Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

ఇటీవల కాలంలో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అయిన కియా మోటార్స్ (Kia Motors) దేశీయ మార్కెట్లో తన కొత్త కియా కారెన్స్ (Kia Carens) MPV ని ఆవిష్కరించింది. ఇది కంపెనీ యొక్క నాల్గవ మోడల్. దేశీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఆల్కజార్ ఈ కొత్త కియా కారుకి భిన్నంగా ఉన్నప్పటికి ఇవి రెండూ కూడా ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఉన్నాయి, కావున ఇవి రెండూ కూడా కొంతవరకు సారూప్యతను కలిగి ఉంటాయి.

కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఆల్కజార్ కి ప్రత్యర్థిగా ఉంటుంది, కావున కియా కారెన్స్ మరియు హ్యుందాయ్ ఆల్కజార్ మధ్య సారూప్యతలు గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

కియా కారెన్స్ ఫీచర్స్:

కియా మోటార్స్ యొక్క కియా కారెన్స్ అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. అయితే లో వేరియంట్ లో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. అంతే కాకుండా ఇంటీరియర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉన్నాయి. క్యాబిన్లో 64 కలర్ యాంబియంట్ లైటింగ్ అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా దీనిని చాలా ఆధునికంగా కనిపించేలా చేస్తాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, UVO కనెక్టెడ్ కార్ టెక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటికి ఉన్నాయి. ఇందులో సీట్-బ్యాక్ ఫోల్డింగ్ టేబుల్‌, కెప్టెన్ సీట్ల కోసం ఒక టచ్ ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ రో సీట్లు మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

హ్యుందాయ్ అల్కాజార్‌ ఫీచర్స్:

హ్యుందాయ్ కంపెనీ యొక్క అల్కాజార్ కూడా లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 8-స్పీకర్‌తో కూడిన బోస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

ఇవి మాత్రమే కాకూండా ఇందులో హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సీట్‌బ్యాక్ టేబుల్, వన్ టచ్ మాన్యువల్ ఫోల్డింగ్ రో సీట్లు మరియు మొదటి మరియు రెండవ వరుసకు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు హ్యుందాయ్ అల్కాజార్‌లో అందించబడ్డాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

కియా కారెన్స్ & హ్యుందాయ్ అల్కాజార్ మధ్య తేడా:

మనం ఇప్పటివరకు పైన పేర్కొన్న ఫీచర్స్ లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ మరియు వెంటిలేటెడ్ సీట్లు వంటి అనేక ఫీచర్లను ఈ రెండింటిలోనూ సమానంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

అయితే హ్యుందాయ్ అల్కాజార్ లో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. అయితే కియా కారెన్స్ లో కియా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంటుంది. ఆల్కాజర్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు రెండవ వరుసలో వైర్‌లెస్ ఛార్జింగ్‌ని వంటివి అందుబటులో ఉన్నాయి. కియా కారెన్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిక్ టంబుల్ టంబుల్ కెప్టెన్ సీట్లు వంటి ఫీచర్లను కూడా పొందుతుంది.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

కియా మోటార్స్ తన కియా కారెన్స్ లో ఉండే సేఫ్టీ ఫీచర్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కావున మనకు ఖచ్చితంగా కియా కారెన్స్ లో ఉండే సేఫ్టీ ఫీచర్స్ తెలియదు. కానీ ప్రస్తుత తరంలో అందుబాటులో ఉండే అన్ని సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

హ్యుందాయ్ అల్కాజర్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, హిల్ అసిస్ట్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ వంటివి అందుబటులో ఉన్నాయి. అయితే కొత్తగా రానున్న కియా కారెన్స్ లో మాత్రం ఆరు ఎయిర్ బ్యాగులు అందుబాటులో ఉంటాయి.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

హ్యుందాయ్ అల్కాజార్ MPV యొక్క మిడ్-స్పెక్ ప్లాటినం ట్రిమ్ మాత్రమే 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది. అయితే కొత్త కియా కారెన్స్ లో ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు అందుబటులో ఉంటాయి. హ్యుందాయ్ అల్కాజార్‌లో 360-డిగ్రీ కెమెరా అందుబటులో ఉంటుంది. మొత్తానికి రెండూ కూడా అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతాయి అని మాత్రం చెప్పగలము.

Kia Carens Vs Hyundai Alcazar: ఇందులో ఏది బెస్ట్ అంటే?

కియా కారెన్స్ త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలవుతుంది. అయితే మార్కెట్లో ఇది విడుదలైన తరువాత ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, దాని ప్రత్యర్థికి ఎలాంటి పోటీ ఇస్తుంది అనే విషయాలు 2022 లో ఈ కొత్త MPV లాంచ్ అయిన తరువాత తెలుస్తాయి.

Most Read Articles

English summary
Kia carens vs hyundai alcazar mpv features comparison details
Story first published: Wednesday, December 22, 2021, 11:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X