భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

ప్రస్తుత పండుగ సీజన్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ కంపెనీలు డిస్కౌంట్లను అందిస్తుంటే, అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ (Jeep) మాత్రం తమ కార్ల ధరలను భారీగా పెంచుతోంది. ఈ కంపెనీ నుండి లభిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ జీప్ కంపాస్ (Jeep Compass) ధరను కంపెనీ రూ. 20,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

జీప్ ఈ ఏడాది జనవరి నెలలో తమ సరికొత్త 2021 Compass ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని 4 ట్రిమ్స్ మరియు 11 వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఈ 4 ట్రిమ్స్ లో స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్ మరియు మోడల్ 'ఎస్' లు ఉన్నాయి. వీటితో పాటుగా 80వ వార్షికోత్సవ ఎడిషన్ ను కూడా అందిస్తోంది. ఇది పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

కాగా, ఈ ధరల పెరుగుదల అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. అయితే, కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఇది మారుతూ ఉంటుంది. జీప్ కంపాస్ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులోని స్పోర్ట్ మరియు లాంగిట్యూడ్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 10,000 పెరగగా, ఇతర వేరియంట్ల ధరలు రూ. 20,000 మేర పెరిగాయి.

భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

తాజా ధరల పెరుగుదల తర్వాత, భారత మార్కెట్లో జీప్ కంపాస్ ప్రారంభ ధర రూ. 17.29 లక్షలకు (స్పోర్ట్ వేరియంట్) చేరుకుంది. ఇకపోతే, ఇతర వేరియంట్ల ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి:

  • లాంగిట్యూడ్ రూ. 20.79 లక్షలు
  • లిమిటెడ్ రూ. 22.89 లక్షలు
  • లిమిటెడ్ 80వ వార్షికోత్సవ ఎడిషన్ రూ. 23.36 లక్షలు
  • మోడల్ ఎస్ రూ. 25.04 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

    భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

    కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో మొదటిది 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 161 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను చేస్తుంది. ఇకపోతే, రెండవది 2.0 లీటర్ బిఎస్6 డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

    గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో 7 స్పీడ్ డిసిటి, 6 స్పీడ్ ఆటోమేటిక్ మరియు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్లో కొత్త 2021 కంపాస్ ను టెక్నో మెటాలిక్ గ్రీన్, గెలాక్సీ బ్లూ మరియు బ్రైట్ వైట్ అనే కొత్త మూడు కలర్ ఆప్షన్లతో ప్రవేశపెట్టారు. ఇవేకాకుండా, ఇది మినిమల్ గ్రే, బ్రిలియంట్ బ్లాక్, ఎగ్జోటికా రెడ్ మరియు గ్రిగో మెగ్నీషియో గ్రే అనే నాలుగు ఇతర రంగులలో కూడా లభిస్తుంది.

    భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

    ఈ 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కొత్త మోడల్ లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన కొత్త హెడ్‌లైట్ యూనిట్, హనీకోంబ్ ఇన్సర్ట్‌తో అప్‌డేట్ చేయబడిన జీప్ సిగ్నేచర్ 7 స్లాట్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్‌తో పాటుగా పెద్ద ఎయిర్ డ్యామ్‌ను ముందు వైపు గమనించవచ్చు. ఇందులోని అల్లాయ్ వీల్స్ డిజైన్ ను కూడా అప్‌డేట్ చేశారు.

    భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

    ఇక, కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లను గమనిస్తే, కంపెనీ ఈ కారులో డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ని రీడిజైన్ చేసింది. ఈ కారులో పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఏసి వెంట్‌లు మరియు ఏసి కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ Uconnect 5 టెక్నాలజీ ఇవ్వబడింది. ఇది కాకుండా, అమెజాన్ అలెక్సా సపోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మరియు ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లను కూడా ఈ కారు సపోర్ట్ చేస్తుంది.

    భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

    ఇంకా ఇందులో 9 స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 8-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, లెదర్ అప్‌హోలెస్ట్రీ మరియు వంటి మరెన్నో ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

    భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

    సేఫ్టీ పరంగా చూస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్‌సి హిల్ డీసెంట్ కంట్రోల్, పానిక్ బ్రేక్ అసిస్ట్, రెడీ అలర్ట్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు బ్రేక్ లాక్ డిఫరెన్షియల్, రెయిన్ బ్రేక్ సపోర్ట్, టెర్రైన్ 4x4 సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మొదలైన అనేక ఫీచర్లు లభిస్తాయి.

    భారీగా పెరిగిన Jeep Compass ధర: పండుగ సీజన్‌లో కస్టమర్లకు షాక్..!

    కొత్త 2021 జీప్ కంపాస్ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో ఎమ్‌జి హెక్టర్, హ్యుందాయ టక్సన్, మహీంద్రా ఎక్స్‌యూవీ700, టాటా హారియర్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep compass price increased upto rs 20000 new price list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X