టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ కంపెనీ తన పాపులర్ కంపాస్ ఎస్‌యూవీ యొక్క ఏడు సీట్ల వెర్షన్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి కొంతకాలంగా కృషి చేస్తోంది. కొత్త జీప్ కంపాస్ 7-సీటర్స్ 2021 లో ఎప్పుడైనా అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. ఇది దాని స్టాండర్డ్ 5 సీట్స్ ఎస్‌యూవీ కంటే చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

జీప్ ఇండియా త్వరలో 7 సీట్ల కంపాస్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి తగిన చేస్తోంది. టీమ్‌బిహెచ్‌పి యొక్క తాజా నివేదిక ప్రకారం, ఇటీవల ఈ ఎస్‌యూవీని కంపెనీ చకన్, పూణే ప్లాంట్ ప్రాంతంలో టెస్ట్ చేసేటప్పుడు గుర్తించబడింది. జీప్ కంపాస్ 7-సీట్ల పరీక్ష మోడల్ ప్రామాణిక మోడల్ కంటే పెద్దదిగా ఉంది.

టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

జీప్ కంపాస్ 7-సీటర్ దాని స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే చాలా కాస్మెటిక్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ మోడల్‌కు మూడు వరుసలలో సీట్లు ఇవ్వబడతాయి, ముందు రెండు సీట్లు, మధ్యలో మూడు సీట్లు మరియు వెనుక భాగంలో 2 సీట్లు ఉంటాయి.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

జీప్ కంపాస్ 7-సీటర్ దాని మునుపటి మోడల్ కంటే పొడవుగా ఉండటం మనం ఈ ఫోటోలలో గమనించవచ్చు. దీన్ని బట్టి చూస్తే వెనుక సీటు కోసం దాని పరిమాణం పెంచబడింది. కొత్త జీప్ కంపాస్‌కు కొత్త ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్, కొత్త బంపర్లు మరియు కొత్త ఫాగ్ లాంప్స్ ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

కొత్త జీప్ కంపాస్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లోపల టాబ్లెట్ ఆకారంలో ఇవ్వబడుతుంది, దీనికి ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మద్దతు ఇస్తాయి. ఇది కాకుండా, క్యాబిన్లో ఎక్కువ ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించవచ్చు. ఇందులో అప్డేట్ చేసిన సెంటర్ కన్సోల్ మరియు స్టీరింగ్ వీల్‌ కూడా పొందవచ్చు.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, కంపాస్ 7-సీటర్ 2.0-లీటర్ మల్టీ-జెట్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ లభించే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

జీప్ కంపాస్ 7-సీటర్ ఐదు సీట్ల కంపాస్ మోడల్ మాదిరిగానే మోనోకోక్ ప్లాట్‌ఫాంపై ఉత్పత్తి చేయబడుతుంది. లోపలికి ఎక్కువ స్పేస్ ఇవ్వడానికి వీల్‌బేస్ పెద్దదిగా ఉంచబడుతుంది. ఈ కారణంగా, రెండవ వరుసలో ఎక్కువ స్థలం ఇవ్వబడుతుంది.

MOST READ:మీకు తెలుసా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లో కనిపించే క్లాసిక్ కార్లు, ఇవే

టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?

జీప్ కంపాస్ 7 సీట్ల ఎస్‌యూవీ భారతదేశంలోని బ్రాండ్ యొక్క తదుపరి ఉత్పత్తి అవుతుంది. ఈ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో ఒకసారి ఇక్కడ లాంచ్ అయిన తర్వాత స్కోడా కోడియాక్, ఫోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్ స్పేస్, టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

Source: Team BHP

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Upcoming Jeep Seven-Seater Spied Testing Once Again Ahead Of Launch. Read in Telugu.
Story first published: Saturday, April 17, 2021, 14:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X