I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ అయిన Jaguar భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాలా లగ్జరీ వాహనాలను ప్రవేశపెట్టి అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అయితే ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ తన కొత్త Jaguar I-Pace Black ని త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

కంపెనీ ఈ కొత్త Jaguar I-Pace Black బుకింగ్స్ స్వీకరించడం ఇప్పుడు ప్రారంభించింది. కావున Jaguar I-Pace Black కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్ లో లేదా కంపెనీ వెబ్‌సైట్ లో బుక్ చేసుకోవచ్చు.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

ప్రపంచ మార్కెట్లో Jaguar యొక్క I-Pace ఎంతో ప్రజాదరణ పొందగలిగిందని, అంతే కాకుండా అత్యుత్తమ డిజైన్ కలిగి ఉన్న ఈ కొత్త ఎస్‌యూవీ అనేక అవార్డులను సైతం సొంతం చేసుకోగలిగింది కంపెనీ తెలిపింది. అదే సమయంలో కంపెనీ కొత్త I-Pace Black తీసుకురావడం చేత మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించడంతో పాటు, ఎక్కువమంది కొనుగగోలుదారులను ఆకర్షించగలుగుతుందని కంపెనీ భావిస్తోంది.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar I-Pace Black ఎడిషన్ మోడల్ అద్భుతమైన డిజైన్ కలియు ఉంటుంది. ఈ కొత్త I-Pace Black ముందు భాగంలో గ్రిల్, మిర్రర్ క్యాప్, విండోస్, టెయిల్ సెక్షన్ మరియు అల్లాయ్ వీల్స్‌లో కనిపించే డార్క్ గ్లోసీ ప్యాకేజీని పొందుతుంది. ఈ మోడల్‌లో బ్లాక్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా ఇవ్వబడింది.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

ఈ కొత్త Jaguar I-Pace Black డిజైన్ దాదాపు Jaguar I-Pace మాదిరిగానే ఉంటుంది. ఇందులో స్లొపింగ్ రూప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్, హాంకాంబ్ ప్యాటర్న్ గ్రిల్, ఓఆర్‌విఎమ్‌లపై టర్న్ లైట్ ఇండికేటర్స్, లార్జ్ ఎయిర్ ఇంటెక్ డ్యామ్ మరియు డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ ఈ కొత్త కారుని మరింత దూకుడుగా కనిపించేవిధంగా చేస్తాయి.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

భారతీయ మార్కెట్లో త్వరలో విడుదలకు సిద్దమవుతున్న కొత్త Jaguar I-Pace Black యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,682 మిమీ, వెడల్పు 2,011 మిమీ మరియు 1,566 మిమీ ఎత్తు ఉంటుంది. అదే విధంగా ఇది 174 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 2990 మిమీ వీల్ బేస్ పొందుతుంది.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar I-Pace Black ఈ కారు 8 వే అడ్జస్టబుల్ స్పోర్ట్స్ సీట్స్, 380 డబ్ల్యు మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 3 డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, యానిమేటెడ్ డైరెక్షనల్ ఇండికేటర్, హెడ్స్ సబ్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లను పొందుతుంది.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar I-Pace Black యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఈ కారులోని సీట్లు బ్లాక్ లెదర్ కవర్ ఇవ్వబడింది. కారు క్యాబిన్ మరియు డాష్‌బోర్డ్‌లో గ్లోస్ బ్లాక్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి. అంతే కాకుండా ఇది పనోరమిక్ గ్లాస్‌తో కారులో ప్రైవసీ గ్లాస్ కూడా ఇవ్వబడింది. ఏది ఏమైనా ఈ కొత్త కారు మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar I-Pace Black లోని బ్యాటరీ ప్యాక్ దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ కి సమానంగా ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 359 బిహెచ్‌పి పవర్ మరియు 696 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4-వీల్ డ్రైవ్ ఈ కారులో ప్రామాణికంగా అందించబడింది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై దాదాపు 480 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

Jaguar I-Pace Black లో 90 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తినిస్తుంది. ఈ బ్యాటరీని కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం మరియు సస్పెన్షన్ సిస్టం వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

I-Pace Black బుకింగ్స్ ప్రారంభించిన Jaguar: వివరాలు

కంపెనీ ఇప్పటికే విడుదల చేసిన జాగ్వార్ ఐ-పేస్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ ఎయిడ్, 360 డిగ్రీస్ 3 డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అంద్దుబాటులో ఉన్నాయి. కావున కొత్త I-Pace Black లో కూడా అధునాతన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Jaguar i pace black booking open in india expected launch soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X