వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ అయిన 'కియా మోటార్స్' (Kia Motors) భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీగా అవతరించింది. ఈ కంపెనీ కియా కార్నివాల్, కియా సెల్టోస్, కియా సొనెట్ మొదలైన మోడల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేసి శరవేంగంగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే కియా కంపెనీ ఇప్పుడు ఒక కొత్త మోడల్ ని భారతీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్దమౌతోంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

కియా ఇండియా తన కొత్త 'కియా కారెన్స్' (Kia Carens) ఎమ్‌పివిని దేశీయ మార్కెట్ కోసం పరిచయం చేసింది. ఇది 6 మరియు 7 సీట్ల ఎమ్‌పివి. అంతే కాకుండా భారతీయ మార్కెట్లో కియా మోటార్స్ యొక్క నాల్గవ మోడల్ కూడా. ఈ కొత్త ఎమ్‌పివి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది త్వరలో భారతీయ మార్కెట్లో విడుదలవుతుంది.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

కియా కారెన్స్ డిజైన్:

కియా కారెన్స్ అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్‌ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

కియా కారెన్స్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఈ కొత్త MPV మూడు ఎక్స్టీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి బ్లూ, సిల్వర్ కలర్ మరియు బ్రౌన్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

కియా కారెన్స్ ఇంటీరియర్:

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దాని దిగువ వేరియంట్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

ఇందులోని స్టీరింగ్ వీల్ కంపెనీ యొక్క సెల్టోస్ మాదిరిగా ఉంటుంది. ఈ స్టీరింగ్ కి ఇరువైపులా అనేక కంట్రోల్ బటన్లు ఇవ్వబడ్డాయి. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త కియా కారెన్స్ 6 మరియు 7 సీట్ల ఎంపికలలో తీసుకురాబడింది. కావున ఇందులో మల్టిపుల్ AC వెంట్స్, కప్ హోల్డర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, మల్టిపుల్ USB పోర్ట్‌లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, లెదర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు పొందుతుంది. కంపెనీ యొక్క అత్యధిక వీల్ బేస్ కలిగిన మోడల్ ఇదేనని కంపెనీ పేర్కొంది.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

ఇక కొత్త కియా కారెన్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది దేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్ వంటివి ఇవ్వబడ్డాయి.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

కియా కారెన్స్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్:

కొత్త కియా కారెన్స్ పెట్రోల్ మరియు డీజిల్ రెండింటితో సహా మల్టిపుల్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఎంపికలలో అందించబడుతుంది. దీనితో పాటు, ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్ వంటి అనేక డ్రైవ్ మోడ్‌లు ఇవ్వబడతాయి. మ్యాన్యువల్, ఆటోమేటిక్, డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఇందులో అందించే అవకాశం ఉంటుంది.

వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. టయోటాకి బ్యాడ్ న్యూస్: Kia నుంచి కొత్త కార్ వచ్చేస్తుంది

కొత్త కియా కారెన్స్ MPV దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 6/7 సీట్ల MPV విభాగంలో ప్రవేశిస్తుంది. ఈ విభాగానికి దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. కావున కియా యొక్క కొత్త కార్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశించవచ్చు. ఈ కొత్త MPV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Kia carens unveiled design features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X