భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర, వివరాలు

భారత మార్కెట్లో ఇసుజు ఇండియా తన అప్‌డేట్ చేసిన డి-మాక్స్ వి-క్రాస్ బిఎస్ 6 మరియు కొత్త హై-లాండర్ బిఎస్ 6 పిక్-అప్ ట్రక్కులను ఎట్టకేలకు లాంచ్ చేసింది. అప్‌డేట్ చేసిన వి-క్రాస్ బిఎస్ 6 పిక్ అప్ ట్రక్ ధరలు 19.98 లక్షల రూపాయల నుండి ప్రారంభం కాగా, హై-లాండర్ బిఎస్ 6 పిక్-అప్ ట్రక్కు యొక్క ప్రారంభ ధర రూ .16.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

ఇసుజు ఇండియా యొక్క డి-మాక్స్ వి-క్రాస్‌ యొక్క అప్‌డేట్ వెర్షన్ మూడు వేరియంట్లలో అందించబడుతుంది. అవి Z 2WD AT, Z 4WD MT మరియు Z ప్రెస్టీజ్ 4WD AT వేరియంట్స్. మిడ్-స్పెక్ Z 4WD MT మరియు టాప్-స్పెక్ Z ప్రెస్టీజ్ 4WD AT ధరలు వరుసగా రూ. 20.98 లక్షలు మరియు రూ. 24.49 లక్షలు. కంపెనీ దేశవ్యాప్తంగా ఈ పిక్-అప్ మోడళ్ల కోసం బుకింగ్స్ ప్రారంభించింది.

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

ఇసుజు ఇండియా పిక్-అప్ ఎస్‌యూవీలో అతిపెద్ద అప్‌డేట్, బోనెట్ కింద ఉన్న కొత్త బిఎస్ 6 ఇంజన్లు. ఇందులో ఉన్న1.9-లీటర్ ఇంజన్ గరిష్టంగా 161 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్‌తో స్టాండర్డ్ గా జతచేయబడుతుంది. ఆప్సనల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ కూడా ఇందులో ఉంటుంది.

MOST READ:వావ్.. ఈ మోడిఫైడ్ టాటా సుమో, నిజంగా సూపర్ గురూ..!

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

హై-లాండర్ బిఎస్ 6 పిక్-అప్ ట్రక్కు లోడింగ్ బే కోసం క్లోజ్ క్యాబ్‌ కలిగి ఉండవచ్చు. ఇందులో ఉన్న హెడ్‌ల్యాంప్‌లు హాలోజన్ యూనిట్లు, ఇవి ఇరువైపులా ముదురు బూడిద రంగు గ్రిల్‌ను కలిగి ఉంటాయి. దీని డోర్ పై హై-లాండర్ బ్యాడ్జింగ్ ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

హై-లాండర్ బిఎస్ 6 ఎస్‌యూవీలో మాన్యువల్ ఎసి, రెండవ వరుసకు యుఎస్బి ఛార్జింగ్ పోర్టులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటివి కలిగి ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఎమ్ఐడి స్క్రీన్‌ను కలిగి ఉంది, కానీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉండదు.

MOST READ:మీరెప్పుడూ చూడని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ వీడియో.. ఇప్పుడు చూసెయ్యండి

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

ఇక వి-క్రాస్ డి-మాక్స్‌ విషయానికి వస్తే, ఇది మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, సైడ్ స్టెప్స్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, మరియు రియర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

వి-క్రాస్ యొక్క డిజైన్ దాదాపు దాని బిఎస్ 4 వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో పెద్దగా మార్పులు ఉండవు. అయితే దీని వెనుకవైపు ఫ్లాట్‌బెడ్‌తో డబుల్ క్యాబ్ లేఅవుట్‌గా కొనసాగుతోంది. ఇందులో ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టం చేర్చడం వల్ల మరింత అనుకూలంగా ఉంటుంది. కావున ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

కంపెనీ డి-మాక్స్ వి-క్రాస్ మరియు హై-లాండర్‌తో పాటు అప్‌డేట్ చేసిన ఎంయు-ఎక్స్ బిఎస్ 6 ఎస్‌యూవీని కూడా విడుదల చేసింది. ఎంయు-ఎక్స్ అనేది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ఇ. దీని ధర ఇప్పుడు రూ. 33.23 లక్షల వద్ద ప్రారంభమవుతుంది.

భారత్‌లో విడుదలైన 2021 ఇసుజు డి-మాక్స్ వి-క్రాస్ & హై-లాండర్ ; ధర & వివరాలు

ఇసుజు కంపెనీ ఎట్టకేలకు తన బిఎస్ 6 ప్యాసింజర్ వెహికల్స్ భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పిక్-అప్ ట్రక్ యొక్క కొత్త బేస్-స్పెక్ హై-లాండర్ మోడల్‌ను కంపెనీ అందిస్తోంది. ఇవి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వాహనదారుని చాలా అనుకూలంగా ఉంటాయి.

MOST READ:కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

Most Read Articles

Read more on: #ఇసుజు #isuzu
English summary
Isuzu Launched BS6 Complaint D-Max V-Cross And Hilander Models In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X