కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ (Jeep) ఈ ఏడాది జనవరి నెలలో తమ సరికొత్త 2021 Jeep Compass ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కంపెనీ ఈ కొత్త మోడల్ ను 4 ట్రిమ్స్ మరియు 11 వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఈ 4 ట్రిమ్స్ లో స్పోర్ట్, లాంగిట్యూడ్, లిమిటెడ్ మరియు మోడల్ 'ఎస్' లు ఉన్నాయి.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

రిఫ్రెష్డ్ డిజైన్, రివైజ్డ్ స్టైల్ మరియు అదనపు ఫీచర్లతో కంపెనీ కొత్త Compass ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశీయ విపణిలో కొత్త 2021 Jeep Compass ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 17.19 లక్షల నుండి రూ. 28.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

సరే ఇదంతా అటుంచితే, Jeep India అందిస్తున్న ఈ కొత్త 2021 Compass ఫేస్‌లిఫ్ట్ లోని మోడల్ ఎస్ (ఓ2) వేరియంట్ ను కంపెనీ సైలెంట్ గా అప్‌గ్రేడ్ చేసినట్లు సమాచారం. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ ఎస్ వేరియంట్ ను కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్ ఫీచర్ ను జోడించినట్లు టీఎమ్ బిహెచ్‌పి పేర్కొంది.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

కొత్త 2021 Jeep Compass Model S (O2) వేరియంట్ లో 5 వ తరం ఆర్1 హై 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్ ను జోడించారు. ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటు ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌ను కూడా కలిగి ఉంది.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

అంతేకాకుండా, ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రేడియో, మీడియా, ఫోన్, టెంపరేచర్ కంట్రోల్ మరియు నావిగేషన్ యొక్క హ్యాండ్స్-ఫ్రీ ఆపరేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ వాయిస్ కమాండ్‌లను కూడా కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్ లో 6 GB RAM మరియు 40 K MIPS చిప్‌సెట్ ఉంటుంది, ఇది పాత సిస్టమ్ కంటే చాలా వేగంగా పనిచేస్తుందని సమాచారం.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

ఈ వేరియంట్ లో మరొక అప్‌గ్రేడ్ గా వెంటిలేటెడ్ డ్రైవర్ సీటును అందిస్తున్నారు. ఇది ఇంజన్ ను ఆన్ చేయగానే, కారు లోపల ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ రెండు మార్పుల మినహా కొత్త 2021 Jeep Compass Model S (O2) వేరియంట్ లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

జీప్ కంపాస్ మోడల్ ఎస్ (ఓ2) వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్ ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 2-వీల్ డ్రైవ్ లేదా 4-వీల్ డ్రైవ్ తో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి ఉంటుంది.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

ఇక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, మోడల్ ఎస్ (ఓ2) వేరియంట్ లో 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 156 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 Nm ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

ఈ వేరియంట్ లో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటోమేటిక్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ వైపర్లు, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

అంతేకాకుండా, ఇందులో 9 స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 8-వే అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, లెదర్ అప్‌హోలెస్ట్రీ మరియు వంటి మరెన్నో ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

తాజా అప్‌డేట్స్ అనంతరం కొత్త 2021 Jeep Compass Model S (O2) వేరియంట్ ధరలు ఇలా ఉన్నాయి:

Jeep Compass Model S (O2) 2.0D MT - రూ. 24.84 లక్షలు

Jeep Compass Model S (O2) 2.0D MT 4x4 - రూ. 28.64 లక్షలు

Jeep Compass Model S (O2) 1.4Mair DDCT - రూ. 25.64 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

కొత్త Compass Model S (O2) వేరియంట్‌ని సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన Jeep!

కొత్త 2021 Jeep Compass భారతదేశంలో ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో MG Hector, Hyundai Tucson, Mahindra XV500, Tata Harrier మరియు Volkswagen T-Roc వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Source: Team BHP

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep india silently updates compass s variant with new features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X