భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్ (Jeep) భారత మార్కెట్లో విక్రయించిన లగ్జరీ ఎస్‌యూలీ వ్రాంగ్లర్ (Wrangler) ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎస్‌యూవీలో ఇంధన లీకేజీలు మరియు అగ్ని ప్రమాదం వంటి సమస్యల కారణంగా మొత్తం 49 యూనిట్లు జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

రీకాల్ చేయబడిన జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీలు అన్నీ కూడా జనవరి 24, 2020 నుండి మార్చి 17, 2020 మధ్యలో తయారు చేయబడినవి అని కంపెనీ తెలిపింది. ఈ 49 యూనిట్ల జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీలను కంపెనీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్ లో పూర్తిగా విదేశాల్లో తయారైన వాటిని భారతదేశానికి దిగుమతి చేసుకుంది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

జీప్ వ్రాంగ్లర్ ఇంధన సరఫరా లైన్ కనెక్టర్‌లో లోపం ఉండవచ్చని, ఈ లోపం కారణంగా ఎస్‌యూవీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకూ ఈ సమస్య గురించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, రెగ్యులర్ క్వాలిటీ చెక్ లో భాగంగా తామే ఈ సమస్యను గుర్తించామని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

రీకాల్ కు వర్తించే జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీలను కంపెనీ ఉచితంగా తనిఖీ చేసి, అవసరమైతే లోప పూరితమైన భాగాలను ఉచితంగా భర్తీ చేయనుంది. జీప్ ఇటీవలే భారతదేశంలో అసెంబుల్ చేసిన జీప్ వ్రాంగ్లర్ ఎస్‌యూవీని రూ. 53.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఇంతకుముందు కంపెనీ ఈ ఎస్‌యూవీని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మోడ్‌లో మాత్రమే విక్రయించేంది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

కాగా, ఇప్పుడు కంపెనీ ఈ మోడల్ ను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్‌లో విడిభాగాలను భారతదేశానికి దిగుమతి చేసుకొని, ఇక్కడే స్థానికంగా అసెంబుల్ చేస్తోంది. జీప్ వ్రాంగ్లర్ ను ఇలా భారతదేశంలోనే స్థానికంగా అసెంబుల్ చేయడం వలన దాని ధర కూడా భారీగా తగ్గింది. ఈ రీకాల్ వర్తించే వాహనాలను కంపెనీ విదేశాల నుండి దిగుమతి చేసుకుంది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

కాగా, భారతదేశంలో అసెంబుల్ చేయబడిన జీప్ వ్రాంగ్లర్ వాహనాలు మాత్రం ఈ రీకాల్ వలన ప్రభావితం కావు. ఈ రీకాల్ కు సంబంధించి జీప్ ఇండియా తమ కస్టమర్లను సంప్రదిస్తోంది. ఈ వాహనాలను కొనుగోలు చేసిన యజమానులకు కంపెనీ ఇప్పటికే సమాచారం అందించింది. రీకాల్ కు వర్తించే వ్రాంగ్లర్‌ లను సమీప జీప్ డీలర్‌షిప్‌ లో చెక్ చేస్తామని కంపెనీ తెలిపింది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

దేశవ్యాప్తంగా జీప్ ఇండియాకు ఉన్న 26 డీలర్‌షిప్‌ లను సందర్శించడం ద్వారా కస్టమర్‌ లు తమ వాహనాన్ని తనిఖీ చేయించుకోవచ్చు. ప్రస్తుతం జీప్ డీలర్‌షిప్‌ లు దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. కస్టమర్లు ఈ షోరూమ్ లకు వెళ్లడం ద్వారా, తమ వాహనాని పూర్తి ఉచితంగా పరీక్ష చేయించుకోవచ్చు. దీని కోసం కస్టమర్లి ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రీకాల్ కు సంబంధించి ఏదైనా లోపాన్ని గుర్తించినట్లయితే, కంపెనీ డీలర్‌షిప్‌ లు దానిని ఉచితంగా పరిష్కరిస్తాయి.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

జీప్ వ్రాంగ్లర్ విషయానికి వస్తే, ఇదొక ఐకానిక్ కారు. పాత కాలపు జీప్ లను ప్రతిభించే డిజైన్, స్టైలిష్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ సెలన్ స్లాట్ గ్రిల్, డ్రాప్ డౌన్ విండ్‌షీల్డ్, తొలగించగల తలుపులు మరియు రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే, ఇంటీరియర్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్, స్టీరియో సిస్టమ్, వాషబుల్ ఇంటీరియర్ మొదలైన వాటిని అందిస్తోంది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

జీప్ వ్రాంగ్లర్ సాధారణంగానే మంచి ఆఫ్-రోడ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, ఇందులో అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ మరియు వాటర్ వేడింగ్ సామర్ధ్యం మరియు అన్ని రకాల ఉపరితలాలపై నడవగల సత్తా ఉంటుంది. ఈ కారులో శక్తివంతమైన 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 268 బిహెచ్‌పి పవర్ ను మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

ఇందులో 2H నుండి 4L, 4H ఆటో మరియు పార్ట్ టైమ్ 4L కి మారడానికి సహాయపడే మెకానికల్ షిఫ్టర్‌ కూడా ఉంటుంది. జీప్ వ్రాంగ్లర్ 217 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 760 మిమీ వాటర్ వేడింగ్ సామర్థ్యం, ​​36 డిగ్రీ అప్రోచ్, 31 డిగ్రీ డిపార్చర్ మరియు 21 డిగ్రీ బ్రేక్ ఓవర్ యాంగిల్ ను కలిగి ఉంటుంది. దీనితో పాటు, ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ 120 రకాల యాక్సెసరీస్ ఆప్షన్ ను కూడా అందిస్తోంది. దీని సాయంతో కస్టమర్లు తమ వ్రాంగ్లర్ ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

భారతదేశంలో విక్రయించిన Jeep Wrangler ఎస్‌యూవీలో ఫైర్ రిస్క్; రీకాల్!

వీటితో పాటుగా, కంపెనీ తమ కస్టమర్ల కోసం వివిధ రకాల యాక్ససరీ ప్యాకేజ్ లను కూడా అందిస్తోంది. వీటిలో ఎక్స్‌ప్లోరర్ ప్యాక్, నైట్ అల్ట్రా విజన్ ప్యాక్, స్పోర్ట్స్ ప్యాక్, ఎసెన్షియల్ ప్యాక్ ఉన్నాయి. జీప్ ఇండియా ఈ ఎస్‌యూవీపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీ వారంటీని అందిస్తోంది. కంపెనీ ఇటీవలే జీప్ వ్రాంగ్లర్ యొక్క 80 వ వార్షికోత్సవం 'లాంచ్ ఎడిషన్' కూడా పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంచింది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep wrangler recalled in india due to fire risk details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X