పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ అందిస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఐ-పేస్' పూర్తి బ్యాటరీ చార్జ్‌పై యూకేలోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. జాగ్వార్ ఐ-పేస్ సింగిల్ చార్జ్‌పై బ్రిటన్‌లోని కుంబ్రియాలో ఉన్న గ్రేట్ డన్ ఫెల్ ప్రాంతాన్ని చేరుకుంది.

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

ఈ ప్రాంతాన్ని యూకే యొక్క ఎవరెస్ట్‌గా చెబుతారు. ఇది యూకేలో అత్యంత ఎత్తైన ప్రదేశం. ఈ రహదారి మొత్తం ఎత్తైన వంపులు, మెలికలు తిరిగిన తారు రోడ్లు మరియు ఘనీభవంచిన ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది. అలాంటి రోడ్డుపై జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు సునాయాసంగా అవంతరాలను దాటుకుంటూ పర్వత శిఖరానికి చేరుకుంది.

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

ఈ రికార్డు ఒలింపిక్ ప్రపంచ ఛాంపియన్ సైక్లిస్ట్ ఎలినోర్ బార్కర్ ఎమ్‌బిఇ సాధించారు. ఈ పర్వతాన్ని చేరుకోవడానికి సదరు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొత్తం 199.6 కిలోమీటర్లను కవర్ చేసింది. ఈ డ్రైవ్ ప్రారంభానికి ముందు స్టార్టింగ్ పాయింట్‌ను చేరుకోవాడనికి ఈ కార్ అదనంగా 12.9 కిలోమీటర్లు ప్రయాణించింది.

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ మొత్తం ట్రావెల్ రికార్డును సాధించిన తర్వాత కూడా, అందులోని బ్యాటరీ సామర్థ్యంలో 31 శాతం మిగిలి ఉంది. ఆశ్చర్యకరంగా, ఐ-పేస్, తన సవాలును పూర్తి చేసిన తరువాత, 31 శాతం బ్యాటరీ మిగిలి ఉంది. ఈ సందర్భంగా, జాగ్వార్ ఐ-పేస్ యొక్క శక్తి సామర్థ్యాలను ఎలినోర్ బార్కర్ మరియు ప్రశసించారు.

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

మనదేశంలో కూడా జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశీయ మార్కెట్లో జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎస్, ఎస్‌ఈ, హెచ్‌ఎస్‌ఈ అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. వీటి ధరలు రూ.1.05 కోట్ల నుండి రూ.1.12 కోట్ల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

ఈ మూడు వేరియంట్లు కూడా ఒకే రకమైన పవర్‌ట్రైన్ ఆప్షన్ (ఈవి400)తో లభ్యం కానున్నాయి. ఈ కారులో స్లైడింగ్ రూఫ్, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి టెయిల్ లైట్స్, హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, సైడ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

ఇక ఈ కారు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులోని రెండు యాక్సిల్స్‌లో (ఫ్రంట్ అండ్ రియర్) ఒక్కొక్కటి చొప్పున మొత్తం రెండు సింక్రోనస్ పర్మినెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి మొత్తంగా 395 బిహెచ్‌పిల శక్తిని మరియు 696 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది (ఆల్-వీల్ డ్రైవ్).

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. పూర్తి చార్జ్‌పై ఇది 480 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ (మైలేజ్)ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

పూర్తి చార్జ్‌తో బ్రిటన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని చేరుకున్న జాగ్వార్ ఐ-పేస్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. జాగ్వార్ ఐ-పేస్ భారత మార్కెట్లోని లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఉంచబడినది. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి మరియు త్వరలో భారత మార్కెట్లోకి రాబోతున్న ఆడి ఇ-ట్రోన్, వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ మరియు టెస్లా మోడల్ 3 వంటి హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ఉంటుంది.

Most Read Articles

English summary
Jaguar I-Pace EV Climbs Highest Surfaced Road In UK On A Single Charge, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X