కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త 2021 కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. ఈ కొత్త జీప్ కంపాస్ మోడల్ కేవలం 5-సీటర్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

అయితే, ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, జీప్ ఇండియా ఈ మోడల్‌లో ఇప్పుడు ఓ 7-సీటర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ 7-సీటర్ వెర్షన్ జీప్ కంపాస్ ఎస్‌యూవీని కంపెనీ గత కొంత కాలంగా భారత రోడ్లపై పరీక్షిస్తోంది. మరికొద్ది నెలల్లోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌జి హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ మోడళ్ల మాదిరిగానే జీప్ కంపాస్ స్టాండర్డ్ మరియు ఎక్స్‌టెండెడ్ వెర్షన్లు కూడా ఉండనున్నాయి. వీటి ఓవరాల్ డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ ఆప్షన్లు కూడా ఒకేలా ఉంటాయని సమాచారం.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగానే, కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కూడా పెద్ద వాహనాలను సిద్ధం చేస్తున్నాయి.

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కొత్తగా వచ్చిన 2021 జీప్ కంపాస్ 5-సీటర్ వెర్షన్, ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్, టాటా హారియర్ మరియు మహీంద్రా ఎక్స్‌‌యూవీ500 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. అలాగే, కొత్తగా రాబోతున్న 7-సీటర్ వెర్షన్ జీప్ కంపాస్ మోడల్ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

ఈ సెవన్ సీటర్ ఎస్‌యూవీని లో డి 3-రో అనే కోడ్‌నేమ్‌తో తయారు చేయనున్నారు. దీనిని 'గ్రాండ్ కంపాస్' అనే పేరుతో విడుదల చేయవచ్చని సమాచారం. ఈ కొత్త సెవన్ సీటర్ జీప్ కంపాస్‌ను ఇటీవలే విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ 2021 కంపాస్ ఆధారంగా తయారు చేయనున్నారు. ఇది 2021 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో విడుదల కాచ్చని భావిస్తున్నారు.

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

జీప్ గ్రాండ్ కంపాస్ ఎస్‌యూవీలో 7-సీట్ల కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇందులో మధ్య వరుసలో 60:40 స్ప్లిట్ సీటుతో కూడిన బెంచ్ సీటు మరియు వెనుక వరుసలో రెండు సీట్లు ఉంటాయని సమాచారం. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో ఇండివిడ్యువల్ రిక్లైనింగ్‌తో కూడిన కెప్టెన్ సీట్లను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

కొత్త జీప్ కంపాస్ మాదిరిగానే ఈ 7-సీటర్ వెర్షన్ కూడా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభించవచ్చని సమాచారం. ఇందులో మొదటిది 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ 161 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులో రెండవ ఇంజన్ ఆప్షన్ 2.0-లీటర్ బిఎస్ 6 డీజిల్ ఇంజన్. ఇది గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

కొత్త 2021 జీప్ కంపాస్ వచ్చేసింది, ఇక 7-సీటర్ వెర్షన్ రావడమే బాకీ!

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఆఫర్ చేసిన అన్ని సేఫ్టీ మరియు డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను ఈ 7-సీటర్‌లోనూ ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్‌సి, హిల్ డీసెంట్ కంట్రోల్, పానిక్ బ్రేక్ అసిస్ట్, రెడీ అలర్ట్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ అండ్ బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, రైన్ బ్రేక్ సపోర్ట్, సెలెక్ట్ టెర్రైన్ 4x4 సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు మొదలైనవి ఉన్నాయి.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep Compass 7-Seater SUV Is Expected To Be Launched In Mid 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X