Just In
- 45 min ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 1 hr ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
- 1 hr ago
చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
- 2 hrs ago
మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు
Don't Miss
- Movies
Vakeelsaab 10 days collections:సెకండ్ వీకెండ్లో ఊహించని కలెక్షన్స్..వాళ్లకు ప్రత్యేక షోలు..ఇంకా ఎంత రావాలంటే?
- Sports
'తొలి టెస్టు అనంతరం జట్టులో చోటు దక్కక పోవడం బాధించింది.. నా టెక్నిక్ గురించి కలత చెందా'
- News
కరోనా ఎఫెక్ట్ ... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా
- Lifestyle
ఇలా చేస్తే బలహీనమైన జుట్టు సహజంగా బలపడుతుంది..కొత్త జుట్టు వస్తుంది..
- Finance
పెద్ద బ్యాంకుల కంటే బెట్టర్! సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు ఇలా
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జీప్ కంపాస్ కొనాలనుకునే వారికి సువర్ణావకాశం.. త్వరపడండి.. ఈ అఫర్ పరిమిత కాలం మాత్రమే
జీప్ ఇండియా కంపెనీ తన బిఎస్ 6 కంపాస్ ఎస్‌యూవీ కొనుగోలుపై ఈ కొత్త సంవత్సరంలో భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు జీప్ కంపాస్ ఎస్‌యూవీపై ఇప్పుడు దాదాపు 1.50 లక్షల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

జీప్ కంపాస్ ఎస్‌యూవీపై నగదు తగ్గింపు మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన ఇఎంఐ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న కంపాస్ స్టాక్‌ను ఖాళీ చేయడానికి ఈ భారీ ఆఫర్ అందిస్తున్నారు, అంతే కాకుండా జీప్ కంపెనీ త్వరలో తన కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

జీప్ కంపాస్ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ కేవలం ఈ నెల చివర వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో జీప్ కంపాస్ స్పోర్ట్ ప్లస్, లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ ప్లస్, నైట్ ఈగిల్ మరియు హార్డ్కోర్ ట్రైల్హాక్ అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది.
MOST READ:22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

ఎఫ్‌సిఎ ఇండియా జీప్ బ్రాండ్‌ను భారతీయ మార్కెట్లో 2016 లో విడుదల చేసింది. జీప్ బ్రాండ్ ప్రారంభంలో రాంగ్లర్ మరియు గ్రాండ్ చెరోకీ మోడళ్లను మాత్రమే భారతదేశంలో విడుదల చేసింది. జీప్ రాంగ్లర్ మరియు గ్రాండ్ చెరోకీ ప్రీమియం ఎస్‌యూవీలు భారత మార్కెట్లో వినియోగదారులను ఆకర్శించడంలో అంత సఫలం కాలేదు.

ఆ తరుణంలో జీప్ కంపెనీ జూలై 2017 లో జీప్ కంపాస్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. జీప్ కంపాస్ ఎస్‌యూవీ భారతీయ వినియోగదారులను ఆకర్షించగలిగింది, అంతే కాకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగింది.
MOST READ:లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

కానీ ఇటీవల దేశీయ మార్కెట్లో జీప్ కంపాస్ ఎస్‌యూవీ అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జీప్ కంపాస్ యొక్క పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ టర్బో ఇంజన్ ఉంది. ఈ పెట్రోల్ ఇంజన్ 161 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

జీప్ కంపాస్ లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ప్లస్ వేరియంట్లో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 173 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ డెలివరీ చేసుకున్న ఎలోన్ మస్క్ ; వివరాలు

ఈ డీజిల్ ఇంజిన్ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. అది మాత్రమే కాకుండా, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ప్రామాణికంగా అందించబడుతుంది. కొత్త ఇంజిన్ ఎంపిక మినహా జీప్ కంపాస్ యొక్క లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ప్లస్ వేరియంట్లు రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి.

బిఎస్ 6 జీప్ కంపాస్ మోడల్ భారత మార్కెట్లో కియా సెల్టోస్, ఎంజి హెక్టర్, టాటా హారియర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఎస్‌యూవీ వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది. మార్కెట్లో రానురాను జీప్ కంపెనీ అమ్మకాలు పడిపోతుండటంతో అమ్మకాలను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో కొత్త మోడల్ ప్రవేశపెట్టడానికి సిద్దమవుతుంది.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలో కొత్త అప్‌డేట్స్‌తో కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీ భారత మార్కెట్లో మంచి అమ్మకాలు చేపడుతుందని భావిస్తున్నారు.