫీషియల్ యాక్ససరీలను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. ఈ యాక్ససరీలు పికప్ ట్రక్కును మరింత అందంగా మరియు ఆచరణాత్మకంగా చేస్తాయి. అంతేకాకుండా, కస్టమర్లు తమకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకునేలా అనుమతిస్తాయి.

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

ఇసుజు డి-మ్యాక్స్ పికప్ ట్రక్కు వి-క్రాస్ మరియు హై-లాండర్ అనే రెండు రూపాల్లో లభిస్తుంది. ఈ రెండింటి కోసం కంపెనీ యాక్ససరీస్‌ను అందిస్తోంది. వీటిలో కార్పెట్ మ్యాట్స్, డోర్ వైజర్స్, సిల్ ప్లేట్స్ మరియు సీట్ కవర్లు మొదలైనవి ఉన్నాయి.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

అంతేకాకుండా, ఇందులో రైల్-ఓవర్-బెడ్ లైనర్, డి-బాక్స్ విత్ స్పాయిలర్, హార్డ్ లిడ్, స్పోర్ట్స్ బార్, కార్గో రైల్స్ క్రూ, కార్గో నెట్, కానోపీ మరియు కార్గో బైక్ క్యారియర్ వంటి ఇతర యాక్ససరీలను కూడా కంపెనీ అందిస్తోంది.

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

వీటికి అదనంగా, ఇసుజు వి-క్రాస్ కోసం క్రోమ్ ట్రిమ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇది మీ పికప్ ట్ర్కకుకు మరింత ప్రీమియం లుక్‌ని ఇవ్వడంలో సహాయపడుతుంది. అయితే, ఇతర సంస్థ మాదిరిగా ఇసుజు తమ పికప్ ట్రక్కుల కోసం యాక్ససరీ బండిల్ ప్యాకేజీలను అందించడం లేదు.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

మీ సమీపంలోని అధీకృత ఇసుజు డీలర్‌ను సంప్రదించడం ద్వారా ఈ యాక్ససరీలకు సంబంధించిన ధర మరియు లభ్యత మొదలైన వివరాల గురించి తెలుసుకోచ్చు. భారత మార్కెట్లో ఇసుజు వి-క్రాస్ బిఎస్6 పికప్ ధరలు రూ.19.98 లక్షల నుండి ప్రారంభం కాగా, హై-లాండర్ బిఎస్6 పికప్ ధరలు రూ.16.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి (రెండు ధరలు ఎక్స్-షోరూమ్).

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

కొత్త 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్‌లో బిఎస్-6 కంప్లైంట్ 1.9-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 161 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటుంది. అలాగే, ఇందలో ఆప్షనల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కూడా అందుబాటులో ఉంది.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

డి-మాక్స్‌ వి-క్రాస్‌లో బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, సైడ్ స్టెప్స్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

ఇంకా ఇందులో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పైకప్పుతో అమర్చిన స్పీకర్లతో పాటుగా మొత్తం 8 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగులు, హిల్ డీసెంట్ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ మొదలైన ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

వి-క్రాస్ పికప్‌ను ప్రీమియం లైఫ్‌స్టైల్ విభాగంలో ప్రవేశపెట్టగా, హై-ల్యాండర్ పికప్‌ను సరసమైన ధరకే ఇటు వాణిజ్య అటు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించే పికప్ ట్రక్కుగా ప్రవేశపెట్టారు.

ఇసుజు వి-క్రాస్, హై-ల్యాండర్ పికప్ ట్రక్కుల కోసం అఫీషియల్ యాక్ససరీస్

ఇసుజు హై-లాండర్ బిఎస్6 పికప్ ట్రక్కులో మాన్యువల్ ఏసి, రెండవ వరుసలో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్టులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఎమ్ఐడి స్క్రీన్ ఉంటుంది కానీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ మాత్రం ఇందులో ఉండదు.

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu India Reveals Official Accessories List For New 2021 V-Cross and Hi-Lander. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X