గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ఇటీవల తన కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ ప్రారంభించింది. జాగ్వార్ ఇండియా దీనిని పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ రేంజ్‌లో అగ్రస్థానంలో నిలిపింది.

గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

కొత్త జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు మునుపటికంటే చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ తో వస్తుంది. అంతే కాదు ఇది వేగంలో కూడా అప్డేట్ జరిగింది. దీనితోపాటు సరికొత్త కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

జాగ్వార్ ఇండియా ఈ కొత్త ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ ఎస్‌యూవీని మార్కెట్లో రూ. 69.99 లక్షల ఎక్స్‌షోరూమ్‌తో ప్రారంభించింది. జాగ్వార్ యొక్క కొత్త ఎఫ్-పేస్ ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో విడుదల చేయబడింది.

గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుంది. ఇందులో డైమండ్ మెష్ నమూనా, పునఃరూపకల్పన చేసిన బంపర్, కొత్త మజిల్ బోనెట్ నిర్మాణం, ఫ్రంట్ ఫెండర్ వెంట్స్‌పై ఎంబ్లమ్, షార్ప్ ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, కొత్త ఎల్-షేప్ ఎల్‌ఇడి లైటింగ్‌తో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ఉంటాయి.

గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్‌ విషయానికీ వస్తే, ఇక్కడ కూడా చాలా వరకు అప్డేట్ చేయబడిన ఇంటీరియర్స్ చూడవచ్చు. ఇందులో లెదర్ ట్రిమ్‌తో కొత్త డాష్‌బోర్డ్, కొత్త 11.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త పివి ప్రో టెక్నాలజీ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ లో బ్రాండ్ సిగ్నేచర్ తో కొత్త హెడ్‌రెస్ట్‌లు, కొత్త స్టీరింగ్ వీల్, కొత్త గేర్ సెలెక్టర్, హై స్టోరేజ్ స్పేస్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, క్యాబిన్ ఎయిర్ అయానైజర్ కూడా ఉన్నాయి. ఇది మొత్తానికి హూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

ఇదివరకు చెప్పినట్లుగానే కంపెనీ తన జాగ్వార్ ఎఫ్-పేస్ ఫేస్‌లిఫ్ట్ ను భారత మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలలో విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్న 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ 205 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది.

ఇక డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో లైట్ వెయిట్ హైబ్రిడ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 300 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది.

గుడ్ న్యూస్.. జాగ్వార్ ఎఫ్-పేస్ ఎస్‌విఆర్ బుకింగ్స్ స్టార్ట్

కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం, 2030 సంవత్సరం నుండి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపింది. ఎందుకంటే రానున్న కాలంలో ఎక్కువభాగం ఎలక్ట్రిక్ వాహనాలను బినియోగించే అవకాశం ఉంది, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Most Read Articles

English summary
2021 Jaguar F-Pace SVR Bookings Open In India. Read in Telugu.
Story first published: Tuesday, June 22, 2021, 12:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X