మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

కొరియన్ కార్ కంపెనీ కియా ఇండియా (గతంలో Kia Motors) భారత మార్కెట్లో ఓ కొత్త 7 సీటర్ ఎమ్‌పివిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారును 'కియా కెవై' (Kia KY) అనే కోడ్‌నేమ్ తో అభివృద్ధి చేస్తున్నారు మరియు దీనిని డిసెంబర్ 16, 2021 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్నారు.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

భారత మార్కెట్లో ఈ సరికొత్త ఎమ్‌పివిని కియా కారెన్స్ (Kia Carens) అనే పేరుతో ప్రవేశపెట్టవచ్చని సమాచారం. ఇది మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా (Ertiga) మరియు ఎక్స్ఎల్6 (XL6) వంటి మోడళ్లతో పోటీ పడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మోడల్‌ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

కియా కారెన్స్ ఎమ్‌పివిని ప్రస్తుతం ఈ కంపెనీ తయారు చేస్తున్న కియా సెల్టోస్ (Kia Seltos) మరియు దాని అనుబంధ సంస్థ హ్యుందాయ్ తయారు చేస్తున్న క్రెటా (Hyundai Creta) ఎస్‌యూవీ మోడళ్ల మాదిరిగానే అదే ఎస్‌పి2 (SP2) ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 6 లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్ లో 3 వరుసల సీట్లతో అందించబడే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కియా సెల్టోస్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న అదే 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ లతో కియా కారెన్స్ రావచ్చని భావిస్తున్నారు. సెల్టోస్‌ ఎస్‌యూవీని, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 ఎన్ఎమ్‌ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ డీజిల్ 113 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్‌ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుండగా, డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

కియా నుండి రాబోయే ఈ కొత్త కెవై లేదా కారెన్స్ ఎమ్‌పివిని ప్రస్తుత తరం సెల్టోస్ ఎస్‌యూవీ ఆధారంగా తయారు చేస్తున్న నేపథ్యంలో, దాని ఇంటీరియర్ మరియు ఫీచర్లలోని అనేక అంశాలు సెల్టోస్ ఎస్‌యూవీతో పంచుకునే అవకాశం ఉంది. కియా ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్ అనే మూడు మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో మొదటివి రెండూ ఎస్‌యూవీ మోడళ్లు కాగా, మూడవది (కార్నివాల్) ఎమ్‌పివి మోడల్.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

కియా ఇండియా ఈ ఏడాది ఆరంభంలో, భారతదేశంలో అప్‌డేట్ చేయబడిన సెల్టోస్ మరియు సోనెట్ ఎస్‌యూవీలను కొత్త బ్రాండ్ లోగో మరియు అప్‌డేట్ చేయబడిన వేరియంట్‌ లతో విడుదల చేసింది. ఆ సమయంలో కంపెనీ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త మూడు-వరుసల మోడల్‌ను అభివృద్ధి చేనున్నట్లు కూడా ధృవీకరించింది. కాగా, ఈ మోడల్ ఇటీవల టెస్టింగ్ దశలో ఉండగా పలుమార్లు కెమెరా కంటికి కూడా చిక్కింది.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

ఈ ప్రోటోటైప్ ను భారీగా క్యామోఫ్లేజ్ చేసి ఉన్నప్పట్టికీ, ఇందులో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, వీల్ ఆర్చ్‌ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ వంటి డిజైన్ డీటేల్స్ వెల్లడయ్యాయి. మూడవ వరుసలో సీట్లను చేర్చేందుకు గాను కంపెనీ ఈ మోడల్ వీల్‌బేస్ ను కియా సెల్టోస్ కన్నా పెంచినట్లుగా తెలుస్తోంది. కియా సెల్టోస్ యొక్క వీల్‌బేస్ 2,610mm మిమీగా ఉంటుంది.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

కియా ఇండియా ఇటీవల భారతదేశంలో 'కారెన్స్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే, రాబోయే ఎమ్‌పివిని కియా కారెన్స్ అని పిలిచే అవకాశం ఉంది. కియా సంస్థకు ఇది భారతదేశంలో నాల్గవ ఉత్పత్తి కానుంది. సోనెట్ మరియు సెల్టోస్ మోడళ్ల మాదిరిగానే కారెన్స్ ఎమ్‌పివిని కూడా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో ఉన్న కియా ఇండియా ప్లాంట్ లో తయారు చేసే అవకాశం ఉంది. ఇది కియా కు మూడవ మేడ్ ఇన్ ఇండియా కారు అవుతుంది.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

ప్రస్తుతం, కియా విక్రయిస్తున్న కార్నివాల్ ఎమ్‌పివిని కంపెనీ విదేశాల నుండి సిబియూ రూట్‌లో దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. ఫలితంగా, ఈ కారు ధర కూడా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో, కియా నుండి కొత్తగా రాబోయే కారెన్స్ ఎమ్‌పివి సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరియు ఇది కియా మోడళ్ల మధ్య ఉన్న ధరల అంతరాన్ని తగ్గించనుంది.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

కియా కార్నివాల్ (Kia Carnival) 6-సీటర్ ఎమ్‌పివి వస్తోంది..

ఇదిలా ఉంటే, కియా ఇండియా గడచిన సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ కొత్త '2021 కియా కార్నివాల్' (2021 Kia Carnival) ఎమ్‌పివిలో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త 6-సీటర్ వేరియంట్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త 6-సీటర్ మోడల్ కార్నివాల్ ప్రెస్టీజ్ వేరియంట్లో లభ్యం కానుంది. మార్కెట్లో దీని ధరలు రూ. 28.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కానున్నాయి.

మారుతి సుజుకి ఎర్టిగాను ఎదుర్కునేందుకు Kia Carens 7 సీటర్ ఎమ్‌పివి వస్తోంది..!

కియా కార్నివాల్ ఎమ్‌పివిలో కంపెనీ గతంలో ఆఫర్ చేసిన 9-సీటర్ వేరియంట్ స్థానాన్ని ఈ కొత్త 6-సీటర్ వేరియంట్ భర్తీ చేస్తుంది. తక్కువ డిమాండ్ మరియు అమ్మకాల కారణంగా, కంపెనీ ఇందులో 9-సీటర్ వేరియంట్ ను నిలిపివేసింది. కాగా, ఈ 6-సీటర్ వేరియంట్ సీటింగ్ కాన్ఫిగరేషన్ ను గమనిస్తే, ఇందులోని మూడు వరుసలలో ఆరు కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఇవి ప్రయాణీకులకు అత్యుత్తమ సౌకర్యాన్ని అందిస్తాయి.

Most Read Articles

English summary
Kia ky 7 seater model to be unveiled on december
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X